మహబూబ్‌నగర్

ప్రభుత్వానికి పతనం తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దండ, జనవరి 2: తెగించి తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రజా సమస్యలను విస్మరించి పాలన కోనసాగిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి పతనం తప్పదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తల్లోజి ఆచారి అన్నారు. మంగళవారం వెల్దండ మండలం రాఘయిపల్లి గ్రామంలో ఆచారి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన 50 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షుడు జూలురి బాలస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆచారి మాట్లాడుతూ తెంగాణవాదంతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ప్రజాకంటక పాలనను కొరసాగిస్తున్నరన్నారు. బంగారు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం బంగారంగా మారేంద తప్ప మరోకటి ఏమి లేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎంత మాత్రం ఇవ్వడం లేదని ఆచారి అరోపించారు. రాష్ట్రంలో అమలుపరుస్తున్న ప్రతి పథకంలోనూ కేంద్ర ప్రభుత్వ నిధులు తప్పనిసరిగా ఉంటాయని, కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం కమీషన్‌లు వచ్చే, బంధుగణం లాభపడే పథకాలను వినియోగిస్తూ ప్రజాసంక్షేమన్ని పూర్తిగా విస్మరించిందని అన్నారు. ప్రభుత్వ అవలంబిస్తున్న విధానాలు ప్రజలకు గొడ్డలిపెట్టుగా మారాయని చెప్పారు. ప్రాజెక్టులు, కాల్వల నిర్మాణల పేరుతో లక్షాల కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారని విమర్శించారు.
బండోనిపల్లిలో స్వచ్ఛ్భారత్
వెల్దండ మండలంలోని బండోనిపల్లి గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా బీజేపీ రాష్ట్ర నేత ఆచారితో పాటు పార్టీ కార్యకర్తలు, ప్రజలు పలుగు, పార, పొరకట్ట చేతబట్టి దళిత వాడల్లో ముళ్ల చెట్లను తొలగించి, మురికి కాల్వలను శుభ్ర పరిచి, చెత్త చెదారాన్ని తొలగించారు. కార్యక్రమంలో కేంద్ర ఆహార సలహా సంస్థ డైరెక్టర్ సామా తిరుమల్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సామా మల్లారెడ్డి, ఎంపీటీసీ జంగయ్యయాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు, ఆచారి మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు పరమేష్‌గౌడ్, నాయకులు జనార్ధన్ , శ్రీనివాస్‌రెడ్డి, బాలయ్య, తంబాలుయాదవ్, అంజి, అంజన్‌కుమార్, మల్లయ్య, పర్వతాలు, కృష్ణచారి, మల్లేష్, భూపాల్‌రెడ్డి, లక్ష్మయ్య, సాయిరెడ్డి, రాములు, యాదయ్యగౌడ్, పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు.