బిజినెస్

నెల గరిష్ఠానికి సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

195 పాయింట్ల లాభంతో 26వేల స్థాయి ఎగువకు
7,900 పాయింట్లను అధిగమించిన నిఫ్టీ

ముంబయి, డిసెంబర్ 28: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ దాదాపు నెల గరిష్ఠ స్థాయిని తాకుతూ 26వేల స్థాయికి ఎగువన 195.42 పాయింట్ల లాభంతో 26,034.13 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 64.10 పాయింట్లు పెరిగి 7,900 స్థాయి అధిగమించి 7,925.15 వద్ద స్థిరపడింది. హెల్త్‌కేర్, ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్లు మదుపరులను ఆకట్టుకోవడంతో మార్కెట్లు పరుగులు పెట్టాయి. గురువారంతో డిసెంబర్ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనున్న క్రమంలో మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరచడాన్ని మార్కెట్ విశే్లషకులు స్వాగతిస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే ఆసియా మార్కెట్లలో మిశ్రమ స్పందన కనిపించగా, ఐరోపా మార్కెట్లు లాభాలను అందుకున్నాయి.