మహబూబ్‌నగర్

భూ సేకరణ చట్ట సవరణను నిరసిస్తూ 123 జీవో ప్రతులు దగ్ధ్దం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 30: 2013-్భసేకరణ చట్టాన్ని సవరిస్తూ ఆదివారం ప్రత్యేక శాసనసభలో కెసిఆర్ ప్ర భుత్వం బలవంతంగా భూసేకరణ చట్ట సవరణను చేయడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో 123జీవో ప్రతులను అంబేద్కర్ చౌరస్తాలో దగ్దం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు ఆర్.శ్రీనివాస్ మాట్లాడుతూ 2013 కేంద్ర ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా 21 నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చే యడమే కాకుండా ఆ చట్టాన్ని పక్కన పెట్టి 123తో సహా అనేక జీవోలు తెచ్చి రైతులను, నిర్వాసితులను మోసం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన వివిధ చట్టాలను హైకోర్టులో అవి చెల్లవని తీర్పు ఇవ్వడంతో ప్ర భుత్వం జీర్ణించుకోలేక సాగునీటి ప్రాజెక్టుల కోసం యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలనే నెపంతో లక్షలాది ఎకరాల భూమిని బలవంతంగా గుంజుకునే ప్రయత్నం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు తరువాత ఆగమేఘాలమీద మందబలం ఉందనే అహంతో ఏకపక్షంగా అసెంబ్లీలో తీర్మాణం చేసి 123 జీవోలో కొన్నిసవరణలు చేసి చట్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి నివేదించగా కేంద్ర ప్రభుత్వం అట్టి చట్టంలో కొన్ని సవరణలు చేయాలని తిప్పి పంపడంతో ఆదివారమైనప్పటికి మళ్లీ సమావేశపర్చి, అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా చేసి, ఏకపక్షంగా పది నిమిషాలలో భూసేకరణ చట్టాన్ని సవరించి ఆమోదించడం ప్రభుత్వ నిరంకుశ విధానానికి నిదర్శనమన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలయ్యేదాక నిర్వాసితులను కలుపుకొని పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గీత, రామయ్య, మధు, నవీన్, సురేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగ భద్రత కోసం ఉద్యమిద్దాం
మక్తల్, ఏప్రిల్ 30: కాంట్రాక్టు కార్మికుల ఉద్యోగ భద్రతకై, కార్మిక హ క్కుల పరిరక్షణకై పోరాడుదామని ఐఎఫ్‌టియు జిల్లా సహకార్యదర్శి కిరణ్ కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో మేడే గోడపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ ప్రంపంచీకరణ విధానాల ఫలితంగా అమెరికా, యూరఫ్‌ల నుంచి ఇండియా వంటి దేశాలలోకి విదేశి పెట్టుబడుల వలసలు నానాటికి తీవ్రతరం అవుతున్నాయని అన్నారు. దేవాన్ని శ్రమశక్తిని పెట్టుమడిదారులు దొపిడి చేస్తున్నారన్నారు. తక్కువ వేతనాలతో, భద్రతలేని కాంట్రాక్టు ఉద్యోగాలు, అవుట్‌సోర్సింగ్ కార్మికులను ఇబ్బడి ముబ్బడిగా ప్రవేశ పెడుతుండటంతో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కార్మికులను వ్యట్టిచాకిరి నుండి విముక్తి కలిగించి వారిని అన్ని విదాల ఆదుకోవాని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటయ్య, అశోక్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.