మహబూబ్‌నగర్

16న 16వేల ఎకరాలకు నీటి విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకద్ర, డిసెంబర్ 10: జిల్లాలో మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు కోయిల్‌సాగర్ నుంచి రబీలో 5 విడతలుగా 12వేల ఎకరాలకు డిసెంబర్ 16 నుంచి విడుదల చేస్తామని డిఐఏబి సమావేశంలో వెల్లడించారు. మరో 6రోజుల్లో నీటి విడుదల చేయనుండటంతో ఆయకట్టుదారులు పంట పొలాలను సాగు చేసేందుకు విత్తనాలను, ఎరువులను సమకూర్చుకోవడంతోపాటు, దుక్కులు దున్నుతున్నారు. కొనే్నళ్లుగా, కాలువలు మరమ్మత్తుకు నోచుకోకపోవడంతో ప్రాజెక్టు కింద ఉన్న కుడి, ఎడమ, కాల్వలకు మరమ్మత్తులు చేయాలని కలెక్టర్ ఉపాధిహామి అధికారులకు ఆదేశాలు జారీ చేసినా ఇప్పటి వరకు చేపట్టడం పూర్తి కాలేదు. చిన్నచింతకుంట, మరికల్, దన్వాడ, కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కుడికాల్వ కింద 9వేల ఎకరాల అయకట్టు ఉండగా, ఎడమ కాల్వ కింద డి40 వరకు 3,158 ఎకరాలకు, కుడికాల్వ కింద డి40 వరకు 9,7842 ఎకరాలకు మొత్తం 12వేల ఎకరాల ఆరు తడి పంటలకు నీటిని విడుదల చేసేందుకు నీటి పారుదల శాఖ అధికారులు ప్రణాళిక ఖరారు చేశారు. కాల్వలకు మరమత్తులు చేయాలని జిల్లా సాగునీటి సలహసంఘం (డీఐఏబీ) సమావేశంలో ఆయకట్టుదారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళగా గత నెల 15న కలెక్టర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలను ప్రత్యక్షంగా నీటి పారుదల శాఖ అధికారులతో కలసి కాల్వలను పరిశీలించారు. కాల్వలు అధ్వాన్నంగా ఉన్నాయని, కాల్వల్లో ఎర్పడిన ముళ్ల పొదలను పిచ్చి మొక్కలను, పూడికను, ఉపాధిహామీ పథకం కింద తోలగించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. కలెక్టర్ పర్యవేక్షించి సుమారు 26 రోజులు దాటినా అధికారులు మాత్రం ఇప్పటి వరకు కాల్వల్లో పనులను పూర్తి చేయలేకపోయారు. దీంతో రబీల్లో కూడా ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేస్తే శిథిలావస్థకు చేరిన తూములతో సాగునీరు వృథా అయ్యే అవకాశం ఉందని అయకట్టు దారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి మరమ్మత్తులు చేయాలని తరువాతే నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు.