బిజినెస్

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 23: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. మదుపరులు లాభాల స్వీకరణ వైపునకు వెళ్ళడంతో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 49.15 పాయింట్లు పడిపోయి 25,819.34 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 7.30 పాయింట్లు కోల్పోయి 7,849.25 వద్ద నిలిచింది. ఆసియా మార్కెట్లు బలహీనంగా ముగియడం, ఐరోపా మార్కెట్లు ఆరంభంలోనే తడబాటుకు గురవడం వంటివి మదుపరులను కొనుగోళ్ళకు దూరం చేశాయి.

ప్రభుత్వ బాండ్లకు విశేష స్పందన
న్యూఢిల్లీ: సోమవారం ప్రభుత్వ బాండ్ల వేలానికి విదేశీ మదుపరుల నుంచి విశేష స్పందన లభించింది. 332 కోట్ల రూపాయల విలువైన బాండ్లకు 521 కోట్ల రూపాయల బిడ్లు దాఖలయ్యాయి.
సాధారణ ట్రేడింగ్ అనంతరం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు గంటలపాటు ప్రభుత్వ రుణ సెక్యూరిటీల వేలం జరిగింది. కాగా, ప్రభుత్వ రుణ సెక్యూరిటీల్లో 1,29,900 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ పోర్ట్ఫోలియ మదుపరుల (ఎఫ్‌పిఐ)కు అనుమతి ఉండగా, గత నెల అక్టోబర్ 29వరకు ఈ పెట్టుబడుల విలువ 1,29,048 కోట్ల రూపాయలకు చేరుకుంది. తాజా వేలంతో మరింతగా పెరగనుంది.