మహబూబ్‌నగర్

మెరుగెన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, అక్టోబర్ 1: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద ప్రజలకు మెరుగైనా వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.475 కోట్లతో నిర్మించిన మెడికల్ కళాశాల శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కుల, మత విబేదాలు లేకుండా చదువులో రాణించాలని వైద్య విద్యార్థులకు ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుంటే జిల్లాకు మెడికల్ కళాశాల వచ్చేది కాదన్నారు. కరువు జిల్లా అయినా పాలమూరు జిల్లాకు మెడికల్ కళాశాల రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. వైద్యులు కేవలం పట్టణాల్లోనే వేద్య సేవలు అందిస్తున్నారని అలా కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మెరుగైనా వైద్య సేవలు అందించాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలోని ప్రజలందరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్ధి వారిని సంస్కారవంతులుగా చేయాలని ప్రభుత్వం ఉచిత నిర్బంద విధ్యను అందిస్తుందని ఆయన పెర్కొన్నారు. కోట్లాది రూపాయాల వ్యయంతో ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యావిధానం అందరికి ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెస్తున్నారని తెలిపారు. కాగా నూతనంగా పాలమూరులో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలల్లో సీట్లు సంపాధించుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఎమ్మెల్యే వారి వివరాలు తెలుసుకుని మంచి చదివి ఈ మెడికల్ కళశాలకు మంచిపేరు తీసుకురావలని సూచించారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాలణ ఆశోక్‌కుమార్, డాక్టర్ శామ్యూల్ పాల్గొన్నారు.

తాగునీటి సమస్యను రాజకీయం చేయకండి
* ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి
మక్తల్, అక్టోబర్ 1: ప్రకృతి సిద్ధంగా వచ్చిన నీటి ఉధృతికి కొట్టుకుపోయిన బ్రిడ్జిపై ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం హాస్యాస్పదంగా ఉందని, తాగునీటిపై రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకోవడమేనా వీరి నైజమని, శాశ్విత తాగునీటి పరిష్కారానికి తన వంతు కృషి చేయడమే తన ముందున్న లక్ష్యమని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మక్తల్‌లోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ మంత్రి, సీనియర్ నాయకుడైన నాగం జనార్ధన్‌రెడ్డి మక్తల్‌లో దీక్షలు చేస్తున్న అఖిలపక్ష నాయకులకు సంఘీభావం తెలుపుతూ పంచదేవ్‌పాడ్ గ్రామసమీపంలో జరుగుతున్న బ్రిడ్జి పనులను పరిశీలించి ఇదేనా బంగారు తెలంగాణ అంటూ విమర్శించడం సరికాదని అన్నారు. గతంలోని బ్రిడ్జి ఎలా తెగింది, పనులు జరుగుతున్నాయన్న వివరాలు తెలుసుకోకుండా మరోరాయి విసరడానికే ఇక్కడకు రావడమేనా ఆయన పని అంటూ అన్నారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే సినియర్ నాయకత్వానికి మర్యాదగా ఉంటుందన్నారు. సత్యసాయి పథకం ప్రారంభం అయ్యిందే తన తండ్రి చిట్టెం నర్సిరెడ్డి హాయాంలో, అలాంటిది తాగునీటి పైపులైన్లను నేను ధ్వంసం చేయడమా అని ఆవేదన వ్యక్తం చేశారు. తానే ద్వంసం చేశానని మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి అనడంలో ఎంత వాస్తవ ముంది, ఒక్కనాడైన ఈప్రాంత ప్రజల గురించి పట్టించుకుని సత్యసాయి నీటి కోసం పాటుపడ్డా అంటూ తాను అడుగుతున్నట్లు ఆయన ప్రశ్నించారు.

జిల్లా సాధన కోసం అయిజ ఎంపిపి ఆమరణ దీక్ష
గద్వాల, అక్టోబర్ 1: అన్ని అర్హతలు ఉన్న గద్వాలను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నడిగడ్డలోని గద్వాల, అలంపూర్ ప్రాంతాలకు చెందిన ప్రజలు అనేక ఉద్యమాలను నిర్వహిస్తున్నారు. జెఎసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆమరణ నిరాహార దీక్షను శనివారం అయిజ ఎంపిపి సుందర్‌రాజు పూనుకున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ర్యాలీగా వచ్చిన ఎంపిపి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి దీక్షాస్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటిసి తిరుమలరెడ్డి, ఎంపిపి సుభాన్, జెఎసి నేతలు నాగరాజు, కోళ్ళ హుస్సేన్, వాల్మీకి సుందర్‌రాజుకు స్వాగతం పలికారు. గద్వాల ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అధికార పార్టీలో ఉన్నప్పటికీ ఉద్యమ పంథాను ఎంచుకోవడం జరిగిందని సుందర్‌రాజు పేర్కొన్నారు. నడిగడ్డలోని అలంపూర్, గద్వాల ప్రాంతాలకు చెందిన ప్రజలు జోగుళాంబ పేరిట గద్వాల కేంద్రంగా జిల్లా చేయాలని ఆకాంక్షిస్తున్నారని, వారి ఆకాంక్ష నెరవేరాలని ఆమరణ దీక్షకు పూనుకుంటున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాసంక్షేమం కోసం అన్ని రంగాలను ఉత్తేజపరుస్తూ ప్రజారంజక పథకాలను ప్రవేశపెడుతున్నారని, నడిగడ్డ ప్రజల ఆకాంక్ష అయిన జిల్లాను కూడా ఏర్పాటు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కొందరు జిల్లా ఉద్యమాన్ని స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని టిఆర్‌ఎస్ పార్టీ ఉద్యమానికి కలిసిరావడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు జిల్లా ఉద్యమాన్ని చాపకింద నీరులా రాష్ట్ర మంత్రులకు, ప్రభుత్వానికి తెలియజేశారన్నారు.. ఈ సందర్భంగా అయిజ, గద్వాల, ఇటిక్యాల, ధరూరు, మల్దకల్, గట్టు ప్రాంతాలకు చెందిన టిఆర్‌ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పక్షాల నేతలు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జడ్పీటిసి భాస్కర్, మహిమూద్, గోవిందు, విజయ్, మంద మల్లి, భగీరథ వంశీ పాల్గొన్నారు.