మహబూబ్‌నగర్

సాంకేతిక పరిజ్ఞానంతో నేర రహిత జిల్లాకు బాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, జనవరి 2: సాంకేతిక పరిజ్ఞానంతో జోగుళాంబ గద్వాల జిల్లాను నేరరహిత జిల్లాగా మార్చేందుకు బాటలు వేస్తున్నామని, 2017 సంవత్సరంలో ఎఫ్‌ఐఆర్‌లు పెరిగినా కొత్త నేరాలు పెరుగలేదని, నేరాలు అదుపులో ఉన్నాయని, కొత్త సంవత్సరంలో ప్రజలకు మరింత పకడ్బందీగా పోలీసు సేవలు అందిస్తామని, ఏ సమస్య వచ్చినా పోలీసుల దృష్టికి తీసుకరావాలని, సాధ్యమైనంత వరకు వాటికి పరిష్కరించి, ప్రజలు శాంతియుతంగా జీవించేందుకు పాటు పడుతామని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 2017 సంవత్సరంలో పోలీస్ శాఖ చేసిన ప్రగతి, 2018లో చేసే పనులను జిల్లా ఎస్పీ వివరించారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో జనవరి 26, ఆగస్టు 15, జూన్ 2 వంటి ప్రతిష్టాత్మక దినోత్సవాలతో పాటు మల్దకల్, గద్వాల, పాగుంట జాతరలు, జమ్ములమ్మా, జోగుళాంబ దేవి బ్రహ్మోత్సవాలను జిల్లా పోలీసు యంత్రాంగం విజయవంతం చేసిందని కొనియాడారు. జిల్లాలో ప్రశాంత వాతావరణం కల్పించడమే ధ్యేయంగా పోలీసులు పనిచేస్తున్నారని గుర్తు చేశారు. 2017లో 3090 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయినప్పటికి, శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లా పోలీసులు పకడ్బందీగా పని చేశారన్నారు. ముఖ్యంగా ఇసుక, మైనింగ్, బియ్యం, గొర్రెల దొంగతనం, వాహానాల దొంగతనాల నివారణకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి విజయం సాధించమన్నారు. హత్యలు, ఇండ్లలో దొంగతనాలపై జిల్లా పోలీసు యంత్రాంగం ఉక్కు పాధం మోపిందని, గతంలో జరిగిన వాటితో పోలీస్తే ఈ యేడాది 75శాతం తగ్గాయన్నారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలాను నివారించేందుకు ప్రత్యేక తనిఖీలు, డ్రంకన్‌డ్రైవ్, హెల్మెట్‌ల వాడకం వంటిపై ప్రజలు చైతన్యం తీసుకవచ్చి వాటిని నివారిస్తున్నామన్నారు. కల్తికల్లు, బెల్టు షాపులు, సైబర్ క్రైంలపై కూడా జిల్లా పోలీసులు దృష్టిసారించారని గుర్తు చేశారు. జిల్లాలో నకిలిపాసుపుస్తకాలు, క్రికెట్ బెట్టింగ్, అధిక వడ్డి వ్యాపారులపై ప్రత్యేక దృష్టిసారించి దోషులను శిక్షించడం జరిగిందన్నారు. మహిళల వేధింపులు, రేపులు, కిడ్నాపుల వంటి కేసుల విషయంలో కూడా ప్రత్యేక దృష్టిశారించి షీంటీంల ద్వారా 68 మందికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. రు. జిల్లాలో నూతన పోలీస్ స్టేషన్ల నిర్మాణం, రిప్షెన్‌ల ఏర్పాటు చురుకుగా సాగుతున్నాయని, పీజేపీ కార్యాలయంలో 21 ఎకరాలు జిల్లా పోలీస్‌శాఖ కార్యాలయం నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయన్నారు. జిల్లాలో ప్రజల సంపూర్ణ సహకారంతో ఎలాంటి నేరాలు జరుగకుండా శాంతియుతంగా ప్రజలు సుఖంగా ఉండేందుకు జిల్లా పోలీసులు అహర్నిషలు శ్రమిస్తారని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాలోని చట్టాలు వాటి అమలు, పోలీసులు, విధులు నేరాల వంటి వాటిపై అవగాహాన కల్పించేందుకు స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులను తయారు చేసి నేరాలు అదుపులోకి తీసుకరావడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. మార్గదర్శి, తెలంగాణకు హరితహారం, బాలకార్మికులు నిర్మూలన, ఆహార పదార్థాల కల్తీ, అక్రమ దందలు, వ్యాపారాలు, కల్తీ విత్తనాలపై గద్వాల పోలీసులు తమదైన శైలీలో దాడులు చేసి వాటిని అరికట్టేందుకు కృషి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపుఎస్పీ ఆర్.్భస్కర్, సీసీ హనీప్, పీఆర్వో సురేష్, తదితరులు ఉన్నారు.