రాష్ట్రీయం

చత్తీస్‌గఢ్‌లో మావోల విధ్వంసకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరో బస్సుకు నిప్పు
పోలీస్ వాహనంపై కాల్పులు
నలుగురు మావోయిస్టుల అరెస్ట్
మందుపాతర స్వాధీనం

భద్రాచలం, నవంబర్ 24: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల విధ్వంసకాండ కొనసాగుతోంది. బుధవారం దండకారణ్యం బంద్ నేపథ్యంలో మావోయిస్టులు రాష్టవ్య్రాప్తంగా తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. జాతీయ రహదారి 30పై జగ్దల్‌పూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న అశ్విన్ రాజ్‌కుమార్ ట్రావెల్స్‌కు చెందిన బస్సును మంగళవారం ఉదయం సుకుమా జిల్లా తొంగ్‌పాల్ వద్ద సాయుధ మావోయిస్టులు అటకాయించారు. ప్రయాణికులను కిందకు దించి బస్సును దహనం చేశారు. ఈ సంఘటన తెలుసుకుని పోలీసు బలగాలు అక్కడకు చేరుకోగా ల్యాండ్‌మైన్‌ప్రూఫ్ వాహనంపై విచక్షణా రహితంగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. అయితే జవాన్లు వాటిని తిప్పికొట్టారు. గాదేరాజ్ వద్ద సుకుమా- దంతెవాడ జిల్లాల మధ్యలో చెట్లు నరికి రోడ్డుకు అడ్డంగా పడేశారు. వాల్‌పోస్టర్లు, బ్యానర్లు వదిలారు. కాంకేర్ జిల్లాలోని కోయ్లిబేడా పోలీసుస్టేషన్ పరిధిలో ఆపరేషన్ గ్రీన్‌హంట్ నిలిపివేయాలని, మావోయిస్టులపై వైమానిక దాడులను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బ్యానర్లు కట్టారు. రెండురోజుల క్రితం నాగుల్‌గూడా గుట్టలపై పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మహిళా మావోయిస్టులు మృతిచెందడాన్ని వారు నిరసించారు. కాగా సుకుమా- జగ్దల్‌పూర్ రహదారిలో 73వ మైలురాయి వద్ద మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతరను 226 బెటాలియన్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్లు గుర్తించి నిర్వీర్యం చేశారు.
కాగా రాజ్‌నంద్‌గావ్ జిల్లా పరిధిలో నలుగురు మహిళా మావోయిస్టులను మంగళవారం రాజ్‌నంద్‌గావ్ పోలీసులు అరెస్టు చేశారు. దర్రెకసా ఏరియా కమిటీకి చెందిన ఈ నలుగురు వద్ద నుంచి 311 డిటోనేటర్లు, 2 బర్మా తుపాకులు, ఒక 12బోర్ తుపాకీ, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఐజే ముఖేష్‌గుప్తా వెల్లడించారు. దంతెవాడ జిల్లాలోని కేశాపూర్ అడవుల్లో మావోయిస్టులకు, డీఆర్‌జీ బలగాలకు బైలడిల్లా ప్రాంతంలో ఎదురు కాల్పుల సంఘటన చోటు చేసుకుంది. కాగా ఇదే జిల్లాలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు సెక్షన్ కమిటీ కమాండర్ మృతిచెందాడు. ఇతనిపై రూ.3 లక్షల రివార్డు ఉంది. (చిత్రం) మందుపాతరల కోసం సిఆర్‌పిఎఫ్ జవాన్ల గాలింపు ... మృతిచెందిన మావోయిస్టు