మహబూబ్‌నగర్

ప్రశాంతంగా పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 19: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ ఎన్నికల్లో 90.79శాతం ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 49పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. 6678మంది ఓటర్లకు గాను 6063మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 615మంది మాత్రమే తమ ఓటుహక్కును వినియోగించుకోలేకపోయారు. ఇది ఇలా ఉండగా మహబూబ్‌నగర్ జిల్లాలో 18 పోలింగ్ కేంద్రాల్లో 3448మంది ఓటర్లకు గాను 3130మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా వనపర్తి జిల్లాలో ఆరు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించగా 1057మంది ఓటర్లకు గాను 960మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 14 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించిన ఎన్నికల్లో 1361మంది ఓటర్లకు గాను 1233మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 11 పోలింగ్ కేంద్రాల్లో 812మంది ఓటర్లకు గాను 740మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 6678మంది ఓటర్లకు గాను 6063మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆయా జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు సంబందిత అధికారులతో సమాచారాన్ని తెలుసుకున్నారు. ఎస్పీలు సైతం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇది ఇలా ఉండగా మహబూబ్‌నగర్ జిల్లాలో 18పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా కోస్గి పోలింగ్ కేంద్రంలో 73 ఓట్లకు గాను 67 ఓట్లు పోల్ కాగా మద్దూర్‌లో 29 ఓట్లకు గాను 26 ఓట్లు పోల్ అయ్యాయి. నవాబుపేటలో 14 ఓట్లకు గాను 14 ఓట్లు పోల్ అయ్యాయి. బాలానగర్‌లో 21 ఓట్లగాను 20 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మిడ్జిల్‌లో 12 మందికి 12మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. జడ్చర్లలో 328 ఓటర్లకు గాను 306మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మహబూబ్‌నగర్‌లో మూడు బూత్‌లను ఏర్పాటు చేశారు. అందులో ఒకబూత్‌లో 776 ఓట్లకు గాను 698 ఓట్లు పోల్ అయ్యాయి. మరో బూత్‌లో 764 ఓట్లకు గాను 679మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా మరో పోలింగ్ బూత్‌లో 772 ఓట్లకు గాను 698మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కోయిలకొండలో 19 మంది ఓటర్లకు గాను 18మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. నారాయణపేటలో 302 ఓట్లకు గాను 276మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మరికల్‌లో 44 ఓట్లకు గాను 41 ఓట్లు పోల్ అయ్యాయి. దేవరకద్రలో 19 ఓట్లకు గాను 19మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. భూత్పూర్‌లో 26 మంది ఓటర్లకు గాను 26మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ముసాపేటలో 14మంది ఓటర్లకు గాను 13మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మక్తల్‌లో 71 ఓట్లకు గాను 68మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. చిన్నచింతకుంటలో 8 ఓట్లకు గాను 8 ఓట్లు పోల్ అయ్యాయి. అదేవిధంగా గండ్విడ్‌లో 156 ఓట్లకు గాను 141మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకుని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని తెల్చేందుకు బ్యాలెట్ బాక్స్‌లో ఓట్లను భద్రపరిచారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ జరగడం బ్యాలెట్ బాక్స్‌లను రాత్రి భారి పోలీసు బందోబస్తు మధ్య హైదరాబాద్‌కు తరలించారు. ఈ నెల 22న హైదరాబాద్‌లోని విక్టోరియా మైదానంలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. కౌంటింగ్ కేంద్రానికి బ్యాలెట్ బాక్స్‌లను అధికారులు తరలించారు. ఏది ఎమైనప్పటికిని పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు తమ అభ్యర్థుల గెలుపు ఖాయమంటూ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో అప్పుడే విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు.