అంతర్జాతీయం

మయన్మార్‌ అధ్యక్షుడిగా హితిన్‌ క్యా ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మయన్మార్‌ : అంగ్‌శాన్‌ సూచీ మాజీ డ్రైవర్‌, ఆమె అత్యంత సన్నిహితుడు హితిన్‌ క్యా ఇద్దరు ఉపాధ్యక్షులతో కలిసి మయన్మార్‌ అధ్యక్షుడిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. దశాబ్దాల తర్వాత గతేడాది నవంబర్‌లో మయన్మార్‌లో సాధారణ ఎన్నికల్లో నోబెల్‌ బహుమతి గ్రహీత అంగ్‌శాన్‌ సూచీ నేతృత్వంలోని నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీ పార్టీ ఘనవిజయం సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సూచీ పార్టీకి అవకాశం దక్కింది. అయితే పౌరసత్వ సమస్య కారణంగా అధ్యక్ష పదవికి సూచీ పోటీ చేయలేకపోయారు. దీంతో ఆమె అత్యంత సన్నిహితుడైన హితిన్‌ క్యా ను అధ్యక్ష బరిలోకి దింపారు సూచీ.