మహబూబ్‌నగర్

మలుపు తిరుగుతున్న యాసిడ్ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, డిసెంబర్ 10: గతనెల 28న పట్టణంలో భార్యభర్తలపై యాసిడ్ దాడి ఘటన పాఠకులకు విదితమే. ఈ ఘటనపై విచారించిన పోలీసులకు దిగ్భ్రాంతికరమైన విషయాలు తెలిసాయి. ఆదివారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయం సమావేశం హాల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎఎస్పీ జోగుల చెన్నయ్య మాట్లాడుతూ ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలిపారు. నాగర్‌కర్నూల్ పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్న సుధాకర్‌రెడ్డి, స్వాతి దంపతులపై గత నెల 27 మధ్యాహ్నం గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు ముసుగులు ధరించి ఇంటిలోకి చొరబడి )సుధాకర్‌రెడ్డిని కట్టేసి పెట్రోల్ పోసి మొహం కాల్చి చంపడానికి ప్రయత్నించారని, గాయాలకు గురైన సుధాకర్‌రెడ్డిని హైదరాబాద్‌లోని డిఆర్‌డివో ఆపొలో ఆస్పత్రికి తీసుకొని వచ్చినట్లు ఆయన భార్య స్వాతి చెప్పినట్లు సుధాకర్‌రెడ్డి అన్న సురేందర్‌రెడ్డి గత నెల 28న ఫిర్యాదు చేసినట్లు ఎఎస్పీ జోగుల చెన్నయ్య తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిపై శనివారం సుధాకర్‌రెడ్డి అన్న, తల్లి పరిశీలించగా తమ్ముడుకాదనే అనుమానాలు రావడంతో నాగర్‌కర్నూల్ పోలీసుల దృష్టికి తీసుకొని రాగా, కొల్లాపూర్ సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి వెళ్లి పరిశోధించగా చికిత్స పొందుతున్న వ్యక్తి అజ్జకోలు రాజేష్‌గా నిర్ధారించినట్లు తెలిపారు. దీనితో సుధాకర్‌రెడ్డి భార్యను శనివారం సాయంత్రమే అదుపులోకి తీసుకొని విచారించగా పలు ఆసక్తికరమైన విషయాలు తెలిసినట్లు తెలిపారు. సుధాకర్‌రెడ్డి భార్య స్వాతితో, నాగర్‌కర్నూల్‌లో ఫిజియోథిరిస్టుగా పని చేస్తున్న అజ్జకోలు రాజేష్‌తో పరిచయం ఏర్పాడి అక్రమ సంబంధంకు దారితీసింది. గత రెండేళ్ల నుంచి వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతున్న నేపథ్యంలో అడ్డుగా ఉన్న సుధాకర్‌రెడ్డిని హతమార్చాలని నిర్ణయించుకొని ఓ పథకం ప్రకారం గతనెల 26న సుధాకర్‌రెడ్డి మంచంపైనుంచి కిందపడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. హతమార్చేందుకు ఇదే సరైన సమయమని భావించి గత నెల 27న తెల్లవారుజామున ప్రియుడు రాజేష్‌ను ఇంటికి రప్పించి నిద్రలో ఉన్న భర్తకు మెడలోకి మత్తు ఇంజక్షన్ ఇవ్వగా, రాజేష్ ఇనుపరాడ్‌తో తలపై కొట్టి చంపేసి, శవాన్ని కారులో మహబూబ్‌నగర్ జిల్లా ఫతేపూర్ మైసమ్మ అడవిలోకి తీసుకొని వెళ్లి పెట్రోల్ పోసి కాల్చినట్లు ఎఎస్పీ తెలిపారు. అక్కడి నుంచి తిరిగి నాగర్‌కర్నూల్‌కు వచ్చిన వారు ఒక పథకం ప్రకారం భర్త స్థానంలో ప్రియుడైన రాజేష్‌కు ప్లాస్టిక్ సర్జరీ చేయించి ఉంచాలనే ఉద్దేశ్యంతో రాజేష్‌ముఖంగాపై పెట్రోలు పోసుకొని అంటించుకోగా, మోహం కాలగా, వెంటనే సుధాకర్‌రెడ్డి బంధువులకు సమాచారం అందించి ఆస్పత్రిలో సుధాకర్‌రెడ్డిపేరుమీద చేర్చి అందరిని నమ్మించిందని తెలిపారు. ఫతేపూర్ అడవులలో కాల్చిన శవాన్ని స్వాదీనం చేసుకొని అక్కడే పోస్టుమార్టం నిర్వహించి పరిశీలన నిమిత్తం శవంలోని వివిధ భాగాలను ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. ఈ కేసులో స్వాతిని అరెస్టు చేసి రిమాండుకు పంపుతున్నామని, మరో నిందితుడిని విచారిస్తేగాని వాస్తవ పరిస్థితులు తేలవన్నారు. ఎస్పీ కల్మేశ్వర్ సింగెనవర్ పర్యవేక్షణలో నాగర్‌కర్నూల్ డిఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కొల్లాపూర్ సిఐ పి.శ్రీనివాసరావు విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.