క్రాంతివీరుడికి ఫాల్కే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో కొందరు హీరోలు రొమాంటిక్ పాత్రల్లో, ఇంకొందరు మేటినటులు యాక్షన్ చిత్రాల్లో రాణించగా- అందుకు భిన్నంగా మనోజ్‌కుమార్ దేశభక్తిని రగిలించే సినిమాలకు చిరునామాగా మారి ప్రేక్షకజనం నుంచి నీరాజనాలు అందుకున్నాడు. దేశభక్తి ఇతివృత్తంగా తీసే సినిమాలు వాణిజ్యపరంగా లాభాలు తెచ్చిపెట్టవని తెలిసినా అదే పంథాలో పయనించి చిరస్మరణీయ పాత్రల్లో మనోజ్ మెప్పించాడు. విప్లవ వీరుడు భగత్‌సింగ్ జీవితచరిత్ర ఆధారంగా 1965లో మనోజ్‌కుమార్ నటించిన ‘షాహీద్’ భారత స్వాతంత్య్ర సంగ్రామంపై వచ్చిన మేటి చిత్రంగా కీర్తిని ఆర్జించింది. ‘షాహిద్’ను ప్రేక్షకులు బాగా ఆదరించడంతో అదే రీతిలో దేశభక్తిని ప్రేరేపించే సినిమాల వైపే మనోజ్ మొగ్గు చూపాడు. 1965లో భారత్-పాక్ యుద్ధం తర్వాత అప్పటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్ర్తీ ‘జై జవాన్- జై కిసాన్’ నినాదంపై ఓ సినిమా తీయాలని మనోజ్‌కు సూచించారు. శాస్ర్తిజీ సూచనను దృష్టిలో ఉంచుకుని తొలిసారిగా దర్శకత్వం వహిస్తూ 1967లో ‘ఉప్‌కార్’ను మనోజ్ రూపొందించాడు. ఆ సినిమాలో జవాన్‌గా, కిసాన్‌గా ఆయన ద్విపాత్రాభినయం చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
‘ఉప్‌కార్’లో గుల్షన్ బావ్రా రాసిన ‘మేరే దేశ్ కి ధర్తీ’ పాట ఓ తరాన్ని ఉర్రూతలూగించింది. ఆ సినిమా మనోజ్‌కు తొలి ‘్ఫల్మ్‌ఫేర్’ అవార్డును తెచ్చిపెట్టింది. దేశభక్తిని ప్రేరేపిస్తూ ఆయన నటించిన ‘పూరబ్ అవుర్ పశ్చిమ్’ (1970), బేయమ్మాన్ (1972), ‘షోర్’ (1972) సినిమాలతో ఆయన పలు అవార్డులను కైవసం చేసుకున్నాడు. ఆయన నటించిన ‘హర్యాలీ ఔర్ రాస్తా’, ‘ఓ కౌన్ థీ’, ‘హిమాలయ్ కీ గోద్మె’, ‘దో బదన్’, ‘పత్తర్ కి సనమ్’, ‘నీల్ కమల్’ వంటి చిత్రాలు ఆయనలోని నటుడ్ని ఆవిష్కరించాయి. దేశభక్తి సినిమాలతో ఖ్యాతి పొందిన మనోజ్‌ను ‘్భరత్ కుమార్’ అని కూడా ప్రేక్షకులు పిలుచుకుంటారు.
1970 దశకంలో ఆయన నటించిన పలు సాంఘిక చిత్రాలకు కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అమితాబ్ బచ్చన్, శశికపూర్, జీనత్ అమన్‌లతో కలిసి మనోజ్ నటించిన ‘రోటీ కపడా ఔర్ మకాన్’ 1974లో సంచలన విజయం నమోదు చేసింది. ఈ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా ఆయన రెండోసారి ‘్ఫల్మ్‌ఫేర్’ అవార్డును అందుకున్నారు. తన అభిమాన హీరో దిలీప్ కుమార్ నటించిన ‘క్రాంతి’ (1981)కి దర్శకత్వం వహించాక, నటుడిగా ఆయన ప్రాభవం తగ్గుముఖం పట్టింది. ‘జాట్ పంజాబీ’ అనే పంజాబీ సినిమాలోనూ నటించిన మనోజ్ 1995లో ‘మైదాన్-ఇ-జంగ్’లో కాసేపు కనిపించి ఆ తర్వాత నట జీవితానికి స్వస్తి పలికాడు.
తన కుమారుడు కునాల్ గోస్వామి హీరోగా నిర్మించిన ‘జై హింద్’ (1999)కి సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా ‘్ఫల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ను తెచ్చిపెట్టింది. పలు సినిమాల్లో ముఖానికి చేతిని అడ్డం పెట్టుకోవడం ఆయన ‘మేనరిజం’గా పాపులర్ అయింది. తర్వాత కాలంలో ఆయన మేనరిజాన్ని పలువరు కమెడియన్లు అనుకరించడం పరిపాటైంది. 2007లో షారుఖ్ ఖాన్ ‘ఓం శాంతి ఓం’ సినిమాలో అలాగే అనుకరించడం మనోజ్‌ను బాధించింది. దీంతో ఆయన కోర్టుకెక్కి, ఆ తర్వాత షారుఖ్‌తో కోర్టు బయట పరిష్కరించుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
రాజకీయాల్లో..
చాలామంది నటుల్లానే మనోజ్ కూడా రాజకీయాలపై ఆసక్తి చూపి శివసేన పార్టీలో 2004 సాధారణ ఎన్నికల సమయంలో చేరారు.
దేశ విభజనకు ముందు ఇప్పటి పాకిస్తాన్‌లోని ఒబొట్టాబాద్‌లో 1937లో జన్మించిన మనోజ్‌కుమార్ అసలు పేరు హరికృష్ణగిరి గోస్వామి. భార్య శశి గోస్వామి. కుమారులు కునాల్ గోస్వామి, విశాల్ గోస్వామి. కుమారుల్లో విశాల్ గాయకుడిగా, కునాల్ నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. మనోజ్ తమ్ముడు రాజీవ్ గోస్వామి కూడా బాలీవుడ్‌లో అడుగుపెట్టినా వీరెవరూ అంతగా రాణించలేక పోయారు. 1968లో ‘ఉప్‌కార్’తో జాతీయ అవార్డు అందుకోగా, ఇపుడు ఆయన కీర్తికిరీటంలో ‘దాదా ఫాల్కే అవార్డు’ చేరింది.