మహబూబ్‌నగర్

పిల్లలు రామాయణం వంటి పుస్తకాలను చదివితే...వ్యక్తిత్వం పెరుగుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 13: పిల్లలు రామాయణం వంటి పుస్తకాలను చదివితే సంస్కారంతో పాటు వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుందని తెలంగాణ సాంస్కృతిక మండలి చైర్మన్ రమణచారి అన్నారు. గురువారం రాత్రి మహబూబ్‌నగర్ పట్టణంలోని టౌన్‌హల్‌లో వేముల గ్రామానికి సంబంధించిన విద్యార్థులు రచించిన విద్యార్థి రామాయణం పుస్తకాలను రమణచారితో పాటు పలువురు అవిష్కరించారు. ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సాంస్కృతిక మండలి కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. విద్యార్థుల్లో రామాయణం, బాగవతం తదితర ఆధ్యాత్మిక పుస్తకాలు చదివినట్లు అయితే మేధాశక్తి పెరుగుతుందని ముఖ్యంగా మనిషి సన్మార్గంలో నడిచేందుకు ఎంతోగానో దోహదపడుతుందని అన్నారు. రామాయణం మనిషికి జీవితంలో మంచి ఆదర్శాన్ని ఇస్తూ జీవితంలో మంచి చేయాలనే ఆలోచన వస్తుందన్నారు. శ్రీరామచంద్రుడు ప్రపంచానికే ఆదర్శమూర్తి అని కొనియాడారు. దేవతల చరిత్రలను తెలులుకోవల్సిన అవసరం నేటి తరానికి ఎంతగానో అవసరమన్నారు. పాశ్చాత్య సంస్కృతిలో పడి కన్న తల్లిదండ్రులను కూడా మరిచేరోజులు వచ్చాయని ఇలాంటి పరిణామాల నుండి ప్రజలకు విముక్తి లభించాలంటే రామాయణంలాంటి పుస్తకాలను ప్రత్యేకంగా చదవాలన్నారు. రామాయణం, భాగవతం, భగవద్గీత తదితర ఆధ్మాత్మిక పుస్తకాలు ప్రతి రోజు ఇళ్లల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు చదివించినట్లు అయితే భవిష్యత్తులో సంప్రదాయబద్ధంగా బాధ్యతగా పిల్లలు పెరుగుతారని తెలిపారు. నేడు ప్రచార సాధనాలు కూడా ముందున్నాయని అందులో కూడా రామాయణం లాంటి కథలు వస్తుంటాయని వాటిని పిల్లలకు చూపిస్తే మంచిదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్యాత్మికతకు, సంస్కృతి సంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని అన్ని వర్గాల ప్రజల సంప్రదాయాలను గౌరవిస్తుందని వాటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని పలు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. వేముల విద్యార్థులు రామాయణం పుస్తకాలను రచించడం పట్ల తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్లెర్ల రాంమోహన్‌రావు, ఆచార్య రవ్వ శ్రీహరి, తిరుపతిరెడ్డి, బాగన్నగౌడ్, సంపత్‌కుమార్ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.

మతపరమైన రిజర్వేషన్లను సహించేది లేదు
* బిజెవైఎం పట్టణ అధ్యక్షుడు నరేష్‌కుమార్

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 13: మతపరమైన రిజర్వేషన్లను సహించేది లేదని హిందువుల మనోహభావాలను ముఖ్యమంత్రి కెసిఆర్ దెబ్బతీస్తున్నారని బిజెవైఎం పట్టణ అధ్యక్షుడు నరేష్‌కుమార్ ఆరోపించారు. గురువారం బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నరేష్‌కుమార్ మాట్లాడుతూ బిసిల ఆత్మగౌరవాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ తాకట్టు పెడుతున్నారని ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా చేపడుతున్న రిజర్వేషన్లను ఒప్పుకునేది లేదని ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వ్యతిరేకంగా ధర్నాలు రాస్తారోకోలు చేపడుతామని హెచ్చరించారు. ముస్లింలను బిసిలలో ఇప్పటికే నాలుగుశాతం రిజర్వేషన్లు కల్పించి అన్యాయం చేశారని, కోర్టుల్లో కేసులు ఉన్నప్పటికిని తాను మాత్రం 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని ముఖ్యమంత్రి అహంకారంగా మాట్లాడుతున్నారని అన్నారు. హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా కెసిఆర్ శైలి ఉందని రాబోయే కాలంలో టిఆర్‌ఎస్ పార్టీకి హిందువులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ నెల 16వ తేదిన ప్రతి వార్డులో ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తామని అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ఆమోదముద్ర వేస్తామని చెప్పడం తగదన్నారు. బిజెవైఎం ఆధ్వర్యంలో తెరాసకు వ్యతిరేకంగా హిందూ సమాజాన్ని చైతన్యపరిచి రాబోయే కాలంలో టిఆర్‌ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసమే కెసిఆర్ ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. విలేఖరుల సమావేశంలో నాయకులు దేవేందర్, దేవరాజు, ప్రతాప్, రవీందర్‌రెడ్డి, శివకృష్ణ, నరేష్, నరసింహచారి తదితరులు పాల్గొన్నారు.

ఎంజికెఎల్‌ఐ ద్వారా
దిన్‌దార్‌చిప్ప చెరువు నింపండి
* మూడు గంటల సేపు కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో * నియోజకవర్గం ఇన్‌చార్జీ హర్షవర్ధన్‌రెడ్డితో సహా కార్యకర్తల అరెస్టు
కొల్లాపూర్, ఏప్రిల్ 13: మండలంలోని మొలచింతలపల్లి, ముక్కుడుగుండం గ్రామాల మధ్యన ఉన్న దిన్‌దార్ చిప్ప చెరువును ఎంజికెఎల్‌ఐ కాలువల ద్వారా నీటితో నింపాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జీ బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో దాదాపు 3 గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. గురువారం మండలంలోని మొలచింతలపల్లి, ముక్కుడుగుండం తదితర గ్రామాల నుంచి దాదాపు 300 మంది రైతులు దిన్‌దార్‌చిప్ప చెరువు నింపాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బీరం హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి సెంటు, గుంట కృష్ణాజలాల పంట అంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నా ఎంజికెఎల్‌ఐ పథకానికి దగ్గరలో ఉన్న దిన్‌దార్ చిప్ప చెరువుకు మాత్రం సాగునీరు అందించడంలేదన్నారు. మాజి సిఎం జలగం వెంగళరావు హాయంలో ఆనాటి ఎమ్మెల్యే కె. రంగదాసు ఆధ్వర్యంలో 1600 ఎకరాలకు సాగునీరు అందించే దిన్‌దార్‌చిప్ప చెరువు నిర్మాణం జరిగిందన్నారు.
అట్టి చెరువును కొంత ఎత్తు పెంచి ఐదువేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్నారు. ఈ చెరువు ద్వారా మొలచింతపల్లి, ముక్కుడుగుండం, నార్లాపూర్‌లతోపాటు మరికొన్ని గిరిజన తండాలకు సాగునీరు అందుతుందన్నారు. ఎన్నిమార్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చిన స్పందించడంలేదని ఆరోపించారు. ఇలాగే జరిగితే ఉద్యమాన్ని ఉద్దృతం చేస్తామని హెచ్చరించారు. రాస్తారోకోకు సిపిఐ కూడా మద్దతు ప్రకటించింది. ఎస్‌ఎండి ఫయాజ్ మాట్లాడారు. అనంతరం పోలీసులు బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజి జడ్పీటిసి కాటం జంబులయ్య, నాయకులు రత్నా ప్రభాకర్‌రెడ్డి, సురేందర్‌సింగ్‌లతోపాటు మరో 10మందిని అరెస్టు చేశారు. వీరిని వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని లాఠీలతో చెదరగొట్టి అరెస్టు చేసిన నేతలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.