Others

మనిషి వికాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుషులు వారి జీవితాలలో ఎదురైన సంఘటనల ద్వారా వికాసాన్ని పొందుతారు. దానివల్ల మనిషి అంచెలంచెలుగా ఎదగడానికి వీలు కలుగుతుంది. అపజయం కలిగినపుడు సాధారణంగా మాములు మనిషి కృంగిపోతాడు. అలా జరగకుండా ఉండడానికి మహాత్ముల జీవితవిశేషాలను తెలుసుకొన్నట్లయితే ప్రతిఅపజయం ఓ విజయానికి మెట్టుఅవుతుంది. మనిషి కి పుస్తకం కూడా మంచి మిత్రునివంటివాడు. కళ్ళు చెమర్చే జీవితసమస్యలను వాస్తవానికి దగ్గరగా పరిష్కారం చూపే రచన వల్ల మనిషి తన సమస్యను ఎదుర్కోగలుగుతాడు. మనిషికెపుడూ సృజనాత్మకత ఉండాలి. గట్టి సమస్య ఎదురైనా సరే నిలబడే పోరాటపటిమను పెంచుకోవాలి.దానికే ప్రతిరాత్రి తాను చేసిన చేయవలసిన పనుల గురించి సమీక్షను జరుపుకోవాలి. అందులో నిస్సకోచంగా తన్ను తాను విమర్శానాదృష్టితో చూసుకోవాలి. పెద్దవాళ్ళు చేసిందే కాకుండా వారు చేసిన దాన్నుంచి ఎలాస్ఫూర్తి దాయకవిషయాలను ఆకళింపుచేసుకోవాలి. దీనికి అవసరమైంది విస్రృతాధ్యయనం. అధ్యయనం అనేది కేవలం పుస్తకాల వరకూ పరిమితం చేసుకోకూడదు. ప్రతి సంఘటననూ అధ్యయనం చేయాల్సిందే.
జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించగలగాలి. విజ్ఞాన దాహం పద్మవూహ్యాలను ఛేదించేశక్తినిస్తుంది.శూన్యంలో అనంతబ్రహ్మాండశక్తి దాగిఉన్నట్లుగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా అంతఃకరణ ప్రేరణతో వాటిని ఎదుర్కొనేలా చేసుకోవాలి. జీవన గమ్యాన్ని నిర్ధేశించుకొని దాన్ని చేరడానికి అహర్నిశం శ్రమించాలి.దీనికి నేర్పుతో పాటూ ఓర్పు అవసరం అవుతుంది. ఓర్పు అనేక విజయాలకు నాంది అవుతుంది.

గుర్తులు
అనగననగా..
మల్లాది వేంకట కృష్ణమూర్తి
రిపబ్లిక్‌డే రోజు విదిత తండ్రి తన కుటుంబ సభ్యులతో ఎయిర్‌షో చూడటానికి పెరేడ్‌గ్రౌండ్స్‌కి వెళ్ళాడు. దాదాపు నలభై ఐదు నిమిషాలు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన జెట్ ఫైటర్ విమానాలు ఒళ్ళు గగుర్పొడిచేలా గాల్లో అనేక విన్యాసాలు చేసాయి. చివర్లో మూడు జెట్ విమానాలు తోకల్లోంచి కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల పొగలని విరజిమ్మడంతో ఆకాశంలో పెద్ద భారతీయ జెండా ఎగురుతున్నట్లుగా భావించిన ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు.
‘‘ప్రతీ వాహనం తను ప్రయాణించిన గుర్తుని సాధారణంగా పొగ రూపంలో వదుల్తూంటుంది. దానికి రంగులు కలిపి మన జాతీయ జెండాని గుర్తుచేయడం మంచి ఆలోచన.’’ విదిత తల్లి చెప్పింది.
‘‘ప్రతీ గుర్తు ఒకో సత్యాన్ని చెప్తుంది’’. విదిత తండ్రి ఆలోచనగా చెప్పాడు.
‘‘అంటే?’’ విదిత అడిగింది.
‘‘ఇంట్లోని వాసన అమ్మ సాంబారు వండుతోందనే సత్యాన్ని చెప్తుంది’’. విదిత అన్న నవ్వుతూ చెప్పాడు.
బయట భోజనం చేసి అంతా ఇంటికి చేరుకున్నారు.
‘‘విదితా! నేను నీ గదిలోకి వచ్చినప్పుడల్లా అది నీ గురించి నాకో సత్యాన్ని చెప్తూంటుంది.’’ తండ్రి చెప్పాడు.
‘‘ఏమిటది?’’ విదిత అడిగింది.
‘‘నువ్వు నీ గదిలో చాలా గుర్తులు వదులుతావు. వాటినిబట్టి నాకు నీ గురించిన నిజాలు తెలుస్తూంటాయి.’’
‘‘ఏమిటా నిజాలు నాన్నా?’’
‘‘నీ పుస్తకాలు అలమరలో కాక నేల మీద, మంచం మీది దుప్పటి మడిచి కాక కొంత నేల మీద, బట్టలు హేంగర్లకి కాక కింద, ఇలా అశుభ్రపు గుర్తులు గల నీ గది నీ గురించి చాలా చెప్తుంది. బద్ధకస్తురాలివని, శ్రద్ధలేని దానివని, ఏ పనీ సరిగ్గా చేయవని, అందాన్ని ఆరాధించవని.. ఇలా ఇంకా చాలా.’’
విదిత కొద్ది క్షణాలు ఆలోచించి చెప్పింది.
‘‘నిజమే. ఆకాశంలో విమానం పొగ జెండాని మనకి చూపించినట్లుగా సరిగ్గా సర్దుకోని నా గది నేను ఎలాంటి దాన్నో చూపిస్తుంది’’. విదిత చెప్పింది.
‘‘ఎక్కువ మార్కులు రావడం అంటే ఆ విద్యార్థి బాగా చదివాడన్నది సత్యం. తక్కువ మార్కులు రావడం మరో దానికి గుర్తు. ఇలా మనం చేసే ప్రతీ పనీ ప్రపంచానికి కొన్ని గుర్తులని వదుల్తుంది. మన చర్యలన్నీ మంచి గుర్తులనివదిలేలా మనం జాగ్రత్త పడుతుండాలి. చెడ్డ గుర్తులు రాకుండా చూసుకోవాలి.’’ తండ్రి వివరించాడు.
*

చాతుర్యంతోనే
చిత్రాలు!

చమత్కారంగా సంభాషించడం ఓ కళ. నాటికీ, నేటికీ.
నాడు రాజుల వద్ద కొలువు సంపాదించేందుకు ఇలాంటి ప్రజ్ఞాపాటవాలే ప్రదర్శించేవారు. తెనాలి రామకృష్ణులు కూడా రాయల వారి కొలువులో ప్రాపకం సంపాదించినదీ ఇలానే..
అలాంటి ఉదంతమే ఇదీ..!
రాజుగారిని నేరుగా కలవడం నాడూ దుర్లభమే. అటుగా వస్తున్న విప్రుడిని నిలువరిస్తున్న భటుల కర్కశ సంభాషణా శైలి గమనించి- రాజుగారు కనుసైగలతోనే వారిని నిలువరించి, ఆ విప్రుడిని ప్రవేశపెట్టమని ఆదేశించారు.
‘‘మహారాజా! అభివాదము. పేదవాడను. విప్రుడను. అబద్ధము నేర్వను. నా గురించి ఎక్కువగా చెప్పుకొనజాలను. కాలానుగుణంగా వస్తున్న మార్పులకు ఎదురొడ్డలేక, ఆదరణ లేక, సరైన సంపాదనా శూన్యుడనైనాను. గనుక మీరే నా యందు దయ వుంచి ఏదైనా పని ఇప్పించండి ప్రభూ!’’ అనివేడుకొన్నాడు.
కరకు చూపులే విసరినా, రాజుగారు హృదయాన్ని తెరిచే విన్నారు. ‘‘ఊ! అయితే నీవేమి చేయగలవు’’ ప్రశ్నించారు రాజుగారు.
‘‘అయ్యా! నేను ‘చతురంగతజ్ఞుడను’ అన్నాడు వినమ్రంగా వంగి చేతులు జోడిస్తూ!
రాజుగారు సందేహంలో పడ్డారు. సహజకవియైన మాకే తెలియని కొత్త సమాసమో అనుకుంటూ- తికమకగా మంత్రి వర్యులవైపు చూపు తిప్పారు. మంత్రిగారు ‘‘విప్రుడను, పేదవాడను అంటూనే రాజుగారితో పరిహాసమా! నీవు ఏమి చెప్పదలచావో సూటిగా చెప్పు’’ అని గద్దించారు.
‘‘మంత్రివర్యా! నేను రాజుగారికి క్లుప్తంగా సూటిగానే చెప్పానే. నేను చతురంగతజ్ఞుడను.. అనగా రాజుగారికి ఆటవిడుపు సమయంలో చదరంగం క్రీడలో విశ్రాంతి చేకూర్చగలను. రాజుగారు యుద్ధానికి వెళ్లవలసిన వేళ తురంగతజ్ఞుడను కాగలను.
కళలను మీరు ఆదరించే సమయానికి రంగతజ్ఞుడను (నాట్య శాస్త్ర ప్రావీణ్యం కలవాడు) కాగలను. ఇక మీకు గతజ్ఞడను (ఖగోళ శాస్త్ర ప్రావీణ్యుడను) కాగలను. సమస్యల పరిష్కరణా సందిగ్ధత తలెత్తినపుడు తర్కశాస్త్రం తెలిసిన వాడనగుటచే, తజ్ఞడను. ఇన్ని ప్రక్రియలలో జ్ఞానం కలిగినవాడు గనుక జ్ఞాడను (తెలివికలవాడను) కాకపోను కదా. ప్రభువులకు నా గురించి నేను ఇన్నిట ప్రవేశమున్నదని నేరుగా చెప్పుట పాడి కాదని చతురంగతజ్ఞడను అని మాత్రమే విన్నవించుకొన్నాను మంత్రివర్యా’’ అన్నాడు పునః నమస్కారం చేస్తూ.
‘‘ఓహో! నీకు భాషా ప్రావీణ్యం కూడ ఉన్నదే!’’ అని రాజుగారు మెచ్చుకుంటూ భూదాన, గోదానాలతోపాటు, వేయి వరహాల మూట కూడా అందించి.. మంత్రివర్యుల సరసన కొలువులో విప్రుని ప్రజ్ఞకి తగిన స్థానం కల్పించారు.
అదండీ పిల్లలూ! తెలుగు భాషా వైదుష్యం! *

కళలతోనే కలలు సాకారమా!

బహుముఖ కళా, సాహిత్య సాధనతో బాల్యం నుంచి నిరంతర కృషి, ప్రతిభతో పలు రంగాల్లో కళలను సొంతం చేసుకుని, ఆ కళలను పదిమందికి పంచి పెట్టాలన్న ధ్యాసతో సంగీతం, సాహిత్యం, చిత్రకళ, గృహాలంకరణ అంశాలను ఎన్నో వ్యాసాలుగా తయారుచేసివివిధ పత్రికల్లో ప్రచురింపచేశారు. సాహిత్యంలో కథ, కవిత, మినీ కవిత, హైకూ, వ్యాసము, వంటలు, నవల, ఉత్తరాలు, ఇంటర్వ్యూల ద్వారా ప్రముఖులైన జస్టిస్ అమరేశ్వరి బసవ రాజేశ్వరి, మాగంటి వరలక్ష్మి జాతీయ అవార్డు గ్రహీతలైన పి.సుశీల, సుహాసిని, కళాప్రపూర్ణ చర్ల గణపతిశాస్ర్తీ, బాలకృష్ణప్రసాద్, గవర్నర్ కుముద్‌బెన్ జోషి- ఇత్యాది వ్యక్తుల పరిచయం చేశారు. చిత్రాల్లో సజీవ కళ, వ్యాసాల్లో జీవసత్యాలు, వంటల్లో కమ్మని రుచులు ఈ తరంవారికి అందిస్తున్న నవనాయకి వాణిప్రభాకరి.
అలవోకగా సంగీతాన్ని వినిపిస్తారు. ఆశువుగా కథలల్లుతారు. అన్నింటా తనదంటూ ప్రత్యేకతను నిరూపించిన ప్రతిభాశాలి. పశ్చిమగోదావరి, తణుకు పట్టణానికి చెందిన వాణిప్రభాకరి పత్రికారంగంలోకి అడుగుపెట్టి అక్షర జ్యోతులను వెలిగించడం మొదలుపెట్టారు. ఏ పోటీల్లో పాల్గొన్నా తనకంటూ విశిష్టతను చాటుతూ బహుమతులు పొందారు. ఆ పరిణితివల్లనే పలు సంస్థలు ఆమెను న్యాయనిర్ణేతగా పిలిచి శాలువాతో బిరుదులతో సత్కరించాయ. దాదాపు 300పైగా పోటీలకు న్యాయ నిర్ణేతగా ఆహ్వానింపబడ్డారు. వనిత వంటల పోటీలో ప్రథమ బహుమతి సాధించారు. ఇలా వంటల పోటీలు, పత్రికా ముఖంగా నిర్వహించిన దానితో ప్రథమ స్థానం పొంది, ఇపుడు 1550 పైగా వంటలను ప్రేక్షకులకు పరిచయం చేశారు.
ఆటవిడుపులో అమ్మ కథ తొలిసారిగా ప్రచురణకు నోచుకుని ఇప్పటిథాకా 45పైచిలుకు కథలు ప్రచురించబడ్డాయి. నేటి జీవన విధానాలే కధా వస్తువులుగా తీసుకున్న తీరు మెచ్చదగినది పలువురు ఆమెను మెచ్చుకున్నారు. ఇప్పటివరకు 400 కవితలు, 1500 వ్యాసాలు, 18 ప్రముఖుల ఇంటర్వ్యూలు, 35 సన్మాన పత్రాలు- ఇలా సాహితీ ప్రస్థానంలోతన దైన స్థానాన్ని వాణి సొంతం చేసుకొన్నారు.
చిత్రకళలో బాల్యంలో అమ్మ ఒడినే బడిగా చేసుకుని పద్యాలు, శ్లోకాలు, చిత్రాలు గీయడం అలవర్చుకున్నారు. పెన్నిళ్ళతో గడలపై చిత్రాలు వేయడం చూసి క్రియాన్స్, రంగులు, కుంచెలు కొని ఇచ్చి డ్రాయింగ్ పుస్తకాలపై షీట్స్‌పై వేయడం అలవాటుచిన్ననాడే చేసుకొన్నారు. 108 చిత్రాలతో జాతీయ గ్రంథాలయ వార్షికోత్సవాలలోను, ఏలూరులోను నిర్వహించారు. ఈ నేపథ్యంలో నవరంగ్ ఆర్ట్ నికేతన్ వెల్గటూరులో ఎమెచ్యూర్ ఆర్టిస్టుగా వాణి బహుమతిని పొందారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన చిత్రకళా పోటీల్లో రాష్ట్ర స్థాయి అవార్డు పొందారు. కాలేజీలో ఎప్పుడూ ప్రథమ స్థానమే. ఏ పోటీ అయినా కుట్లు, అల్లికలు, ముగ్గులు, వంటలు, హస్తకళల్లో అన్నింటా ప్రథమ స్థానం పొందడమేగాక నేటికీ ఎందరికో పోటీల్లో న్యాయ నిర్ణేతగా బహుమతులు నిర్ణయిస్తున్నారు. ఫ్యాబ్రిక్ పెయింట్‌లో మాస్టర్ కోర్స్ చేయడమేగాక ఈ కోర్సు వేసవి శిక్షణగా నేర్పి 1200 మందికి సర్ట్ఫికెట్స్ అందించారు. ఇది వారికి ఉపాధి పథకంగా ఉపయోగపడుతోంది. లైన్స్‌క్లబ్‌లో ఎగ్జిబిషన్ ఏర్పాటుచేసి పలువురి ప్రశంసలు, లైన్స్ గవర్నర్ ప్రశంసలు పొందారు. రంగుల అక్షర రంగవల్లుల్ని తీర్చిదిద్దిన వాణి పుస్తక రూపంలో ముద్రించి నేటి బాలలకందించాలన్న ఆలోచనలో ఉన్నారు. దీనికి ఎవరైనా సాయంగా నిలిస్తే మరిన్ని కొత్తావిష్కరణలకు తావు ఏర్పడుతుందన్న అభిప్రాయాన్ని ఆమె వెలువరించారు.
వీణ ముఖ్యాంశంగా నేర్చుకుని జిల్లా యూత్ అవార్డు, రాష్ట్ర యూత్ అవార్డు, అఖిల భారత స్థాయి జాతీయ స్థాయి బహుమతులు పొంది ఉన్నారు. ‘‘ఆర్ట్ ఈజ్ మై హార్ట్, మ్యూజిక్ ఈజ్ మై బ్రీత్, లిటరేచర్ ఈజ్ మై లైఫ్’’గా జీవితాన్ని మలచుకున్నారు. కళలు అభిమానించే భర్త, అత్తింటివారు లభించడం తన అదృష్టం అంటున్నారు. మానసిక వికాసానికి ఏదో ఒక రంగాన్ని ఎంచుకుని సాధన చెయ్యాలి. 2000 సంవత్సరంలో 7 వీణలతో సప్తస్వర వీణారవళి కార్యక్రమం నిర్వహించారు ఉపాధి రంగంలో స్ర్తి ఎదిగితే కుటుంబ సమస్యలు సమసిపోతాయి. అందుకే కుట్టు శిక్షణ 58 పాఠాల ద్వారా కలువబాల పత్రిక ద్వారా అందజేశారు. కుట్టువల్ల స్ర్తిలు అంతో ఇంతో సంపాదించవచ్చును. స్ర్తి వికాసానికి తనదైన శైలిలో ఎన్నో వ్యాసాలు రాయడమే కాక తాను స్వయంగా ఆసరా కల్పిస్తుంటారు. బాల వికాసానికి మహిళా వికాసానికి ఎన్నో విజ్ఞానాత్మక కథలు, కక్షలు, జ్ఞానాత్మక వ్యాసాలు, పరిశోధనాత్మక వ్యాసాలు రాయడం వాణి దైనందిక కార్యక్రమంగా చేస్తుంటారు. ఇన్ని రంగాల్లో తనదైన ముద్రను వేసుకొన్న వాణి ప్రభాకరి గారికి గానకోకిల- సంగీత నిధి- ఇంటర్నేషనల్ అవార్డుతోపాటు సప్తస్వర వీణారవళి, వీణావాణి, నాదామృత సుగాత్ర, వీణారంజని, వీణాసింసరంజని, కళారంజని, కళామంజరి, కళాప్రియదర్శిని, కళాయశస్విని, కళాతపస్విని, కళావాహిని, కళావెలుగు లాంటి ఎన్నో బిరుదులను ఇచ్చి సత్కరించారు.
- శ్రీలత

రెండు చక్రాలు సరైతే జోరు మీదే..
మనిషి అన్నతరువాత ఎవరిలోనైనా మంచి చెడు ఉంటుంటాయ. మంచి కనిపించినపుడు మెచ్చుకోవడం ఎంత ముఖ్యమో చెడు ను చూసినపుడు క్షమించడం కూడా అంతే ముఖ్యం. అపుడే మీరు మీ భాగస్వామి ఇద్దరూ ఆనందంగా ఉంటారు.సంసారమనే బండి రెండు చక్రాలు మీరే కదా. రెండు చక్రాలు ఇరుసుతో సరసంగా నక్రమంగా నడుస్తూంటే చాలు సంసారం మూడు పువ్వులు ఆరుకాయలు అవుతుంది. అందుకే మీ మీ జీవిత భాగస్వామి గురించిన చెడు అలవాట్లు తెలిస్తే ఒక్కసారిగా విరుచుకుపడటం, ఆంక్షలు విధించటం లాంటివి చేయకండి. ప్రేమతో నచ్చచెప్పండి. ప్రేమతో విశ్వానే్న గెలవచ్చు ఇక మీ జీవితభాగస్వామిని గెలవడం చిటికెలో పని. తనకు తానుగా చెడు అలవాటుని వదులుకునేలా చేయగలగాలి. వీలున్నంతవరకూ ఇంట్లో గొడవ జరగకుండా చూసుకోవాలి. ఒకవేళ గొడవపడే పరిస్థితి వస్తే మాట తప్పించేయండి. చిలిపి మాటలు, సరసాలు, జోక్స్‌లాంటివి, భార్యాభర్తలమధ్య ప్రేమానురాగాలను పటిష్టపరుస్తాయి. ఇది మరవకండి.

-గౌరి