మహబూబ్‌నగర్

పల్లెవికాసంలో సమస్యలు గుర్తించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధరూరు, జనవరి 3: గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే పల్లెవికాస కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను గుర్తించి సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌షైని అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కొత్తపాలెం గ్రామంలో నిర్వహించిన పల్లెవికాస కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకవచ్చి వెంటనే పరిష్కరించుకోవాలని ఆయన గ్రామస్థులకు సూచించారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందేవిధంగా అధికారులు పనిచేయాలన్నారు. గ్రామాలలో ముఖ్యంగా మరుగుదొడ్లు, డ్రైనేజీ, ఇంకుడు గుంతలు తదితర సమస్యలపై సరైన అవగాహన లేక సతమతవౌతున్నారని వారికి అవగాహన కల్పించి వెంటనే వాటిని నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ వైద్యుడు, ఎంపిడిఓ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ భవిష్యత్తులో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ నర్సింహనాయుడు, తహశీల్దార్ సమద్, ఇఓపిఆర్‌డి రవీందర్, ఎంఇఓ నరేష్, వ్యవసాయ అధికారిణి భవాణి, ఐకెపి అధికారిణి సలోని తదితరులు పాల్గొన్నారు.

123 జిఓ ప్రకారమే భూసేకరణ
* సంగంబండ, పాలమూరు ఎత్తిపోతల పనుల్లో పురోగతి
* ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఆదేశం

మహబూబ్‌నగర్, జనవరి 3: సంగంబండ పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భూసేకరణ పనుల పురోగతి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ జిల్లా కలెక్టర్లను, సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ జిఎడి నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చీఫ్ సెక్రెటరీ మాట్లాడుతూ ప్రాజెక్టులకు కావల్సిన భూసేకరణ 123 జిఓ ప్రకారం సేకరించాలని, సర్వేల నంబర్ల వారీగా నివేదికలు తయారు చేసుకోవాలని, గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేసి సమస్యలు ఉంటేవెంటనే నివృత్తి చేసుకోవాలని, ప్రభుత్వ జిఓ ప్రకారం నడుచుకోవాలని, సర్వే రూల్స్ ప్రకారం పనులు పూర్తి చేయాలని, ఎన్.కె-1 జనవరి 31 వరకు పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశించారు. హరితహారం కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా విజయవంతం చేయాలని, వచ్చే వర్షాకాలం నాటి మొక్కలను ఇప్పుడే సిద్దం చేసుకోవాలని, మొక్కల డిమాండ్లకు తగ్గట్టుగా నర్సరీలలో పెంచాలని, ఈ సంవత్సరం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, జిల్లా కమిటీల ద్వారా జిల్లాలోని అంతటా మొక్కలు పంపిణీ చేయాలని, గ్రామస్థాయిలో మైక్రోప్లాన్‌ను తయారు చేసుకోవాలని, వర్షాలు ప్రారంభం కాగానే మొక్కలు నాటేవిధంగా సంబందిత అధికారులతో సమన్వయం చేసుకుని నడవవలసిన ప్రదేశాలను ముందుగానే గుర్తించాలని తెలిపారు. జిల్లా నుండి వెళ్లే జాతీయ రహదారి వెంట నాటిన మొక్కలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఓ ప్రత్యేక అధికారి ద్వారా మొక్కల పర్యవేక్షణ చేయించాలని, ప్రభుత్వం ఐదేళ్ల ప్రణాళికలతో ముందుకు సాగుతోందని అన్నారు. ఇప్పటికే రెండేళ్లు విజయవంతంగా పూర్తి చేశామని అన్నారు. వచ్చే సంవత్సరంలో కూడా విజయవంతం చేయాలని ఆయన తెలిపారు. షాదీముబారక్ పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, దరఖాస్తుదారుడికి న్యాయం జరిగేలా చూడాలని తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసినందుకు రిజిస్ట్రేషన్, పరిశీలన, విచారణ పక్కాగా నిర్వహించి లబ్ధిదారుడికి సరైన న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. మిషన్ భగీరథ 989 జిఓ ప్రకారం డిస్ట్రిబ్యూటరీ పనులను మానిటరింగ్ చేయాలని పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి తాగునీరు అందేవిధంగా మెయిన్ పైప్‌లైన్, సబ్‌పైప్‌లైన్ జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పట్టణ, గ్రామీణతండాల వైపు వెళ్లే ప్రదేశాల్లో తప్పకుండా నీటిని సరపడా చేయాలని అన్నారు. దీనిని చాలెంజ్‌గా ప్రభుత్వం తీసుకుందని పర్యవేక్షణ ఉండాలని ఆయన అన్నారు. రిజిస్ట్రర్ అయిన లోకల్ కాంట్రాక్టర్లకు కొన్ని పనులు అప్పగించాలని అన్నారు. ఎస్సీ, ఆర్‌డబ్ల్యూఎస్ ఇతర ఇంజనీర్లతో సమన్వయంతో పనులు పూర్తి చేయాలని తెలిపారు. పైప్‌లైన్ నిర్మాణం అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలకు తగ్గకుండా ఉండేవిధంగా చూడాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పల్స్‌పోలియో మొదటి విడత ఈనెల 29న, రెండవ విడత ఏప్రిల్ 2వ తేదిన నిర్వహిస్తున్నందున అందుకు అవసరమైన వ్యాక్సిన్‌లు జిల్లా లకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. 0నుండి5 ఏళ్ల పిల్లలందరికి తప్పకుండా పల్స్‌పోలియో చుక్కలు వేయించేవిధంగా జిల్లా కలెక్టర్లు శ్రద్ద చూపాలని తెలిపారు. ఈ విడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్, జేసి శివకుమార్‌నాయుడు, స్పెషల్ కలెక్టర్ భూసేకరణ వనజాదేవి, డిఆర్‌డిఏ పిడి దామోదర్‌రెడ్డి, డిఎఫ్‌ఓ గంగారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.