Others

మతిమరుపు బాధిస్తోందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టిన శిశువు దినదినాభివృద్ధి చెందినట్లుగానే 40 ఏళ్ళ తర్వాత ఒకొక్క అవయవము పనిచేయడం నెమ్మదిస్తాయి. పళ్ళు, కళ్ళు, చెవులు, దంతాలు మరమ్మతు చేయించుకోవలసిన దశకు చేరుకుంటాయి. చూడటానికి బాగా లేకపోయినా ఏ మాత్రం బాధించనవి తెల్ల వెంట్రుకలే. వీటి తోడు చాపకింద నీరులా చేరి మనకే కాక ఇతరులకూ ఇబ్బంది కలిగించేది మతిమరుపు. ఇది పైవాటిలాగే అతి సహజంగా వయస్సు రీత్యా వచ్చే ఒక రకం మార్పే. అయితే చాలామంది ఇదేదో చాలా ప్రమాదకరమైనదన్న భావనతో చేజేతులా మరింత ఎక్కువ చేసుకుంటారు.
35-50 ఏళ్ళ మధ్య వయసులో ఒకే సమయంలో ఐదారు పనులు చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. మతిమరుపు, స్ర్తి పురుషులిద్దరికి సమానమే అయినా పురుషులు కేవలం కొన్ని పనులకే పరిమితం అవడం చేత స్ర్తిలలోనే బాధితులు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే మగువలు వంట చేస్తూ మరీ నాలుగైదు పనులమీద దృష్టి పెడతారు. పనిమనిషికి అంట్లగినె్నలు వేస్తూ పిల్లలకు స్నానాలు లేదా టిఫిన్ బాక్స్‌లు సర్దుతూ, మరోవంక కొళాయి నీళ్ళు పట్టుకుంటూ, ఆ చేత్తోతే పైన ట్యాంక్ నింపటానికి మీట వేస్తారు. వంట అంటేనే అష్టావధానం వంటిది. ఇక దానితోపాటు 3-4 పనులు అదనంగా చేసేయాలని ప్రయత్నిస్తారు. మామూలుగా అయితే ఆ పన్నులన్నీ సమర్థవంతంగానే చేయగలుగుతారు కాని-
అదే మతిమరుపు మొదలయ్యాక వంటల్లో రెండుసార్లు ఉప్పు లేదా కారం వేయడం లేదా అసలే వేయకపోవడం, మీట నొక్కడం మరచిపోవడంతో నీరు వృధా కావడం ఇలా దాదాపు ప్రతి పనులు అస్తవ్యస్తం అయ్యేసరికి కంగారు పడిపోతారు. మతిమరుపువలన చచ్చిపోతున్నామని విసుక్కుంటూ పని ముగించేస్తారు. తీరికగా ఆ రోజు జరిగిన అవకతవక పనులన్నీ నెమరువేసుకొని పూస గుచ్చినట్లు అడిగినవారికి, అడగనివారికికూడా మరచిపోకుండా ఏకరువుపెడతారు. మతిమరుపుకోసం అందించే మొట్టమొదటి పోషకాహారం ఇదే.
ఇక రేపటి రోజు తాళాలు, మరోరోజు డబ్బులు... ఇలా ఒక్కో రోజు ఒక్కొక్కటి ఒకచోట పెట్టి మరోచోట వెతకడం మొదలుపెడతారు. ఇలా ప్రతిరోజూ మరచిపో సంఘటనల జాబితాను గుర్తుంచుకుంటూ మతిమరుపును ఎరువు వేసి పెంచుతూ పోతారు. అంటే గుర్తుంచుకోవలసినదానిని మరచిపోతూ, మరచిపోవలసినదానిని అతి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటూ ఉంటే మతిమరుపు ఎలా తగ్గుతుంది? మరి దీనిని పూర్తిగా నివారించటం వీలుకాకపోయినా 90 శాతం తగ్గించుకునే అవకాశం మన చేతుల్లోనే వుంది.
1. మతిమరుపును విస్మరించటమే మొట్టమొదట చేయవలసిన పని. 2.మరచిపోయిన సంగతిని పదే పదే అందరికీ వినిపించకుండా ఉండటమే. 3.వీలైనంతవరకు ఒక పని ముగించాకే మరో పని చేయడం మంచిది. 4.మరీ అవసరమైనప్పుడు పని ముగిసే సమయాన్ని బట్టి రెండు పనులు మించి చేయకుండా ఉండడం 5.మన వ్యక్తిగతంగా వాడే వస్తువులు (కళ్ళజోడు, హియరింగ్ ఎయిడ్, సెల్‌ఫోన్, రాసే, చదివే అలవాటు ఉంటే దానికి సంబంధించినవన్నీ) ఒకే స్థలంలో ఉంచడం అలవాటు చేసుకోవాలి. 6.సానుకూల దృక్పథం (పాజిటివ్ థింకింగ్) ఒకవేళ ఏదైనా గుర్తుకురాకపోయినా పదే పదే ఆలోచించి మనసు పాడు చేసుకోవడం కంటే ‘నా మెదడు నియేపంగా ఉంది, అంత త్వరగా మరచిపోదు- ఇదుగో ఈ చేస్తున్న పని ముగిసేలోగా తప్పకుండా గుర్తుకువస్తుంది’’ అన్న సజెషన్ ఇచ్చి పనిలో నిమగ్నులయితే ఖచ్చితంగా చేస్తున్న పని ముగిసే వేళకు గుర్తుకువస్తుంది. ఇది నా స్వానుభవం.
మనకు నచ్చిన ఏదో ఒక వ్యాపకంవలన మెదడును నిరంతరం పనిచేయిస్తూ వుంటే మతిమరుపు మన దగ్గరకు రావటం మరచిపోతుంది.

-ఆయి కమలమ్మ