మహబూబ్‌నగర్

టీఆర్‌ఎస్‌కు షాక్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 2: జిల్లాలో టీఆర్‌ఎస్‌కు తొలిషాక్ తగిలింది. గతకొంతకాలంగా టీఆర్‌ఎస్‌లో అంటిముట్టనట్లుగా ఉన్నా హన్వాడ జడ్పీటీసీ సభ్యురాలు నారాయణమ్మతో పాటు ఆమె తనయుడు సురేందర్‌రెడ్డిలు ఎట్టకేలకు టీఆర్‌ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత నెలరోజుల క్రితమే ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సమక్షంలోనే కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీతో నేరుగా ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని భావించిన సురేందర్‌రెడ్డికి ఢిల్లీకి వెళ్లాక కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో చేరడం కుదరలేదు. అయితే మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో హన్వాడ జడ్పీటీసీ సభ్యురాలు నారాయణమ్మ, ఆమె తనయుడు సురేందర్‌రెడ్డిలు వందలాది మందితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా నుండి దాదాపు 200లకుపైగా వాహనాల్లో భారీగా సురేందర్‌రెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు గాంధీభవన్‌కు బయలుదేరారు. హన్వాడ మండలం నుండి దాదాపు 50వాహనాలకు పైగా బయలుదేరాయి. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు సురేందర్‌రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, సురేందర్‌రెడ్డిల మధ్య నెలకొన్న విభేదాలే పార్టీని విడడం జరుగుతుందని సురేందర్‌రెడ్డి వర్గీయులు బహిరంగంగానే చెప్పారు. హన్వాడ మండలంలో సురేందర్‌రెడ్డి వర్గీయులంతా టీఆర్‌ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. కాగా సురేందర్‌రెడ్డి ముందుగా మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జిగా పనిచేశారు. అంతకుముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అక్కడి నుండి వైసీపీకి వెళ్లి నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టి నియోజకవర్గంలో తనకంటూ ఓ క్యాడర్‌ను ఏర్పాటు చేసుకుని అభిమానులను సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో 2014 స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అప్పట్లో హన్వాడ జడ్పీటీసీగా తన తల్లి నారాయణమ్మకు టీక్కెట్ ఇప్పించుకుని దాదాపు 2500లకుపైగా మెజార్టీతో హన్వాడ జడ్పీటీసీ సభ్యురాలిగా నారాయణమ్మ విజయం సాధించింది. తీరా ఎమ్మెల్యే ఎన్నికల అనంతరం సురేందర్‌రెడ్డి హన్వాడ, మహబూబ్‌నగర్ పట్టణం, మహబూబ్‌నగర్ రూరల్‌లో తన వర్గీయులతో ప్రత్యేకంగా రాజకీయ పావులు కదిపారు. దీంతో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అనుచరులకు, సురేందర్‌రెడ్డి వర్గీయుల మధ్య ఓ సందర్భంలో గొడవ చోటుచేసుకుంది. అప్పటినుండి సురేందర్‌రెడ్డి వర్గీయుల మధ్య ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు ఏర్పడ్డాయి. అప్పటినుండి పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో కూడా సురేందర్‌రెడ్డితో పాటు ఆయన తల్లి జడ్పీటీసీ నారాయణమ్మలు పాల్గొనకుండా అంటిముట్టనట్లు ఉంటూ అప్పుడప్పుడు పాల్గొనేవారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా రేవంత్‌రెడ్డితో మంతనాలు జరిపిన అనంతరం సురేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయించుకుని మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సి కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో జడ్పీటీసీ నారాయణమ్మ, ఆమె కుమారుడు సురేందర్‌రెడ్డితో పాటు వందలాది మంది వర్గీయులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయ వేడి రగులుకుంది.

24 గంటల విద్యుత్ మా ఘనతే..
* ఒక్క హామీనీ అమలుచేయని కేసీఆర్ * రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీవే * ఎమ్మెల్యే డీకే అరుణ
గద్వాల, జనవరి 2: రాష్ట్ర ప్రభుత్వం మాటల గారడీతో పాలన సాగిస్తోందని, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ గత కాంగ్రెస్ ప్రభుత్వ ఘనతేనని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కాళికాదేవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కరాటే సత్యం, కమ్మరి రాము, ఎంకే ప్రవీణ్, రవి ఆచారి, పెద్ద జమ్మన్న, నరేందరాచారి, భీమయ్య, రాజులతో పాటు వివిధ పార్టీలకు చెందిన 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు పర్చలేదని ఆరోపించారు. దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాలు, నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత, ఉద్యోగాల భర్తీ, రైతు రుణమాఫీ, గిట్టుబాటు ధర వంటి ఎన్నో హామీలను తుంగలో తొక్కారన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం రైతును రాజును చేయాలనే ఉద్దేశంతో భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను మంజూరు చేసి పూర్తి చేసిందన్నారు. మూడున్నర ఏళ్లలో ఏ ఒక్క విద్యుత్ ప్రాజెక్టును కూడా నిర్మించకుండా గత ప్రభుత్వాలు చేసిన ప్రాజెక్టులతో విద్యుత్ సరఫరా చేసి తామే చేశామని గొప్పలు చెబుకుంటూ ప్రజలను దగా చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు ఎండగట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేయాలని అన్నారు. కరాటే సత్యంకు పార్టీలో సరైన ప్రాధాన్యత ఉంటుందని, ఆయన సేవలను వినియోగించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కృష్ణవేణి, వైస్ చైర్మన్ శంకర్, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, రామాంజనేయులు, కుమ్మరి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

ఆధిపత్యశక్తులకు వ్యతిరేకంగా ఉద్యమించాలి
* ప్రొఫెసర్ హరగోపాల్
మహబూబ్‌నగర్‌టౌన్, జనవరి 2: సమాజంలో జరుగుతున్న అధిపత్య శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక టీఎన్‌జిఓ భవన్‌లో విప్లవ రచయితల సంఘం 26వ రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆయన విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ఈ నెల 13,14,15 తేదీల్లో విప్లవ రచయితల రాష్ట్ర మహాసభలు జిల్లా కేంద్రంలోని క్రౌన్‌గార్డెన్ ఫంక్షన్‌హల్‌లో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. భారత రాజ్యాంగంతో పాటు ప్రజాస్వామ్య ప్రభుత్వం గిట్టని బ్రాహ్మణీయ హిందూ పాసిజనాన్ని ఒడించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ప్రజాస్వామ్యవాధులు మతోన్మదులు ప్రజాస్వామ్యాన్ని నిర్విర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయన్నారు. ప్రజాస్వామ్య విలువలతో మానవీయ సమాజం ఆవిర్భావించేందుకు విప్లవ రచయితల సంఘం నిరంతరం కృషి చేస్తుందన్నారు. కులమత సంస్కృతిని ఆసరా చేసుకుని ఉద్రిక్తతలకు రెచ్చగొట్టే బ్రాహ్మణీయ ఆదిపత్యశక్తులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని కోరారు. సాహిత్యం, కళలు, ప్రజాజీవితాన్ని ఉన్నతీకరించేందుకు గత 40 ఏళ్లుగా విరసం కృషి చేస్తుందన్నారు. ఈ మహాసభలకు ప్రొఫెసర్లు విరసం కార్యదర్శి వరలక్ష్మీ, పాని, బాసిద్, కృష్ణ, ప్రభాకర్, శివరాత్రి సుధాకర్, భాస్కర్, కాశీం, వరవరరావు, కళ్యాణరావు తదితరులు పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో పాలమూరు అధ్యాయన వేదిక కన్వినర్ రాఘవచారి, ఉపాధ్యక్షులు రాజేంద్రబాబు, జలజలం సత్యనారాయణ, టీజేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, యాదగిరి, వామన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.