మెయిన్ ఫీచర్

పర్యావరణ హితంగా పరిణయ వేడుక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో పెళ్లి సంబరం అంటే చాలు- ఆర్భాటాలకు, అనవసర ఖర్చులకు అంతూ పొంతూ ఉండదు. పలురకాల వంటకాలకు, సినిమా సెట్టింగ్‌లను తలపించే కల్యాణ మండపాలకు మంచినీళ్ల ప్రాయంగా డబ్బు వెచ్చిస్తుంటారు. పెళ్లి వేడుకలో ఆర్భాటాలు లేకుంటే అది తమ హోదాకు తక్కువని భావిస్తూ అప్పు చేసి మరీ లక్షలాది రూపాయలు ఖర్చు చేయడం ఆనవాయితీగా మారింది. సంపన్న వర్గాల్లో అయితే ఇది మరీ వేలం వెర్రిగా ఉంటుంది. ఇటీవల కేరళలో ఓ ఎన్‌ఆర్‌ఐ వ్యాపారవేత్త తన కుమార్తె పెళ్లి సంబరానికి 55 కోట్ల రూపాయల్ని ఖర్చు చేయడం సంచలన వార్తగా మీడియాకెక్కింది. అయితే, ఇందుకు పూర్తి విరుద్ధంగా బెంగళూరులో ఓ అమాత్యుడి ఇంట నిరాడంబరంగా వివాహ వేడుక జరగడం కూడా అంతే సంచలనం సృష్టించింది.
విందు భోజనాలు, బహుమతులు, అలంకరణలో వృథా ఖర్చును నియంత్రించడమే కాదు, పర్యావరణ హితంగా ఈ వివాహ వేడుక జరగడం అందరి దృష్టినీ ఆకట్టుకుంది. కర్నాటక రవాణాశాఖ మంత్రి ఆర్.రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డి పెళ్లి వేడుక నిరాడంబరంగా, పర్యావరణ హితంగా జరిగింది. జంతువుల హక్కుల ఉద్యమ కార్యకర్తగా, పర్యావరణ ప్రేమికురాలిగా సామాజిక సేవ చేస్తున్న సౌమ్య తన వివాహంలో వృథా ఖర్చును నివారించాలని భావించారు. విందు భోజనంలో అనవసరమైన వంటకాలను పూర్తిగా తగ్గించడమే కాదు, వేడుక అనంతరం చెత్తాచెదారాన్ని ఎక్కడ పడితే అక్కడ పడవేసి పర్యావరణానికి చేటు కలిగించరాదని ఆమె సంకల్పించారు. భోజనాలు ముగిశాక చెత్తను వేరుచేసి మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి అప్పగించారు. పూలు, పండ్లు, అలంకరణ సామగ్రి ఏ మాత్రం వృథా కాకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. పెళ్లి మండపం అలంకరణ, విందు భోజనం, బహుమతులు.. ఇలా అన్ని విషయాల్లోనూ పర్యావరణానికి హాని కలగని రీతిలో వధువు సౌమ్య చెప్పినట్లే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. విందులో నెయ్యి, పాలు, పెరుగుకు బదులు కొబ్బరి నీళ్లు, సోయా పాలు, సోయా జావ వంటివి అతిథులకు ఇచ్చారు. సోయా పాలతో చేసిన కాఫీ, టీలు మాత్రమే అందించారు. మం డపం అలంకరణకు కాగితం పూలనే ఎక్కువగా వాడారు. ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లకు బదులు స్టీల్ సామగ్రిని వినియోగించారు. పెళ్లికి వచ్చిన అతిథులందరికీ జ్ఞాపికలుగా మొక్కలను అందజేశారు. చందనం, వేప, రోజ్‌ఉడ్, జామ వంటి మొక్కలను ప్రభుత్వ నర్సరీల నుంచి కొనుగోలు చేశారు. విలువైన కానుకలు, పూల బొకేలు తీసుకురావద్దని పెళ్లి పత్రికలో సూచించారు. మళ్లీ వాడేందుకు ఉపయోగపడే కాగితంతోనే కొన్ని పెళ్లి పత్రికలు ముద్రించారు. చాలామందికి ‘ఈ-మెయిల్’లోనే ఆహ్వానాలు పంపారు. అతిథులు పట్టు, తోలు, ఉన్ని వస్త్రాలు ధరించరాదని కోరారు. జంతు చర్మాలతో తయారు చేసే ‘గిఫ్ట్’లు తేవద్దని విజ్ఞప్తి చేశారు. ఖరీదైన మేకప్‌కు దూరంగా వధూవరులు సాదాసీదాగా హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకల నిర్వహణ బాధ్యతను తీసుకున్న ‘హసిరు దలా’ సంస్థ పర్యావరణ పరిరక్షణకు రెండేళ్లుగా విశేష కృషి చేస్తోంది. పెళ్లిళ్లు, ఇతర వేడుకల సందర్భంగా టన్నుల కొద్దీ ఉత్పత్తయ్యే చెత్త వల్ల పర్యావరణం దెబ్బతింటోందని, ఈ విషయంలో ప్రజలను చైతన్య పరచడమే తమ ధ్యేయమని ఆ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. * (చిత్రం) వరుడితో వధువు సౌమ్య