Others

ఇక పెళ్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదేళ్ల క్రితం హీరోయిన్‌గా వెలుగు వెలిగిన ప్రీతిజింతా పెళ్లి మాట ఎత్తకుండా ఇన్నాళ్లు వ్యాపార రంగంలో మునిగిపోయింది. నెస్‌వాడియాతో ప్రేమలో మునిగిపోయిన ఈ అమ్మడు ఆయనే్న పెళ్లిచేసుకుంటానని చెప్పినా ఆ తర్వాత బ్రేకప్ ఇచ్చింది. వ్యాపారంలో ఒడుదుడుకులు చవిచూసే సమయంలో ఇక పెళ్లిచేసుకోదేమో అనుకున్న సమయంలో తాజాగా ఓ వార్తని ప్రకటించింది. ఓ అమెరికా వ్యక్తితో తాను ప్రేమలో ఉన్నట్లుగా తెలిపింది. అతని పేరు జీనీగుడేనఫ్ అని సమాచారం. ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ప్రేమలోపడ్డ మాట నిజమేనని, జనవరిలో తాను పెళ్లిచేసుకోడానికి సిద్ధమవుతున్నానని, ఈలోపు బిజినెస్ కార్యక్రమాలన్నీ చక్కబెట్టే పనిని పూర్తిచేసి, పెళ్లిపీటల మీద కూర్చోబోతున్నానని చెప్పుకొచ్చింది. ఏమో అన్నీ కుదిరితే జనవరి 8న ప్రీతిజింతా పెళ్లి జరగనుందని సమాచారం.