మహబూబ్‌నగర్

భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, నవంబర్ 14: కార్తీక మాసంలో అత్యతంత పవిత్రమైన రోజు పౌర్ణమి. పౌర్ణమి రోజు నది స్నానం చేసి కార్తీక దీపాలు వెలిగిస్తే సాక్షాత్తు పరమాత్ముడి ఆశీస్సులు దక్కుతాయని భక్తుల నమ్మకం. పురాణాలు, శాస్త్రాలు సైతం అదే చెబుతున్నాయి. అందులో భాగంగా సోమవారం కార్తీక పౌర్ణమి వేడుకలు జిల్లాలో ఘనంగా భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల పరిధిలోని కృష్ణానది తీరం కార్తీక శోభ సంతరించుకుంది. కృష్ణానది తీరాన ఉన్న దేవాలయాలకు భక్తుల తాకిడి నెలకొంది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని కృష్ణానదిలో పుణ్యస్నానలు ఆచరించడానికి వివిధ ప్రాంతాల ప్రజలు తరలివచ్చారు. దాంతో కృష్ణానది తీరాన ఎటు చూసిన భక్తుల తాకిడి నెలకొంది. మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా మండలం కృష్ణాఘాట్‌కు భక్తులు పొటెత్తారు. నదిలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి పుణ్యస్నానాలు చేశారు. నది ఒడ్డున ఉన్న వెలసిన ఈశ్వరుడి దేవాలయానికి భక్తులు వెలాదిగా దర్శించుకున్నారు. శివలింగానికి అభిషేకం చేసి కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. భక్తులు ప్రత్యేక పూజలు చేసి కార్తీక దీపాలను వెలిగించారు. అదేవిధంగా మక్తల్ మండలం పసుపుల ఘాట్‌కు భక్తుల రద్దీ కనిపించింది. కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు నదిలో కార్తీక దీపాలను వదిలి దత్తాత్రేయుని దర్శనం చేస్తున్నారు. బీచ్‌పల్లి, నది అగ్రహారం, పంచదేవుపహాడ్ దగ్గర కార్తీక శోభ కనిపించింది. బీచ్‌పల్లి దగ్గర కృష్ణానదిలో కార్తీక పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు తరలిరావడంతో బీచ్‌పల్లి జనసంద్రంగా మారింది. బీచ్‌పల్లి ఆంజనేయస్వామి దేవాలయంతో పాటు అక్కడ ఉన్న రామాలయం, శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. రంగాపూర్ కృష్ణానది తీరానికి భక్తులు వచ్చి కృష్ణమ్మ ఒడిలో పుణ్యస్నానం చేసి కార్తీక దీపాలను వదిలారు. నల్లమల్ల అటవీ ప్రాంతంలోని సోమశిల దగ్గర కృష్ణానదికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఘాట్ దగ్గర భక్తజన సందడి నెలకొంది. సప్తనదులు కలయిక గల సోమశిల సంగమం దగ్గర కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్దలతో కొనసాగాయి. శ్రీ లలితా సోమేశ్వరస్వామిని భక్తులు దర్శించుకునేందుకు బారీగా క్యూలైన్లో నిలబడ్డారు. సప్తమ సంగమం సోమశిలలోని కృష్ణానదిలో కార్తీక దీపాలను వదిలి మహిళలు తమ భక్తిని చాటుకున్నారు. సోమేశ్వర ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున కార్తీక దీపారాదాన చేశారు. కృష్ణానది తీరాన ఉన్న శైవక్షేత్రాలన్ని హరహర మహదేవ శంభో అనే నామస్మరణతో మారుమ్రోగాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శివాలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి.