మహబూబ్‌నగర్

సారారహిత గ్రామాలే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకుర్తి, ఏప్రిల్ 28: సారా రహిత గ్రామాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ కొనసాగుతుందని, నాటుసారా తయారి, విక్రయాన్ని స్వచ్చంధంగా విరమిస్తే వారికి రూ.2లక్షలతో స్వయం ఉపాధి చూపించడం జరుగుతుందని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జయసేనరెడ్డి అన్నారు. శుక్రవారం జెపినగర్, రెడ్యా నాయక్ తాండలలో దాడులు నిర్వహించి 3600 బెల్లం పానకం, 17 లీటర్ల నాటుసారా, 60 కిల్లోల నల్లబెల్లం పట్టుకోవడంతో పాటు సారా తయారు చేసే వారిని, సారా విక్రయించే వారిని 8మందిని అరెస్టు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాటుసారా వల్ల అనారోగ్యానికి గురి కావడంతో పాటు కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, సారా తయారు, విక్రయించడం విరమిస్తే వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2లక్షల రూపాయాలతో స్వయం ఉపాధి చూపించడం జరుగుతుందని, సారా విరమించే వివరాలను సేకరించి స్వయం ఉపాధి పొందేందుకు అర్హులైన వారికి జూన్ 2న అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో నాగర్ కర్నూల్ ఇఎస్ శ్రీనివాస్‌రెడ్డి, ఎన్‌పోర్స్‌మెంట్ సిఐ రామకృష్ణ, స్థానిక ఎక్సైజ్ సిఐ రవిచంద్రారెడ్డి, సిబ్బంది తదితరులు ఉన్నారు.

అకాలవర్షంతో తీవ్ర నష్టం
* గుండెలు బాదుకున్న రైతులు
మల్దకల్, ఏప్రిల్ 28: మండల కేంద్రంతో పాటు గ్రామాలలో గురువారం కురిసిన అకాల వర్షంతో వరి, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి పంట కోతకు రావడంతో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షానికి పంట నేలరాలింది. దీంతో రైతులు గుండెలు బాదుకున్నారు. పంటలు బాగా వచ్చినా గిట్టుబాటు ధర రాక రైతులు విలవిలలాడుతుంటే అకాల వర్షాలతో రైతులు మరింత నష్టానికి గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.