Others

అర్ధాంగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కం॥ శ్రీకరవౌ బ్రతుకిలశో
భాకరవౌ తరగనట్టి భాగ్యపు వరవౌ
లోకము నందనవనవౌ
చీకాకులు పారిపోవు శ్రీమతి ప్రేమన్

ఆ॥ ఆలుమగలు కలసి యురాగ హృదయాల
కాపురంబు చేయకలత లేక
పిల్ల పాప పాట ప్రియమార తిరుగాడ
అదియె స్వర్గమగును అవని యందు

కం॥ సగమై పతితో తానే
జగమై సల్లాపమందు సరసపు జాణై
నగవై పెదవులపైఏ
వగపును దరిచేరనీదు వాంఛలు తీరన్

కం॥ కన్నుల వెనె్నల సోనై
వనె్నలతో మురియజేయువలపుల వీణై
అన్నుల మిన్నగ తాగను
సన్నల మెలగుచు పతిగను సతతము తోడై

కం॥ సరియై వచ్చును నిజమిది
సిరివెనె్నల చిలుకజేసి చిలిపిగ నవ్వన్
విరి వానలు కురియును బో
సరి మరి పతి బ్రతుకు మధురసాలము చేయన్

కం॥ ప్రేమకు ప్రతి రూపముగా
కామ సుఖమ్మున కిల తను కామిత ఫలమై
నీ యము తప్పక నడచుచు
భూమిని జనియించె పతిని భూపతి చేయన్

కం॥ బాసట నిలచును ఇడుముల
దోసము లెంచని సదమల దొరసాని తానై
బాసలు తీర్చని పతిపై
గాసిరి పడ్వదు ప్రియసతి గడబిడతోడన్

కం॥ జీవన సౌధపు వెలుగై
పావన మొనరించింతీవు పంకజనేత్రా
దీవెన లిచ్చెడి దేవత
వీవని తలచెపతి మదిని వేడ్కను వినుమా

మతిమరుపు బాధిస్తోందా?
పుట్టిన శిశువు దినదినాభివృద్ధి చెందినట్లుగానే 40 ఏళ్ళ తర్వాత ఒకొక్క అవయవము పనిచేయడం నెమ్మదిస్తాయి. పళ్ళు, కళ్ళు, చెవులు, దంతాలు మరమ్మతు చేయించుకోవలసిన దశకు చేరుకుంటాయి. చూడటానికి బాగా లేకపోయినా ఏ మాత్రం బాధించనవి తెల్ల వెంట్రుకలే. వీటి తోడు చాపకింద నీరులా చేరి మనకే కాక ఇతరులకూ ఇబ్బంది కలిగించేది మతిమరుపు. ఇది పైవాటిలాగే అతి సహజంగా వయస్సు రీత్యా వచ్చే ఒక రకం మార్పే. అయితే చాలామంది ఇదేదో చాలా ప్రమాదకరమైనదన్న భావనతో చేజేతులా మరింత ఎక్కువ చేసుకుంటారు.
35-50 ఏళ్ళ మధ్య వయసులో ఒకే సమయంలో ఐదారు పనులు చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. మతిమరుపు, స్ర్తి పురుషులిద్దరికి సమానమే అయినా పురుషులు కేవలం కొన్ని పనులకే పరిమితం అవడం చేత స్ర్తిలలోనే బాధితులు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే మగువలు వంట చేస్తూ మరీ నాలుగైదు పనులమీద దృష్టి పెడతారు. పనిమనిషికి అంట్లగినె్నలు వేస్తూ పిల్లలకు స్నానాలు లేదా టిఫిన్ బాక్స్‌లు సర్దుతూ, మరోవంక కొళాయి నీళ్ళు పట్టుకుంటూ, ఆ చేత్తోతే పైన ట్యాంక్ నింపటానికి మీట వేస్తారు. వంట అంటేనే అష్టావధానం వంటిది. ఇక దానితోపాటు 3-4 పనులు అదనంగా చేసేయాలని ప్రయత్నిస్తారు. మామూలుగా అయితే ఆ పన్నులన్నీ సమర్థవంతంగానే చేయగలుగుతారు కాని-
అదే మతిమరుపు మొదలయ్యాక వంటల్లో రెండుసార్లు ఉప్పు లేదా కారం వేయడం లేదా అసలే వేయకపోవడం, మీట నొక్కడం మరచిపోవడంతో నీరు వృధా కావడం ఇలా దాదాపు ప్రతి పనులు అస్తవ్యస్తం అయ్యేసరికి కంగారు పడిపోతారు. మతిమరుపువలన చచ్చిపోతున్నామని విసుక్కుంటూ పని ముగించేస్తారు. తీరికగా ఆ రోజు జరిగిన అవకతవక పనులన్నీ నెమరువేసుకొని పూస గుచ్చినట్లు అడిగినవారికి, అడగనివారికికూడా మరచిపోకుండా ఏకరువుపెడతారు. మతిమరుపుకోసం అందించే మొట్టమొదటి పోషకాహారం ఇదే.
ఇక రేపటి రోజు తాళాలు, మరోరోజు డబ్బులు... ఇలా ఒక్కో రోజు ఒక్కొక్కటి ఒకచోట పెట్టి మరోచోట వెతకడం మొదలుపెడతారు. ఇలా ప్రతిరోజూ మరచిపో సంఘటనల జాబితాను గుర్తుంచుకుంటూ మతిమరుపును ఎరువు వేసి పెంచుతూ పోతారు. అంటే గుర్తుంచుకోవలసినదానిని మరచిపోతూ, మరచిపోవలసినదానిని అతి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటూ ఉంటే మతిమరుపు ఎలా తగ్గుతుంది? మరి దీనిని పూర్తిగా నివారించటం వీలుకాకపోయినా 90 శాతం తగ్గించుకునే అవకాశం మన చేతుల్లోనే వుంది.
1. మతిమరుపును విస్మరించటమే మొట్టమొదట చేయవలసిన పని. 2.మరచిపోయిన సంగతిని పదే పదే అందరికీ వినిపించకుండా ఉండటమే. 3.వీలైనంతవరకు ఒక పని ముగించాకే మరో పని చేయడం మంచిది. 4.మరీ అవసరమైనప్పుడు పని ముగిసే సమయాన్ని బట్టి రెండు పనులు మించి చేయకుండా ఉండడం 5.మన వ్యక్తిగతంగా వాడే వస్తువులు (కళ్ళజోడు, హియరింగ్ ఎయిడ్, సెల్‌ఫోన్, రాసే, చదివే అలవాటు ఉంటే దానికి సంబంధించినవన్నీ) ఒకే స్థలంలో ఉంచడం అలవాటు చేసుకోవాలి. 6.సానుకూల దృక్పథం (పాజిటివ్ థింకింగ్) ఒకవేళ ఏదైనా గుర్తుకురాకపోయినా పదే పదే ఆలోచించి మనసు పాడు చేసుకోవడం కంటే ‘నా మెదడు నియేపంగా ఉంది, అంత త్వరగా మరచిపోదు- ఇదుగో ఈ చేస్తున్న పని ముగిసేలోగా తప్పకుండా గుర్తుకువస్తుంది’’ అన్న సజెషన్ ఇచ్చి పనిలో నిమగ్నులయితే ఖచ్చితంగా చేస్తున్న పని ముగిసే వేళకు గుర్తుకువస్తుంది. ఇది నా స్వానుభవం.
మనకు నచ్చిన ఏదో ఒక వ్యాపకంవలన మెదడును నిరంతరం పనిచేయిస్తూ వుంటే మతిమరుపు మన దగ్గరకు రావటం మరచిపోతుంది.
-ఆయి కమలమ్మ

ఇది సహజమే అయనా..
జాగ్రత్త అవసరం
మహిళల్లో మూత్ర నాళ ఇనె్ఫక్షన్లు ఎక్కువ. వీటి బాఠిన పడితే మంట, నొప్పి, తరచూ మూత్రానికి వెళ్ళాల్సి రావడం వంటివి తరచూ వేధిస్తుంటాయి. ఈ సమస్యను ఒకరితో చెప్పుకోలేరు. ఆసుపత్రికి వెళ్ళడానికి భయపడతారు. తమలో తాము బాధను అనుభవిస్తూ ఉంటారు. మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా అనిపిస్తే తప్పనిసరిగా డాక్టరును సంప్రదించాలి. లేదా ఈ మూత్ర నాళ ఇనె్ఫక్షన్లు పెరుగుతూ ఇతర అవయవాలకు కూడా చేరే ప్రమాదముంది. మూత్ర నాళ ఇనె్ఫక్షన్లు యువతుల్లో, మధ్యవయస్సువారిలో ఎక్కువగా వస్తుంటాయి. మహిళల్లో వయసుతో పాటు మూత్ర కోశ వ్యవస్థ గోడలు బలహీనం అవుతాయి. దీంతో ఇనె్ఫక్షన్ల ముప్పూ పెరుగుతుంది.
సాధారణంగా ఈస్ట్రోజన్ హార్మోను సూక్ష్మక్రిములను చంపే రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. అలాగే మూత్రకోశ వ్యవస్థ గోడలు మందంగా, ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది. అయితే నెలసరి నిలిచిపోయిన తర్వాత శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయి తగ్గుతూ వస్తుంది. దీంతో సూక్ష్మక్రిములను నిర్మూలించే సామర్థ్యమూ తగ్గుతుంది. మూత్రకోశ గోడలూ బలహీనమవుతాయి. అలాగే యోనిలో మంచి బాక్టీరియా తగ్గి, చెడు బాక్టీరియా పెరుగుతుంది. మర్మాంగ ప్రాంతాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా ఎవరైనా చెబితే అందరూ ఛిఛీ అంటారు. కానీ సగానికి సగం జబ్బులు మర్మాంగాలు శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్లే వస్తాయని ఎంతమందికి తెలుసు?
అలాగే లోదుస్తులను ఆరునెలలకోసారి పడేసి కొత్తవాటిని ఉపయోగించాలి. లేదంటే బాక్టీరియా పెరిగిపోతుంది.. ఇలాంటి చిన్న చిన్న కారణాలే మూత్ర కోశ ఇనె్ఫక్షన్లను తెచ్చిపెడతాయి. అయితే తరచుగా మూత్ర కోశ ఇనె్ఫక్షన్ల బారినపడేవారు కొన్ని జాగ్ర త్తలతో వీటి ముప్పును తగ్గించుకోవచ్చు. లేదా వీటి బారిన పడకుండా చూసుకోవచ్చు.
* ఈ ఇనె్ఫక్షన్ల బారిన పడకూడదు అనుకునేవాళ్ళు తప్పనిసరిగా ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా మంచినీళ్ళను ఎక్కువగా తాగుతుండాలి. దీనివల్ల బాక్టీరియా శరీరంలోంచి మూత్ర ం ద్వారా బయటకు వెళ్లిపోతుంది.
* వారానికి ఒకసారైనా కొబ్బరినీళ్ళను తాగాలి. ఇది కడుపును శుభ్రం చేస్తుంది. అలాగే బార్లీ నీళ్ళను కూడా తాగడం వల్ల మూత్ర కోశము, మూత్ర నాళాలు శుభ్రపడతాయి.
* మూత్ర కోశ ఇనె్ఫక్షన్లకు కారణమయ్యే వాటిలో ఇకొలి ప్రధానమైంది. ఇది మలం నుంచి మూత్ర కోశంలోకి వ్యాపిస్తుంది. అందుకే మహిళలు మలవిసర్జన అనంతరం ముందు నుంచి వెనుకకు కడుక్కోవడం మంచిది. తల్లులు తమ పిల్లలకు చిన్నవయస్సు నుంచే ఇది నేర్పించడం చాలా మంచిది.
* మూత్ర ఇనె్ఫక్షన్ల బారిన పడిన స్ర్తీలకు డాక్టర్లు లాక్టోబాసిల్లస్ మాత్రలను ఇస్తారు. ఇది యోనిలోని మంచి, చెడు బాక్టీరియాల మధ్య సమతుల్యత దెబ్బతినకుండా చూస్తాయి. ఇవి తరచుగా మూత్ర ఇనె్ఫక్షన్ల బారినపడే స్ర్తీలకు బాగా ఉపయోగపడతాయి.
* మూత్రం ఆపుకోలేని సమస్య ఉన్నవారు కూడా మంచి నీళ్లు ఎక్కువగా తాగాలి. ఎందుకంటే వీరు మూత్రం ఎక్కడ లీకవుతుందోనని భయపడుతూ నీళ్లు అంతగా తాగరు. ఇది శరీరంలో ఇనె్ఫక్షన్ పెరగడానికి దారితీస్తుంది.
* అలాగే సంభోగాననంతరం తప్పనిసరిగా మూత్ర విసర్జన చేయడం వల్ల మూత్ర కోశంలోకి బాక్టీరియా చేరే అవకాశం తగ్గుతుంది.
ఇలాంటి చిన్న చిన్న జాగ్ర త్తలవల్ల బాక్టీరియా మూత్ర కోశంలోకి, నాళాల్లోకి చేరకుండా ఉంటుంది. ఫలితంగా ఇనె్ఫక్షన్లు దరి చేరకుండా ఉంటాయి.
- సరస్వతి

పూల సోయగం
భానుడు తన ప్రతాపాన్ని చూపడం మొదలుపెట్టాడు. నులివెచ్చని సూర్యకాంతికి శిశిరంలో మోడువారిన చెట్లన్నీ చిగుర్లు వేయడం మొదలుపెట్టాయి. వసంతాగమనంతో చలిగాలులు తమ బద్ధకాలను విరుచుకుంటూ పుష్పిస్తున్నాయి. ఆహ్లాదాన్ని పంచే ఆ పూలసోయగం నిత్యనూతనం.
అందుకే ఫ్యాషన్ డిజైనర్లు పూలసోయగాలను తమ ఫ్యాషన్లలో చొప్పిస్తూ అందాలకు మరింత సొబగులద్దుతున్నారు.
మునుపు సంప్రదాయ దుస్తుల్లోనే పూల అందాలు కనువిందు చేసేవి. కానీ నేడు ఆధునిక దుస్తుల్లో కూడా ఈ అందాలను చొప్పించడంతో ఇక సోయగాల సంగతి చెప్పేదేముంది? టాప్‌లు, కుర్తీలు, లెగ్గింగులు, కా ప్‌టాప్‌లు, చీరలు, బ్లేజర్లు, వాచీలు, షూలు, బే స్‌లెట్లు.. ఇలా ఒకటేమిటి.. యాక్సెసరీలన్నీ కూడా పూల ప్రింట్లతో తళుకులీనుతున్నాయి. పూల ఫ్యాషన్ ఎవర్‌గ్రీన్. తెలుపు లేదా లేలేత రంగులపైనే ఈ పూల ముద్ర లు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే వేసవికాలంలో ఈ దుస్తులు ఎక్కువగా అమ్ముడుపోతుంటాయి. ఎక్కువగా సింథటిక్ చీరలపై ఈ పూల డిజైన్లు కనువిందు చేస్తాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. వీటిని ముదురురంగులపైనా, కాటన్ దుస్తులపైనా, రాసిల్క్, కాటన్ సిల్క్‌పైనా ఈ పూలడిజైన్లను అద్దుతున్నారు. లంగావోణీలు, గాగ్రా చోళీలు, సల్వార్ కమీజ్‌లు, అనార్కలీలు, స్కర్టులు, బ్లౌజ్‌లు కూడా పూటప్రి ంట్లను అద్దుకుంటున్నాయి. ఇప్పటి అమ్మాయిలు తమ కలెక్షన్‌లో ఒక్కటైనా ఫ్లోరల్ బ్లౌజ్ ఉండాలని కోరుకుంటున్నారు.
ఎంబ్రాయిడరీలూ, రంగురాళ్ళమెరుపులూ, చకీ అందాలు, భారీ లెహెంగాలతో విసిగిపోయిన ఫ్యాషన్‌‌ర పేమికులు ఇప్పుడు ఈ పూల ప్రింట్లతో మెరిసిపోతున్న బట్టలను చూస్తూ ఆనందంగా ఒంటికి హత్తుకుంటున్నారు. రాబోతున్న వేసవికాలంలో బరువైన, ఎంబ్రాయిడరీ వస్త్ధ్రారణ కష్టమే! అందుకే అందరి దృష్టి ఈ తేలికపాటి ప్రి ంటెడ్ ఫ్యాబ్రిక్ వైపు మళ్లింది. అయితే ఎంత ఆహ్లాదాన్ని పంచే పూల సోయగాలైనా పై నుండి కిందకు ఒకటే డిజైన్ వేసుకోకూడదు. అంటే పూల డిజైన్ టాప్ వేసుకున్నప్పుడు, బాటమ్ ప్లెయిన్‌ది, పూల చీర కట్టుకున్నప్పుడు, ప్లెయిన్ జాకెట్.. అలాగే సాదా చీర కట్టుకున్నప్పుడు ఫ్లోరల్ బ్లౌజ్.. ఇలా వేసుకోవడం వల్ల అందం మరింత ద్విగుణీకఋతమవుతుంది. ఆనందంగానూ ఉంటుంది.
-విశ్వ

వనితా వందనం
ఎంత చదువు చదివినా
ఎన్ని పదవులు లేలినా
ఎదలోపలి మమకారం
ఎగిరిపోదు.. ఇగిరిపోదు
వనితా నీ జీవితమే
మమతకు ఓ ఆలయం
మగువా నీ మనుగడయే
మానవతకు మందిరం!
మదిలో నీ హృదిలో
ప్రేమ పూలు పూయిస్తే
మంచులాగా కరుగుతావు
మంచితనం పంచుతావు
అవనిలోన దేవతవని
అనురాగం అందిస్తే
సహనశీలి వవుతావు
స్నేహం రుచి చూపుతావు
సృష్టికి మూలం నీవు
సృజనకు రూపం నీవు
నీవు లేక ఈ లోకం
ఊహించుట దుర్లభం
నీవు లేని ఈ జగతిన
జీవించుట దుస్సహం
నీవొక వెనె్నల లోగిలి
నీవొక పున్నమి జాబిలి!
- మరువాడ భానుమూర్తి

- కొర్రపాటి రమణయ్య