మహబూబ్‌నగర్

అబద్ధాలు ఆడటంలో వారికి వారే సాటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణపేటటౌన్, ఫిబ్రవరి 28: కేంద్రంలో, రాష్ట్రంలో క్రూరమైన, భీకరమైన ప్రభుత్వం పాలన కొనసాగుతోందని, రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాలకు ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారని కేంద్ర మాజీ మంత్రి, సిడబ్లుసి సభ్యుడు సూదిని జైపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట నియోజకవర్గ కేంద్రంలోని మెట్రో గార్డెన్స్ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన జన ఆవేదన సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి సంకీర్ణ ఎన్డీఎ కూటమి తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా దేశంలోని సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు దారిద్య్రరేఖకు దిగువన చేరుకుంటున్నాయని ఆరోపించారు. నోట్ల రద్దు కారణంగా దేశ ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, బ్యాంకుల ముందు క్యూలో నిలుచుని దేశవ్యాప్తంగా 125మంది చనిపోతే వారి కుటుంబాలను ఆదుకోకుండా కనీసం వారిని మానవతా దృక్పథంతో పరమార్శించుకుండా కేవలం విచారం వ్యక్తం చేసి దేశంలోని సామాన్యులపై తమకు ఉన్న చిత్తశుద్ధిని కేంద్రం చాటుకుందన్నారు. అబద్ధాలు చెప్పడంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సిఎం కెసిఆర్ ఎవరికి వారే సాటి అన్నారు. సోనియాగాంధీ చొరవవల్లే 60సంవత్సరాల తెలంగాణ వచ్చిందని, సిఎం కెసిఆర్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఏ మెరకు నెరవేర్చారో స్పష్టం చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నయమని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యమన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నారాయణపేట జిల్లాను కాంగ్రెస్ ఏర్పాటు చేసి తీరుతుందని, ఇందుకు తానే పూచీ అని జైపాల్‌రెడ్డి అన్నారు.
ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల
పనితీరును ఎండగడదాం :అరుణ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కాంగ్రెస్ శ్రేణులు ఎప్పటికప్పుడు ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైందని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ అన్నారు. రాష్ట్రంలో నోట్ల రద్దు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి తీరా తొమ్మిది రోజులకే ప్రధాని తీసుకున్న నిర్ణయం అమోఘమంటూ ప్రకటించి రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన సిఎం కెసిఆర్ ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. నారాయణపేట డివిజన్‌ను సస్యశామలం చేసేందుకు తనతండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి జాయమ్మ చెరువు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చి జిఓనెం 69ని విడుదల చేయించారని, అయితే ఈ ప్రభుత్వం ఆ జిఓను పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో విలీనం చేస్తూ జూరాల నీటికి ఈ ప్రాంతాన్ని చివరి ఆయకట్టుగా మార్చేసిందన్నారు. కాంగ్రెస్ శ్రేణులు ఎప్పటికప్పుడు ఉద్యమించి, రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టేందుకు ఇప్పటినుండే సన్నద్దులు కావాలని పిలుపునిచ్చారు.
కార్యకర్తల్లో నెలకొన్న ఆవేదనను తొలగిస్తాం: ఎమ్మెల్యే సంపత్‌కుమార్
కాంగ్రెస్ కార్యకర్తల్లో నెలకొన్న ఆవేదనను తొలగించి పార్టీకి నూతనోత్తేజం తీసుకువచ్చేందుకే జన ఆవేదన సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అన్నారు. మంగళవారం నారాయణపేటలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని నాలుగుకోట్ల ప్రజలు ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజజలను సన్నద్దులను చేయాల్సిన భాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందన్నారు. కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ వీరారెడ్డి, డిసిఎంఎస్ చైర్మన్ నిజాంపాష, డిసిసి అధ్యక్షులు ఉబేదుల్లా కోత్వాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రెడ్డిగారి రవీంద్రరెడ్డి, ఒబిసి సెల్ చైర్మన్ రాజేందర్‌గౌడ్, పిసిసి సభ్యుడు శ్రీనివాస్‌గుప్త, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ శశికళ మల్లికార్జున్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు అమ్మక్కోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, సుధాకర్, ఘనశ్యాందాస్ ధరక్, ధన్వాడ పిఎసిఎస్ అధ్యక్షులు నిరంజన్‌రెడ్డి, నియోజకవర్గంలోని ఆయా మండలాల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
తప్పులు మాట్లాడితే నోరు చీరేస్తా : అరుణ
జన ఆవేదన సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై, తనపై ఎవరైనా తప్పులు మాట్లాడితే వారి నోరు చీరేస్తానని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ ఆవేశంగా అన్నారు. పలు పార్టీలు ఫిరాయించిన వారు అనవసర వాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. తాను పుట్టింది నారాయణపేట పట్టణంలో అని, తన తండ్రి చిట్టెం నర్సిరెడ్డి ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి చేసిన సేవలను అలాగే కొనసాగించేందుకే తాను ఈ ప్రాంతంలో పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నానన్నారు. తాను ఇక్కడి నుండి ఎందుకు పోటీ చేస్తాను తనకు గద్వాల నియోజకవర్గం ఉందని, తాను అక్కడి నుండే పోటీ చేస్తానని, ఈ ప్రాంతంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తనవంతు పూర్తి సహకారం అందిస్తానని, ఎవరైనా తనపై అవాకులు, చెవాకులు పేలితే తగిన గుణపాఠం నేర్పేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.
మైనర్ కాల్వలను పూర్తి చేసి
సాగునీరు అందించాలి
* మంత్రి జూపల్లి కృష్ణారావు
పాన్‌గల్, ఫిబ్రవరి 28: మైనర్ కాల్వలను త్వరితగతిన పూర్తి చేసి రైతాంగానికి చివరి అయకట్టు వరకు సాగునీరు అందించాలని రాష్ట్ర పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుఅన్నారు. మంగళవారం మండల పరిధిలోని బుసిరెడ్డిపల్లి, పుల్గర్‌చర్ల గ్రామాలకు వెళ్లె భీమా డి-236 డిస్టిబ్యూటర్ కేనాల్ కాల్వ పనుల తవ్వకంపై రైతులతో మాట్లాడారు. కాల్వ తవ్వకంలో భూములు కోల్పోయే రైతులకు తప్పకుండా పరిహారం అందుతుందని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారైతు సంక్షేమం కోసమే పని చేస్తున్నదని ఆయన అన్నారు. టి ఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాకా రైతాంగానికి సాగునీరు అందించి రైతు సంక్షేమమే ద్యేయంగా పని చేస్తుందన్నారు. అనంతరం రైతులతో మాట్లాడి కాల్వ పనుల తవ్వకం కోసం సహకరించాలని ఆయన కోరారు. డిస్టిబ్యూటర్ కేనాల్ తవ్వకాలకు అవాడ్ అయినప్పటికి కాల్వ పనుల తవ్వకంలో నిర్లక్ష్యం వహించవద్దని ఆయన అధికారులకు సూచించారు. మంత్రి వెంట ఎంపిపి వెంకటేష్ నాయుడు, జడ్పిటిసి రవికుమార్, సగర సంఘం జిల్లా అద్యక్షులు తిరుపతయ్య సాగర్, నాయకులు సుదర్శన్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, వీరసాగర్ తదితరులు ఉన్నారు.