అక్షర

పరిపూర్ణత్వానికి మార్గం.. మాస్టరిజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్టరిజం: ప్రజ్ఞాన రహస్యాలు
-డా.వాసిలి వసంతకుమార్
పుటలు: 160, వెల: రూ.200/-
ప్రతులకు: ‘యోగాలయ’,
ప్లాట్ 90, కృష్ణా ఎన్‌క్లేవ్,
కానాజిగూడ, యం.డి.్ఫమ్‌రోడ్,
తిరుమలగిరి,
సికింద్రాబాద్- 500 015.
సెల్: 9393933946, 9393933939

‘మాస్టర్ యోగం’గా ప్రఖ్యాతమైన ‘్భృక్తరహిత తారక రాజయోగా’నిది వందేళ్ల క్రితం ఒక ప్రయోగదశ. నాటినుండి అది పరిణమిస్తూ ఈనాడు పరిణతిని చేరుకుంది. మాస్టర్ యోగం ప్రజ్ఞాన పొత్తం అయింది. ఆ యోగప్రజ్ఞాన రహస్యాలను అక్షరబద్ధం చేయటం జరిగింది డా.వాసిలి వసంతకుమార్. ‘మాస్టరిజం: ప్రజ్ఞాన రహస్యాలు’ పుస్తకం ద్వారా.
హ్యూమన్ కాన్షియస్‌నెస్- హయ్యర్ కాన్షియస్‌నెస్‌గా మారడమే పరిపూర్ణత్వం.
సామాన్యంగా మనం మన చుట్టూ జరుగుతున్న ప్రతిదానినీ అర్థం చేసుకోవాలనుకుంటా ము... కానీ మనల్నిమనం పట్టించుకోము. అలా పట్టించుకున్న ప్రజ్ఞే ఏ యోగసాధనకైనా ముఖ్యం.
హాలీకామెట్ వంటి తోకచుక్కలు విశ్వపరిణామ ప్ర కారం నిర్జీవాలవుతున్న వాటిని జీవమయం చేస్తూ ‘‘స్పిరిట్యువల్ ఫోర్స్ సెంటర్స్’’గా మారి తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటాయి.
ఈ స్పిరిట్యువల్ ఫోర్స్ సెంటర్స్ వలననే యోగి జీవన విధానం ముఖ్యంగా సూక్ష్మశరీరమైన ఆస్ట్రల్ బాడీ ఆకాశతత్త్వమైన ఈథరిక్ సబ్‌స్టన్స్ గుండా తీవ్ర రాపిడితో ముందుకు వెళ్ళేటప్పుడు కొన్ని యోగానుభవాలు అవుతాయి... ఈ యోగంలో స్ర్తిపురుష భేదం లేదు... సంసార జీవితం త్యజించాలి, సర్వం వదిలి సన్యసించాలి అన్న నియమం లేదు. పైగా, సాంసారిక జీవితంలో ఉన్నవారికే ఈ సాధన సులభతరం అన్న పద్ధతి కూడా ఉన్నది.
ఆత్మిక ప్రాణ సాధనే మాస్టర్ యోగ రహస్యం. ఆకాశతత్వంలోని అనంత ప్రాణతత్వంతో మమైక్యం అయినప్పుడే ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ సాధ్యవౌతుంది. దీన్ని చాలావిధాల వివరించారు మాస్టర్‌గారు.
ఇంతకీ ఈ యోగం కర్మరాహిత్యం ఇస్తుందా?! గత జన్మల అవశేషాల విముక్తి, మన తాత తండ్రుల కర్మలు కూడా మనమీద ప్రభావం చూపుతాయి... వాటి అన్నింటినుంచీ విముక్తిపొందడమే కర్మరాహిత్యం. అంతేకానీ, గత జన్మల కర్మఫలాలను అనుభవిస్తూ ‘‘నా కర్మ ఇంతే’’అని నిరాశ, దుఃఖానుభవాలతో జీవితాన్ని ఈడ్చుకుంటూ రావడం కాదు.
ఈ యోగంవలన మనం ‘‘నేను’’కు పరిమితం కాకుండా సృష్టి గురించి తపన, మనిషి గురించి చింతన, భూమి గురించి ఆరాటం, ప్రపంచాన్ని గురించి ఆవేదన, ఖగోళాన్ని గురించి వ్యాకులత- ఇవన్నీ మనం ప్రార్థనా రూపంలో ప్రతిధ్వనిస్తాం.
ఈ పరిణామ పథంలో ఒకవేళ మనం ఎన్నుకున్న అదివరకటి భక్తిమార్గాలు మనకు భయభ్రాంతులిస్తే... మనం వెంటనే ఈ పరిస్థితినుంచి బంధవిముక్తులమవ్వాలి... ఎందుకంటే మనకు కావల్సిన అమృత భాండం ‘‘అభయం’’... విశ్వాసం, స్వేచ్ఛ, మైత్రి- ఇదే ఈ యోగం ఇచ్చే కానుక. అందుకే మాస్టర్ యోగం చేసేవారందరూ ఒక స్థితిలో ఫ్రెండ్స్ అవుతారు... తక్కువ ఎక్కువలు ఉండకూడదు ఇక్కడ.
మరి ఈ యోగంవలన భౌతికమైన జీవితానికి ఏమైనా ప్రయోజనాలుంటాయా?! ఉంటాయి... ‘‘మాస్టర్స్ ఛీఫ్‌లైఫ్’’ అనేది రెండు దేహాల కుండలిని... ఇనీషియేషన్- ఉపదేశం నాటి నుంచీ మీడియంగా మన దేహం కేవలం భౌతిక దేహం మాత్రమేకాదు. మన లోపల మాస్టర్ దేహం సెల్ ఇక్విప్‌డ్ బ్యాటరీలాగా పనిచేస్తుంది. మన శ్రద్ధ, దిశానిర్దేశాన్ని బట్టి మన ‘‘అవసరాలు’’ తీరిపోతాయి. సిస్టమ్ డెవలప్‌మెంట్‌తో లోపాలు సవరించబడతాయి. గ్రహ ప్రభావాలనుంచి రక్షణ, ‘‘విధి’’ప్రభావం తగ్గడం, కష్టాల అనుభవాల భారం తగ్గిపోతుంది. ఒకే జన్మలో మాస్టర్స్ స్థితికి తీసుకువెళ్లగలిగిన యోగం ఇది.
భృక్తరహిత తారక రాజయోగ సాధనలో ఉండే నిర్గుణ రహస్యాలు+ సద్గుణ రహస్యాలు= ప్రజ్ఞాన రహస్యాలు- ఇవన్నీ ఈ పుస్తకంలో వివరించారు డాక్టర్ వాసిలి వసంతకుమార్‌గారు. ఆయన యోగ సాధనలో మాస్టర్‌గారి వద్దనుంచి వచ్చిన డివైన్ సోర్స్ డైరెక్ట్ రేస్ ఈ అక్షర ప్రబంధం.
మాస్టర్ సి.వి.వి.గారి యోగం గురించి చాలా పుస్తకాలు చదువుకోవడానికి అందుబాటులో ఉండవచ్చును. కానీ ఈ పుస్తకం చదవడంవలన జరిగే మేలు మనకు ఏమిటి?
మన బాడీ, మైండ్, ఎమోషన్స్ ఇవి సంయమనం పొందితే కానీ, మన యోగసాధన కుండలినీ సాధనగా మారదు... ఎంతమంది కుండలినీ గురించి చెపుతున్నా అది మోక్షసాధన, కొన్ని కామ్య విషయాల సాధనల దగ్గర ఆగిపోయాయేమో... కానీ ఈ పుస్తకంలో ఈ యోగసాధన వలన మన‘‘లో’’ మార్పులు, అనూహ్యమైన, అద్భుతమైన మార్పులు అర్థమవడం ప్రారంభవౌతాయి... ఏమిచేస్తే ఎలా ఎందుకు జరుగుతుందో మన మనస్సును, దేహాన్ని కట్టడి చెయ్యడం తెలీనంతకాలం కుండలినీ యోగం వైపు కనె్నత్తి చూడకపోవడం మంచిది అన్న స్పష్టమైన హెచ్చరిక ఉంటుంది.
మామూలు కుండలినీ యోగసాధనలో మూలాధారం నుంచి కుండలిని సహస్రారానికి ప్రయాణం చెయ్యడం చెప్తారు. కానీ మాస్టర్ సి.వి.వి.గారి యోగ సాధనలో సహస్రారం నుంచి కుండలిని శక్తిచాలనం జరగడం వలన ఏయే మార్పులు మన భౌతిక, యోగ శరీరాల్లో జరుగుతాయి?! అన్నది వివరంగా చెప్పారు రచయిత.
మనలోని ప్రతి ఒక్కరిలో పుట్టుకతో స్వతస్సిద్ధంగా సుషుమ్న నిర్మాణం సరిగ్గా జరగలేదని, ఆ కారణంగా సహస్రారం పునర్నిర్మితం కావల్సిన అవసరం ఉన్నదని మాస్టర్ సి.వి.వి.గారు తమ ప్రజ్ఞాప్రాభవాలతో గుర్తించగలిగారు... అందుకే అందరినీ ప్రిపరేటరీ కోర్స్ చెయ్యాలి... అందులో మెర్చరీ కోర్స్ పురుషులు చెయ్యాలి, మహిళా మీడియమ్స్ మెర్చరీ వెబ్ చెయ్యాలి... ఇవి ఎందుకు చెయ్యాలి?! వీటి తరువాత ఏయే కోర్సులు చెయ్యాలి?! దీని ఫలితం మనలోని షష్ట శక్తుల సంగమం అంటే పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, శబ్దశక్తి, కుండలినీశక్తి ‘‘కూడలి’’ విడివిడిగా ఎలా ఏర్పడుతుంది? ఇవన్నీ వివరంగా ఈ పుస్తకంలో తెలుస్తాయి. పరాశక్తి అంటే ఈ శుద్ధశక్తి సంకేతమే... క్షణికం, దీర్ఘకాలికం అనే రెండువిధాల జ్ఞానంతో మనం శారీరకంగా, మానసికంగా సంతృప్తులం అవుతాం... సాత్విక సంయమనం ఇచ్ఛాశక్తి ఫలితం-
మన శరీరంలోని ఏఏ భాగాలలో ఏఏ చక్రాలు ఏఏ కోర్సుల వలన శక్తివంతమై, తేజస్సు ఇస్తాయి? ఇట్లాంటి యోగ రహస్యాలు ముఖ్యంగా సాధకుడిగా రచయిత సాధించి అనుభవించినవి ఎన్నో ఈ పుస్తకంలో నిక్షిప్తమై ఉన్నాయి... జిజ్ఞాసువులకు, యోగామీద రీసెర్చ్ చేస్తున్నవారికి ఈ పుస్తకం చాలా ఉపయోగిస్తుంది... కొన్ని పుస్తకాలు జ్ఞానం మాత్రమే ఇస్తాయి. కానీ, ఈ పుస్తకం మార్గం కూడా తెలియపరుస్తుంది. ఏది ఎందుకు ఎలా జరుగుతుందో చెపుతుంది.

-జలంధర