మహబూబ్‌నగర్

మహాగౌరి అలంకరణలో జోగుళాంబదేవి దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలంపూర్, సెప్టెంబర్ 28: అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవ శక్తిపీఠమైన శ్రీ జోగుళాంబదేవి అమ్మవారు గురువారం మహాగౌరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయాలలో ఉదయం కుంకుమార్చనలు, నవవార్చనలు, సహస్రనామార్చనలు తదితర పూజలు చేశారు. సాయంత్రం దర్బార్ సేవలో కొలువుపూజ, సుహాసిని, కుమారి, మంత్ర పుష్పము, ప్రసాద వితరణ కార్యక్రమంలో చేపట్టారు. దేవిశరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 8వ రోజు మహాగౌరి దేవిగా విశేష పూజలందుకుంటారని అర్చకులు విక్రాంత్‌శర్మ,శ్యాంకుమార్‌శర్మలు తెలిపారు. అమ్మవారు మంగళాన్ని శాసిస్తుందన్నారు. మహాగౌరిదేవిని ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చెప్పారు. వృషభ వాహనం కలిగిన ఈ అమ్మవారిని పూజించడం వల్ల కళ్యాణప్రాప్తి కలుగుతుందని దశ మహావిద్యలో ప్రస్తావించారని తెలిపారు. భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో తరలివస్తూ అమ్మవారికి అర్చనలు నిర్వహిస్తున్నారు. ఆలయాలలో భక్తుల సందడి నెలకొంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఇఓ నరహరి గురురాజ పర్యవేక్షిస్తున్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు అర్చకులు గంగమ్మ తల్లికి నదిహారతి ఇచ్చారు. కార్యక్రమంలో డిఇఓ వేణుగోపాల్, ఆలయ ఇఓ, భక్తులు పాల్గొన్నారు.

అంగరంగా వైభవంగా
శ్రీ జోగుళాంబ దేవి రథోత్సవం
* దక్షిణకాశీ ఆలయాలలో భక్తుల రద్దీ * నేడు శ్రీ వేంకటేశ్వరుని కల్యాణం * రథోత్సవానికి కార్యనిర్వహణధికారి ప్రత్యేక పూజలు
అలంపూర్, సెప్టెంబర్ 27: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం దుర్గాష్టమి సందర్భంగా ఉదయం 10 గంటలకు శ్రీ జోగుళాంబదేవి రథోత్సవ కార్యక్రమాన్ని అంగరంగా వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయం నుండి పల్లకి సేవలో శ్రీ జోగుళాంబ దేవి బాలబ్రహ్మేశ్వర స్వామి త్రిశూలన్ని పూలమాలలతో అందంగా అలంకరించిన రథం దగ్గరకి తీసుకువచ్చి అలంకరించారు. అనంతరం అర్చకస్వాములు, కార్యనిర్వహణధికారి నరహరి గురురాజ రథం లో పేట్టిన ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుడిద గుమ్మడికాయను ఈఓ గురురాజ దిష్టితీసి రథోత్సవన్ని ప్రారంబించారు. భక్తులు అధిక సంఖ్యలో రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని నయననేత్రంగా తిలకించారు. సెలవు దినములు కావడంతో అలయాలను దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. భక్తులు ఆలయలలో ప్రత్యేక పూజలు నిర్వహించి తుంగభద్రనది తీరంలో పుట్టిలో విహరిస్తున్నారు. భక్తుల రద్దీతో ఆలయాలు ఆలయ పరిసరాలు కిక్కిరిస్తున్నాయి. శుక్రవారం మహార్నవమి నాడు శ్రీ వేంకటేశ్వరుని కళ్యాణం, సాయ ంకాలం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి శేషవాహన సేవలో ఊరేగింపు చేపడుతున్నట్లు ఆలయ కార్యనిర్వహణధికారి నరహరి గురురాజ తెలిపారు. మహర్నవమి సందర్భంగా రాత్రి కాళరాత్రి పూజాలను నిర్వహిస్తున్నమన్నారు.
కొనసాగుతున్న దేవి శరన్నవ ఉత్సవాలు
* దుర్గదేవి అలంకరణలో అమ్మవారు
కల్వకుర్తి, సెప్టెంబర్ 28: పట్టణ కేంద్రంలోని వాసవి కన్యకాపరమేశ్వరి అలయంలో దేవి నవరాత్రుల ఉత్సవాల సందర్బంగా కొలువుదీరిన అమ్మవారు 8వ రోజు దుర్గదేవిగా భక్తులకు దర్శనమించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ విజితారెడ్డి, స్థానిక సిఐ మల్లికార్జున్‌రెడ్డి, ఎస్సై జలందర్‌రెడ్డిలు పాల్గొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అలయ నిర్వహకులు వారిని పూలమాల శాలువాలతో సన్మానించారు. ఈకార్యక్రమంలో అలయ పౌండర్ చంద్రవౌళి, గౌరవ అధ్యక్షులు రమేష్‌బాబు, తదితరులు ఉన్నారు.

చదువుకు పేదరికం అడ్డుకాదు
సమాజంలో నాయాబ్రాహ్మణుల పాత్ర గొప్పది * ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్
మహబూబ్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 28: చదువుకోవాలన్న వారికి పేదరికం అడ్డుకాదని కష్టపడి చదివితే సాదించని ఏది లేదని స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం స్థానిక టిఎన్‌జిఓ భవన్‌లో నాయి మిత్రమండలి రాష్ట్ర కన్వినర్ అశ్వినిచంద్రశేఖర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థాయి ప్రతిభావంతులైన నాయిబ్రాహ్మణ విద్యార్థుల సన్మాన సభకు ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలకు నిజమైన ఆస్తి చదువు ఒక్కటేనని అన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రతి ఒక్కరు ప్రొత్సహించాలని నాయి బ్రాహ్మణుల విద్యావ్యాప్తికి నాయిమిత్ర మండలి చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. నాయిబ్రాహ్మణులు విద్య, వైద్య, సామాజిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందాలని ప్రభుత్వం ఆమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా పేద విద్యార్థులు పై చదువులు చదివేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.20లక్షలను అందించి వారి విదేశీ విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ రాధ ఆమర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు జనార్థన్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

పాలమూరులో కుండపోత వర్షం

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 28: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావం పాలమూరు జిల్లాపై తీవ్రంగానే చూపింది. దింతో గత రెండురోజుల నుండి జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దింతో అక్కడక్కడ చిన్న చిన్న వాగులు, వంకలు నిండి పారుతున్నాయి. అదేవిధంగా గత కొంతకాలంగా వర్షాలు లేక రైతులు తమ పంటల పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ వర్షం కొంత ఊరటను అందించింది. ఇది ఇలా ఉండగా గురువారం జిల్లాలోని జడ్చర్ల, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పాలమూరు పట్టణంలో కుండపోత వర్షం కురియడంతో రోడ్లన్ని జలమయమైయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పలు రోడ్లు వర్షపునీటితో నిండిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోకి వర్షపునీరు చేరింది. హైదరాబాద్-మహబూబ్‌నగర్ మీదుగా రాయిచూర్ వెళ్లే ప్రధాన రహదారి కలెక్టరేట్ ఎదుట జలమయంగా మారి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అదేవిధంగా పద్మావతీకాలనీ, వన్‌టౌన్ చౌరస్తా సమీపంలో కూడా ఇదే దుస్థితి నెలకొంది. పాతబస్టాండు, మార్కెట్‌యార్డు, రోడ్లలలో కూడా వర్షపునీరు నిలిచిపోయింది. అంతేకాకుండా వివిధ కాలనీలలో మట్టిరోడ్లు బురదమయంగా మారి నడవడానికి కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపిలేని ముసురువర్షంతో పాటు అప్పుడప్పుడు కురుస్తున్న భారీ వర్షంతో పాలమూరు పట్టణంలో మాత్రం రోడ్లు వర్షపునీటితో నిండి చెరువులను తలపిస్తున్నాయి. నేతాజీ సుభాష్‌చంద్రబోస్ చౌరస్తా దగ్గర రోడ్డు చెరువులా దర్శనమిస్తుంది. జిల్లాలో పలు ప్రాంతాల్లో అక్కడకక్కడ భారీ వర్షం కురిసింది.

నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపడతాం
* వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి
బాలానగర్, సెప్టెంబర్ 28: గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మంత్రి బాలానగర్ మండల కేంద్రంలో రూ.2.20లక్షల వ్యయంతో నూతన బోర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గ్రామాల ప్రజలకు శుద్దజలాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో మిషన్‌భగీరథ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఎక్కడ ఉన్న తన నిధుల నుండి బోర్లు వేయించి తాగునీటి ఎద్దడి తీరుస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసి ఆర్ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో అత్యధిక నిధులు కేటాయిస్తున్నట్లు ఆయన అన్నారు. ప్రతి గ్రామానికి బిటిరోడ్డు సౌకర్యం కల్పించిన ఘనత టి ఆర్ ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నామని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి భాగ్యమ్మ, జడ్పిటిసి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపిపి యాదగిరిగౌడ్, టిఆర్‌ఎస్ నాయకులు వెంకటాచారి, మైపాల్‌రెడ్డి, కిరణ్, చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఒక్కొక్క పువ్వేసి చందమామ...తీరొక్క పువ్వోలే చందమామ
* కన్నుల పండువగా సద్దుల బతుకమ్మ

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 28: బతుకమ్మ ఉత్సవాలు జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. బతుకమ్మ సంబరాలు వాడవాడన, విధివిధిన అత్యంత ఉత్సహంగా సాగుతున్నాయి. ఎద ఎదలో ఆనందాన్ని నింపుతున్నాయి. తీరోక్క పువ్వోలే చందమామ అంటూ ఆటపాటలతో కనువిందు చేస్తున్నాయి. ఆడబిడ్డల ఆనందం చూడచక్కని ముచ్చటగా ఉంది. ఏ విధి చూసిన బతుకమ్మ సంబరాలతో కలకలలాడుతున్నాయి. మహిళలు చిన్నపెద్ద తేడా లేకుండా ఒక్కచోటకు చేరి బతుకమ్మలను ఉంచి బతుకమ్మ ఆడుతూ కోలాటలు వేస్తూ బతుకమ్మపై పాటలు పాడుతూ సంబరాలను జరుపుకుంటున్నారు. గ్రామాల్లో బతుకమ్మ సంబరాలు చూడముచ్చటగా ఉన్నాయి. గతవారం రోజుల నుండి కొనసాగుతున్న బతుకమ్మ పండుగ చివరిదశకు చేరుకుంది. గురువారం సద్దుల బతుకమ్మను మహిళలు ఊరేగించారు. తీరోక్క పువ్వులతో అందంగా తయారు చేసిన బతుకమ్మలను మహిళలు తమ ఇళ్లల్లో నుండి పూజలు చేసి బయటకు తీసుకువచ్చి ముందుగా గౌరిదేవికి పూజలు చేశారు. మహిళలు వాయిన్యాలను ఇచ్చిపుచ్చుకున్నారు. సద్దుల బతుకమ్మ సంబురం అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బికెరెడ్డి కాలనీ శివాలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఉపాద్యక్షురాలు బి.అనితామధుసూదన్‌రెడ్డి ఆద్వర్యంలో మహిళలు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. తీరోక్క పువ్వులతో తయారు చేసిన బతుకమ్మలను శివాలయం ప్రాంగణంలో ఉంచి చుట్టూ మహిళలు బతుకమ్మ వేశారు. చిన్నారులు కొలాటలతో అందరిని ఆకట్టుకున్నారు.
బతుకమ్మ తమ బతుకులను చల్లగా చూడాలంటూ గౌరిదేవిని వేడుకున్నారు. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో సద్దులబతుకమ్మ వేడుకలు వైభవంగా కొనసాగాయి.
శివాలయంలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న అనితామధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ అని అన్నారు. ఈ పండుగను ఈ విధంగా జరుపుకోవడం తెలంగాణ రాష్ట్రం రావడమేనని అంతకుముందు ఈ పండుగ కేవలం ఇళ్లలోనే ఎదోరకంగా పూజలు చేసుకుని జరుపుకునేవారని తెలంగాణ ఉద్యమంలోనే తెలంగాణ మహిళలు బతుకమ్మ పండుగ ఔనత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పారన్నారు.

దుర్గామాతను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి
దేవరకద్ర, సెప్టెంబర్ 28: మండల పరిధిలోని పేరూర్ గ్రామంలో గురువారం సరస్వతి అలంకారంలో ఉన్న దుర్గామాతను మక్తల్ మాజి ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి దర్శించుకొని ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో పెరాలసిస్‌తో బాదపడుతున్న మాజి సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్‌ను పరామర్శించి వైద్యం కోసం రూ.5వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం హైదరబాద్‌లో వైధ్యునితో పోన్‌లో మాట్లాడారు. వీరి వెంట టిడిపి మండల అధ్యక్షుడు ఆది హన్మంతురెడ్డి కార్యకర్తలు తదితరులున్నారు.

తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ పండుగ ప్రతిబింబం
కొల్లాపూర్, సెప్టెంబర్ 28: తెలంగాణ ప్రజల ఆచారాలు, వ్యవహారాలు, జీవన విధానానికి, సంస్కృతికి ప్రతిబింబం బతుకమ్మ పండుగని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం పెంట్లవెల్లి మండల కేంద్రం సోమశీల, పట్టణంలో జరిగిన బతుకమ్మ పండుగలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమశీలలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో సోమశీల గొప్ప పర్యాటక కేంద్రంగా తయారవుతుందన్నారు. సోమశీలలో ఇప్పనటికూ కోట్ల రూపాయలను వెచ్చించి పర్యాటకుల కోసం కాటేజీల నిర్మాణం, హరిత హోటల్, సోమశీల నుండి శ్రీశైలం వరకు లాంచ్ ఏర్పాటు చేయడం జరిగిందని, వివిధ ప్రాంతాల నుండి యాత్రికులు సోమశీల శ్రీ లలిత సోమేశ్వరున్ని దర్శించుకొని బొటు శికారుకు వెళ్తున్నారన్నారు. మండలంలోని సింగోటం గ్రామంలో కూడా శ్రీవారి సముద్రంలో బొటు శికారు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. పట్టణంలో బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ప్రధాన రహదారిని, నగర పంచాయతీ విద్యుత్ ద్విపాలతో అలంకరణ చేశారు. పెద్ద ఎత్తునా బాణసంచా కాలుస్తూ పట్టణ ప్రజలు ఆకట్టుకున్నారు. కొల్లాపూర్ నియోజక వర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నిరంజన్‌రావు, జడ్పీటీసి హన్మంత్ నాయక్‌చ సింగిల్ విండో అధ్యక్షులు రఘుపతిరావు, రైతుల సంఘాల కమిటీ నాయకులు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.