మహబూబ్‌నగర్

పరిశుభ్రతకు యువత నడుంబిగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాలటౌన్, జనవరి 20: మన ఇంటిని మనం శుభ్రం చేసుకొని పరిసరాల పరిశుభ్రంగా ఉండే విధంగా అందరు బాధ్యత తీసుకోవాలని, ఇది కేవలం మాటలకే కాకుండా విద్యార్థులు, మహిళలు, నడుంబిగించి స్వచ్ఛ గద్వాలగా మార్చుకోవాలని కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ పిలుపునిచ్చారు. గద్వాల మున్సిపల్ చైర్మన్ కృష్ణవేణి అధ్యక్షతన గద్వాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మెగా స్వచ్ఛ భారత్, స్వచ్ఛ గద్వాల కార్యక్రమానికి కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ, ఎస్పీ విజయ్‌కుమార్, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ మఖ్యఅతిథిలుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ విద్యార్థులు, యువత, మహిళలు మార్పు కోసం నడుం బిగించాలన్నారు. కేవలం వీరి ద్వారానే పట్టణాలు పరిశుభ్ర పట్టణాలను మార్చగలమని ఆమె తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఆయా మున్సిపల్ వార్డుల్లో ప్రజలను చైతన్యం చేసి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకపోవాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ సైనీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో చెత్తను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డస్ట్‌బిన్‌లో వేయాలని సూచించారు. అభివృద్ధి చెందిన దేశాలలో పరిశుభ్రత పాటించడంలో నంబర్ వన్ ఉంటుందని, దేశంలో సామాజిక పరిసర ప్రాంతాలో ఉన్న శుభ్రత గురించి ఎవరూ పట్టించుకోవడంలేదని, మనలో మార్పు వచ్చేంత వరకు మున్సిపాలిటి సిబ్బంది, మరి ఇతర ఏజెన్సీలు ఎంతా చేసిన వృథాయే అవుతుందన్నారు. ప్రజలంతా స్వచ్ఛంగా ముందుకు వచ్చి ఇలాంటి పనులో శ్రమిస్తే కాని పరిశుభ్ర నగరాలుగా మార్చుకోలేమని ఆయన అన్నారు. స్వచ్ఛ భారత్ కింద ఆయా వార్డులలో కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు పర్యటించి చెత్త సేకరణ, పరిశుభ్రత పనులు ప్రారంభించారు. దాదాపు 700 మంది పారిశుద్ధ్య కార్మికులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు మెగా స్వచ్ఛ భారత్‌ను విజయవంతం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అనంతారెడ్డి, డీఎస్పీ సురేందర్‌రావు, సీఐ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ సభ్యులు, కళాశాల, పాఠశాల విద్యార్థులు, వర్తక వ్యాపార సంఘాలు, మున్సిపల్ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

ఆధునిక వ్యవసాయంలో తెలంగాణ ముందంజ
* కేంద్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఎస్‌కె మల్హోత్ర

పెబ్బేరు, జనవరి 20: ఆధునిక వ్యవసాయ విధానంలో తెలంగాణ ఆదర్శంగా మారిందని కేంద్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఎస్‌కె మల్హోత్ర అన్నారు. శనివారం పెబ్బేరు మండల కేంద్రంలోని నర్సింహారెడ్డి వ్యవసాయ పొలంలో ఐసిజివి 03041 అనే కొత్త వేరుశనగ రకం విత్తనాన్ని కేవికె కృషి విజ్ఞాన కేంద్రం వారు చేపట్టిన పరిశోధన క్షేత్రాన్ని ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వ్యవసాయ విధానంలో పంజాబ్, హరియాణా రాష్ట్రాలు ముందుండేవని, తెలంగాణ ఇప్పుడు నంబర్‌వన్ స్థానానికి చేరుకుందన్నారు. ఎక్కువ పంట, తక్కువ నీరు, బిందు సేద్యం, లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టంతో రైతులు సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం చేస్తుండటాన్ని ఆయన అనినందించారు. సాగు చేసే ముందు భూసార పరీక్షలు, శాస్తవ్రేత్తల సలహాలు క్రమం తప్పకుండ పాటించాలని ఆయన సూచించారు. మొదటి సారిగా నిజామాబాద్ జిల్లా పసుపుపంటలకు దేశంలోనే ప్రత్యేక స్థానం ఉందని, ప్లాంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయించిందన్నారు. గత యేడాది 16వేల మిలియన్ టన్నుల దాన్యం ఉండేదని, ఈ యేడాది 23 మిలియన్ టన్నులకు చేరిందని ఆయన ప్రసంశించారు. రైతులకు కేంద్రం ప్రైజ్‌స్టెబిలైజేషన్ ఫండ్ ఏర్పాటు చేస్తుందన్నారు. వ్యవసాయం కోసం విత్తనాలను నిలువ ఉంచి అమ్మే స్థాయికి ఎదగాలని ఆయన సూచించారు. మల్హోత్రాకు మార్కెట్ యార్డు చైర్మెన్ గౌని బుచ్చారెడ్డి, సర్పంచ్ అక్కిసుశీల, జ్ఞాపికను అందజేసి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇక్రిశాట్ ప్రిన్సిపల్ జెలీల, శాస్తవ్రేత్త జారోమ్, వెంకటరమణ, నాగేశ్, జిల్లా వ్యవసాయ అధికారి సుజాత, కేవికె శాస్తవ్రేత్తలు పాల్గొన్నారు.