మెయిన్ ఫీచర్

కళలతోనే కలలు సాకారమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహుముఖ కళా, సాహిత్య సాధనతో బాల్యం నుంచి నిరంతర కృషి, ప్రతిభతో పలు రంగాల్లో కళలను సొంతం చేసుకుని, ఆ కళలను పదిమందికి పంచి పెట్టాలన్న ధ్యాసతో సంగీతం, సాహిత్యం, చిత్రకళ, గృహాలంకరణ అంశాలను ఎన్నో వ్యాసాలుగా తయారుచేసివివిధ పత్రికల్లో ప్రచురింపచేశారు. సాహిత్యంలో కథ, కవిత, మినీ కవిత, హైకూ, వ్యాసము, వంటలు, నవల, ఉత్తరాలు, ఇంటర్వ్యూల ద్వారా ప్రముఖులైన జస్టిస్ అమరేశ్వరి బసవ రాజేశ్వరి, మాగంటి వరలక్ష్మి జాతీయ అవార్డు గ్రహీతలైన పి.సుశీల, సుహాసిని, కళాప్రపూర్ణ చర్ల గణపతిశాస్ర్తీ, బాలకృష్ణప్రసాద్, గవర్నర్ కుముద్‌బెన్ జోషి- ఇత్యాది వ్యక్తుల పరిచయం చేశారు. చిత్రాల్లో సజీవ కళ, వ్యాసాల్లో జీవసత్యాలు, వంటల్లో కమ్మని రుచులు ఈ తరంవారికి అందిస్తున్న నవనాయకి వాణిప్రభాకరి.
అలవోకగా సంగీతాన్ని వినిపిస్తారు. ఆశువుగా కథలల్లుతారు. అన్నింటా తనదంటూ ప్రత్యేకతను నిరూపించిన ప్రతిభాశాలి. పశ్చిమగోదావరి, తణుకు పట్టణానికి చెందిన వాణిప్రభాకరి పత్రికారంగంలోకి అడుగుపెట్టి అక్షర జ్యోతులను వెలిగించడం మొదలుపెట్టారు. ఏ పోటీల్లో పాల్గొన్నా తనకంటూ విశిష్టతను చాటుతూ బహుమతులు పొందారు. ఆ పరిణితివల్లనే పలు సంస్థలు ఆమెను న్యాయనిర్ణేతగా పిలిచి శాలువాతో బిరుదులతో సత్కరించాయ. దాదాపు 300పైగా పోటీలకు న్యాయ నిర్ణేతగా ఆహ్వానింపబడ్డారు. వనిత వంటల పోటీలో ప్రథమ బహుమతి సాధించారు. ఇలా వంటల పోటీలు, పత్రికా ముఖంగా నిర్వహించిన దానితో ప్రథమ స్థానం పొంది, ఇపుడు 1550 పైగా వంటలను ప్రేక్షకులకు పరిచయం చేశారు.
ఆటవిడుపులో అమ్మ కథ తొలిసారిగా ప్రచురణకు నోచుకుని ఇప్పటిథాకా 45పైచిలుకు కథలు ప్రచురించబడ్డాయి. నేటి జీవన విధానాలే కధా వస్తువులుగా తీసుకున్న తీరు మెచ్చదగినది పలువురు ఆమెను మెచ్చుకున్నారు. ఇప్పటివరకు 400 కవితలు, 1500 వ్యాసాలు, 18 ప్రముఖుల ఇంటర్వ్యూలు, 35 సన్మాన పత్రాలు- ఇలా సాహితీ ప్రస్థానంలోతన దైన స్థానాన్ని వాణి సొంతం చేసుకొన్నారు.
చిత్రకళలో బాల్యంలో అమ్మ ఒడినే బడిగా చేసుకుని పద్యాలు, శ్లోకాలు, చిత్రాలు గీయడం అలవర్చుకున్నారు. పెన్నిళ్ళతో గడలపై చిత్రాలు వేయడం చూసి క్రియాన్స్, రంగులు, కుంచెలు కొని ఇచ్చి డ్రాయింగ్ పుస్తకాలపై షీట్స్‌పై వేయడం అలవాటుచిన్ననాడే చేసుకొన్నారు. 108 చిత్రాలతో జాతీయ గ్రంథాలయ వార్షికోత్సవాలలోను, ఏలూరులోను నిర్వహించారు. ఈ నేపథ్యంలో నవరంగ్ ఆర్ట్ నికేతన్ వెల్గటూరులో ఎమెచ్యూర్ ఆర్టిస్టుగా వాణి బహుమతిని పొందారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన చిత్రకళా పోటీల్లో రాష్ట్ర స్థాయి అవార్డు పొందారు. కాలేజీలో ఎప్పుడూ ప్రథమ స్థానమే. ఏ పోటీ అయినా కుట్లు, అల్లికలు, ముగ్గులు, వంటలు, హస్తకళల్లో అన్నింటా ప్రథమ స్థానం పొందడమేగాక నేటికీ ఎందరికో పోటీల్లో న్యాయ నిర్ణేతగా బహుమతులు నిర్ణయిస్తున్నారు. ఫ్యాబ్రిక్ పెయింట్‌లో మాస్టర్ కోర్స్ చేయడమేగాక ఈ కోర్సు వేసవి శిక్షణగా నేర్పి 1200 మందికి సర్ట్ఫికెట్స్ అందించారు. ఇది వారికి ఉపాధి పథకంగా ఉపయోగపడుతోంది. లైన్స్‌క్లబ్‌లో ఎగ్జిబిషన్ ఏర్పాటుచేసి పలువురి ప్రశంసలు, లైన్స్ గవర్నర్ ప్రశంసలు పొందారు. రంగుల అక్షర రంగవల్లుల్ని తీర్చిదిద్దిన వాణి పుస్తక రూపంలో ముద్రించి నేటి బాలలకందించాలన్న ఆలోచనలో ఉన్నారు. దీనికి ఎవరైనా సాయంగా నిలిస్తే మరిన్ని కొత్తావిష్కరణలకు తావు ఏర్పడుతుందన్న అభిప్రాయాన్ని ఆమె వెలువరించారు.
వీణ ముఖ్యాంశంగా నేర్చుకుని జిల్లా యూత్ అవార్డు, రాష్ట్ర యూత్ అవార్డు, అఖిల భారత స్థాయి జాతీయ స్థాయి బహుమతులు పొంది ఉన్నారు. ‘‘ఆర్ట్ ఈజ్ మై హార్ట్, మ్యూజిక్ ఈజ్ మై బ్రీత్, లిటరేచర్ ఈజ్ మై లైఫ్’’గా జీవితాన్ని మలచుకున్నారు. కళలు అభిమానించే భర్త, అత్తింటివారు లభించడం తన అదృష్టం అంటున్నారు. మానసిక వికాసానికి ఏదో ఒక రంగాన్ని ఎంచుకుని సాధన చెయ్యాలి. 2000 సంవత్సరంలో 7 వీణలతో సప్తస్వర వీణారవళి కార్యక్రమం నిర్వహించారు ఉపాధి రంగంలో స్ర్తి ఎదిగితే కుటుంబ సమస్యలు సమసిపోతాయి. అందుకే కుట్టు శిక్షణ 58 పాఠాల ద్వారా కలువబాల పత్రిక ద్వారా అందజేశారు. కుట్టువల్ల స్ర్తిలు అంతో ఇంతో సంపాదించవచ్చును. స్ర్తి వికాసానికి తనదైన శైలిలో ఎన్నో వ్యాసాలు రాయడమే కాక తాను స్వయంగా ఆసరా కల్పిస్తుంటారు. బాల వికాసానికి మహిళా వికాసానికి ఎన్నో విజ్ఞానాత్మక కథలు, కక్షలు, జ్ఞానాత్మక వ్యాసాలు, పరిశోధనాత్మక వ్యాసాలు రాయడం వాణి దైనందిక కార్యక్రమంగా చేస్తుంటారు. ఇన్ని రంగాల్లో తనదైన ముద్రను వేసుకొన్న వాణి ప్రభాకరి గారికి గానకోకిల- సంగీత నిధి- ఇంటర్నేషనల్ అవార్డుతోపాటు సప్తస్వర వీణారవళి, వీణావాణి, నాదామృత సుగాత్ర, వీణారంజని, వీణాసింసరంజని, కళారంజని, కళామంజరి, కళాప్రియదర్శిని, కళాయశస్విని, కళాతపస్విని, కళావాహిని, కళావెలుగు లాంటి ఎన్నో బిరుదులను ఇచ్చి సత్కరించారు.

- శ్రీలత