మహబూబ్‌నగర్

నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, డిసెంబర్ 10: వచ్చే ఏడాది నుండి 24గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహబూబ్‌నగర్ పట్టణంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికై రూ.10కోట్ల నిధులతో విద్యుత్ ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్‌భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించి శాశ్విత తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గతంలో పట్టణంలోని పలు వార్డులలో కరెంట్ సమస్య అధికంగా ఉండేదని ఎక్కడ చూసిన కరెంట్ స్తంబాలు లేక ప్రజలు ఇబ్బందులు పడేవారని వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రతివార్డులో అవసరమైన స్తంబాలను ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలను ఆమర్చడం జరిగిందన్నారు. గతంలో విద్యుత్ స్తంబాలు ఉన్నప్పటికిని విద్యుత్ దీపాలు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర అవస్థలకు గురయ్యామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు జిల్లా అభివృద్ధికి కోట్లాది రుపాయల నిధులు మంజూరు చేస్తున్నారని అందులో భాగంగా రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ జిల్లాకు వచ్చి ఐటీకారిడార్ పార్కు పనులకు శంకుస్థాపన కూడా చేయడం జరిగిందన్నారు. ఈ ఐటీ పార్కుకు సంబంధించి భూసర్వేను కూడా ఈ వారంలో రోజుల్లో సర్వే నిర్వహించి భూములు కోల్పోయిన రైతులకు తగిన నష్టపరిహారం అందించి వారిని ఆదుకుంటామన్నారు. ఇప్పటికే జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు దాదాపు 18 కంపెనీలు సానుకూలంగా ఉన్నాయని ఈ కంపెనీల ఏర్పాటుతో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వారికి ఆర్థికంగా భరోసా కల్పిస్తామన్నారు. తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఒర్వలేని ప్రతిపక్ష పార్టీల నాయకులు కోర్టులకు వెళ్లి కేసులు వేయడం వల్ల అభివృద్ధి కుంటుబడుతుందని దాంతో ఒరిగేది ఏమిలేదని పార్టీలకు అతీయితంగా అభివృద్ధికి సహకరించాలని కోరారు. జిల్లాల విభజనతో పాలమూరు జిల్లా పూర్తిగా వెనుకబడిపోయిందని లేనిపోని ఆరోపణలు చేయడం సమంజసం కాదని జిల్లాలో ఇప్పటికే బైపాస్, మినీట్యాంక్‌బండ్, మయూరి పార్కు, ఐటీ కారిడార్, డబుల్‌బెడ్‌రూంలు, మెడికల్ కాలేజ్‌లు అందుబాటులోకి రావడంతో రాష్ట్రంలోనే మహబూబ్‌నగర్ జిల్లా మొదటిస్థానంలో ఉండేందుకు కృషి చేస్తున్నామన్నారు. అదేవిధంగా జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికి డబుల్‌బెడ్‌రూంలు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని అర్హులైన అందరికి డబుల్‌బెడ్‌రూంలు కేటాయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రాధ ఆమర్, వైస్‌చైర్మన్ రాములు, సింగిల్ విండో చైర్మన్ వెంకటయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, కౌన్సిలర్లు హాది, వనజ, జ్యోతి, నాయకులు శాంతయ్య, సుదీప్ పాల్గొన్నారు.