బిజినెస్

వదలని ఫెడ్ రిజర్వ్ భయాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత వారమంతా నష్టాల్లో దేశీయ మార్కెట్లు
25 వేల పాయింట్లకు చేరిన సెన్‌సెక్స్
9 నెలల్లో 5 వేల పాయింట్లు నష్టపోయిన సూచీ
రూ.10 లక్షల కోట్లు కోల్పోయిన మదుపరులు
గత వారం మార్కెట్ రివ్యూ

ముంబయి, డిసెంబర్ 12: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో వడ్డీ రేట్లను పెంచాలా వద్దా అనే దానిపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చే వారం నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో వ్యాపారులు, ఇనె్వస్టర్లు అచి తూచి నిర్ణయాలు తీసుకోవడంతో గత వారమంతా కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగాయి. శుక్రవారం కూడా సెన్‌సెక్స్ 208 పాయింట్లు నష్టపోయి 25,044 పాయింట్ల స్థాయికి పడిపోయింది. ఒక దశలో సెన్‌సెక్స్ 25 వేల పాయింట్ల దిగువకు కూడా చేరుకుంది. ఈ ఏడాది మార్చి 4న గరిష్ఠస్థాయికి చేరిన సెనె్సక్స్ గత తొమ్మిది నెలల కాలంలో 5 వేల పాయింట్లకు పైగా నష్టపోయింది. ఫలితంగా ఇనె్వస్టర్లు ఇప్పటివరకు 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా కోల్పోయారు. ప్రస్తుతం బిఎస్‌ఇ మార్కెట్ విలువ రూ. 95.13 లక్షల కోట్లు ఉంది. మొత్తంమీద గత వారం బిఎస్‌ఇ సెన్‌సెక్స్ దాదాపు 594 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 171 పాయింట్లకు పైగా నష్టపోయింది.
శుక్రవారం మార్కెట్లో వడ్డీ రేట్లతో ముడిపడిన బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ లాంటి రంగాలకు చెందిన షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అయితే వరసగా రెండు రోజులు అమ్మకాలకు దిగిన విదేశీ ఫండ్స్ శుక్రవారం ప్రధానంగా కొనుగోళ్లకు దిగడంతో దాదాపు రూ. 254 కోట్ల విదేశీ పెట్టుబడులు మార్కెట్లోకి వచ్చినట్లు బిఎస్‌ఇ గణాంకాలు చెప్తున్నాయి. ఈ నెల 16న అమెరికా ఫెడరల్ రిజర్వ్ గనుక వడ్డీ రేట్లను పెంచాలని నిర్ణయిస్తే దేశంలో వడ్డీ రేట్లు పెరగడానికి అది దారి తీసి భారతీయ మార్కెట్లనుంచి విదేశీ పెట్టుబడులు తరలివెళ్తాయనే భయాలే బ్యాంకింగ్, రియల్టీ రంగాల షేర్లు పడిపోవడానికి ప్రధాన కారణం.వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసుల కంపెనీలు, వడ్డీ రేట్లతో ముడిపడిన సంస్థలకు డిమాండ్ పెరగడం, వడ్డీ రేట్లు పెరిగితే డిమాండ్ తగ్గడం సాధారణంగా జరుగుతూ ఉండడం తెలిసిందే.
మరోవైపు మితిమీరి రుణాలకోసం వెళ్లవద్దని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ కార్పొరేట్ సంస్థలను హెచ్చరించడం కూడా మార్కెట్ కష్టాలకు తోడయ్యాయి. దీంతో బ్యాంకింగ్ సంస్థల షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలకు కారణమైందని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ డిస్ట్రిబ్యూషన్ విభాగం ప్రెసిడెంట్ జయంత్ మాగ్లిక్ అభిప్రాయ పడ్డారు.
మరోవైపు కాంగ్రెస్ వ్యతిరేకత కారణంగా వస్తు సేవల పన్ను(జిఎస్‌టి) బిల్లు ఆమోదం ఆలస్యం కావడంతో పాటుగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోవడం, చైనా ఆర్థిక వృద్ధి గణాంకాలు ఆశించిన మేరకు లేకపోవడంలాంటివన్నీ కూడా మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపించాయని డీలర్లు అంటున్నారు.
అయితే శుక్రవారం మార్కెట్ లావాదేవీలు ముగిసిన తర్వాత ప్రకటించిన పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు అద్భుతంగా ఉండడంతో సోమవారం మార్కెట్లు తెరిచిన తర్వాత రెగిటివ్ సెంటిమెంట్‌ను కొంతమేరకు తగ్గవచ్చని బ్రోకర్లు అంటున్నారు. అక్టోబర్ నెలలో పారిశ్రామిక వృద్ధి 9.8 శాతంగా నమోదు కావడం తెలిసిందే. గత అయిదేళ్లలో ఇంత భారీ వృద్ధి నమోదు కావడం ఇదే మొదటిసారి. అయితే ఇది ఆనవాయితీకి భిన్నమని, ఎందుకంటే గత ఏడాది దీపావళి అక్టోబర్‌లో వస్తే ఈ ఏడాది నవంబర్‌లో వచ్చిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. శుక్రవారం నష్టపోయిన వాటిలో ఐసిఐసిఐ బ్యాంక్, టాటా మోటార్స్, మహింద్ర, మహింద్ర అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ మూడు కంపెనీలు కూడా 2నుంచి 4 శాతం మధ్య నష్టపోయాయి. అయితే టాటా స్టీల్ 3.4 శాతం మేర లాభపడ్డం మార్కెట్ల పతనాన్ని కొంతమేరకు ఆపగలిగింది.