మహబూబ్‌నగర్

తెలంగాణ వారసత్వం కమ్యూనిస్టులదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాన్‌గల్, నవంబర్ 6: తెలంగాణ పోరాట వారసత్వం కమ్యూనిస్టు పార్టీలదేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినెని వీరభద్రం అన్నారు. శనివారం రాత్రి మండల పరిధిలోని రేమద్దుల గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర బహిరంగ సభను ఉద్దేశించి ఆయన మా ట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రజారైతు సంక్షేమాన్ని సిఎం కెసిఆర్ విస్మరించారని, ఎన్నికల వాగ్ధానాలను తుంగలోతొక్కి మాటల ప్రభుత్వంగా నిరూపించుకున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ అనంతరం రాష్ట్ర ప్రగతిలో ఎలాంటి మార్పు లేదని, సామాజిక న్యాయం కోసమే పేదల పక్షాన పోరాటానికి సిద్ధం కావాలన్నారు. టిఆర్‌ఎస్ పాలన పారదర్శకంగా లేదని, రాష్ట్రం లో అధికంగా ఉన్న బహుజనులకు సామాజిక న్యాయం దక్కడం లేదన్నారు. ప్రజలను చైతన్య పరిచేందుకు మహాజన పాదయాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు. రంగులు మార్చే నేతలను ప్రజలు నమ్మవద్దని, పాదయాత్రలో ప్రజల నుండి వచ్చిన సమస్యలపై నివేదిక సిద్ధం చేసి ముఖ్యమంత్రికి అందజేస్తామన్నారు. కెజి టూ పిజి ఉచిత విద్య, దళితులకు మూడు ఎకరాల భూపంపిణీ, డబుల్ బెడ్‌రూమ్‌లు తదితర హామీలు నేరవేర్చడం లో విఫలమయ్యారని ఆయన అ న్నారు. మహాజన పాదయాత్రకు స ర్పంచ్ నాగమ్మతో పాటు మహిళలు బతుకమ్మలతో ఘనస్వాగతం పలికారు. గ్రామ సమస్యలపై వినతిపత్రా న్ని అందజేశారు. సిపిఎం రాష్ట్ర నాయకులు జాన్‌వెస్లీ, ఆంజనేయులు, ఎం పటిసి వేణుగోపాల్ పాల్గొన్నారు.