మహబూబ్‌నగర్

రేవంత్‌రెడ్డి మైనార్టిలకు వ్యతిరేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోస్గి, జనవరి 2: రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కొడంగల్ ప్రజలకుగానీ ఈ ప్రాంత మైనార్టిలకు గానీ ఒరగబెట్టింది ఏమీ లేదని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ ఇసాక్ విమర్శించారు. మైనార్టీలను రేవంత్ పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. మంగళవారం కోస్గిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయిస్తుందని అన్నారు. ఇందులో భాగంగానే నేడు కొడంగల్‌కు ఉప ముఖ్యమంత్రి మహముద్‌అలీ, మంత్రులు మహేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డిలు వస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలోని 52 మసీదులలో పనిచేస్తున్న 104 మంది ఇమామ్‌వౌజంలకు వేతనాల రూపంలో చెక్కుల పంపిణీ కార్యక్రమానికి రానున్నట్లు తెలిపారు. అదేవిధంగా త్వరలో కోస్గి, కొడంగల్‌కు షాదీఖానాలు మంజూరు చేయబోతున్నామన్నారు. రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని తన వెంట ఉన్న సెక్యూరిటీని ప్రభుత్వానికి సరెండర్ చేయడం కాదని రాజీనామాను అమోదింపజేసుకుని చిత్తశుద్ధి చూపాలన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దోమ రాజేశ్వర్, జడ్పీటీసీ అనిత, మైనార్టి నాయకులు అసిఫ్, ఎంపీటీసీ రాజేష్‌తో పాటు తదితరులు ఉన్నారు.