రాష్ట్రీయం

సర్పంచ్ సహా ఇద్దరు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎఓబిలో మావోయిస్టుల దురాగతం
సీలేరు, డిసెంబర్ 26: ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతం (ఎఓబి)లో పోలీస్ ఇన్‌ఫార్మర్లనే నెపంతో ఒక సర్పంచ్‌ను, మరో సర్పంచ్ కుమారుడిని మావోయిస్టులు హతమార్చారు. ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితిలోని బొడుపొదర్ పంచాయతీ సర్పంచ్ కొర్రా జయరామ్ (26)ను శుక్రవారం రాత్రి మావోయిస్టులు కిరాతకంగా హతమార్చగా, ఇదే ప్రాంతంలోని నక్కమామిడి పంచాయతీ సర్పంచ్ కుమారుడు రుక్కు(20)ను శనివారం తెల్లవారు జామున కాల్చి చంపారు. జయరామ్ గత రెండు సంవత్సరాలుగా బొడుపొదర్ సర్పంచ్‌గా పని చేస్తున్నారు. జయరామ్ గతంలో మావోయిస్టు సానుభూతి పరుడుగా వ్యవహరించేవాడు. అయితే కొంత కాలంగా జయరామ్‌కు మావోయిస్టులతో విభేదాలు రావడంతో బొడుపొదర్ నుంచి చిత్రకొండకు మకాం మార్చాడు. ఇటీవల బిఎస్‌ఎఫ్ పోలీసులు అవుట్ పోస్టు ఏర్పాటు చేయడంతో జయరామ్ నాలుగు నెలల క్రితమే తిరిగి బొడుపొదర్ గ్రామానికి మకాం మార్చాడు. శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో సాయుధులైన దాదాపు 50 మంది మావోయిస్టులు బొడపొదర్‌కు చేరుకుని ఇంట్లో నిద్రిస్తున్న జయరామ్‌ను బయటకు తీసుకువెళ్ళి ప్రజాకోర్టు నిర్వహించి, పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నావంటూ ఆరోపించారు. ఎన్ని సార్లు హెచ్చరించినా మార్పురానందున హతమార్చుతున్నట్టు ప్రజాకోర్టులో తీర్మానించారు. అనంతరం జయరామ్ ఇంటి ముందే కర్రలతో కొట్టి, పీక కోసి హతమార్చారు. అలాగే నక్కమామిడి సర్పంచ్ కుమారుడు రుక్కును శనివారం తెల్లవారు జామున గ్రామ శివార్లకు తీసుకువెళ్ళి తుపాకీతో కాల్చి చంపారు. ఇన్‌ఫార్మర్లుగా ఎవరు వ్యవహరించినా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.