మహబూబ్‌నగర్

కాంగ్రెస్‌కు పూర్వవైభవం వచ్చితీరుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 20: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చితీరుతుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని చిన్నదర్పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు వందలాది మంది కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్, ఎమ్మెల్యే సంపత్‌కుమార్, కాంగ్రెస్ నాయకుడు సురేందర్‌రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ మట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి 2014 ఎన్నికల్లో ఎందుకు ఓట్లు వేయకపోతిమనే భాద ప్రజల్లో ఉందని కేసీఆర్‌కు అనవసరంగా అధికారం కట్టబెట్టామనే బాధను ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు. టీఆర్‌ఎస్ పాలన గాడితప్పిందని ఉద్యమ పేరుతో యువకులను మోసం చేసి ఎన్నికల సమయంలో ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ నాయకులు నిరుద్యోగులను నట్టేటా ముంచారని విమర్శించారు. గ్రామీణ పరిపాలన వ్యవస్థను పూర్తి నాశరం చేసిన ఘనుడు కేసీఆర్ అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ప్రాజెక్టులు దాదాపు 80 శాతం పూర్తి చేశారని వాటిని తామే పూర్తి చేసి సాగునీరు అందిస్తున్నామని తప్పుడు ప్రచారం చేసుకుంటున్న టీఆర్‌ఎస్ మంత్రులను ఎక్కడిక్కడ ప్రజలు నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లాలో టీఆర్‌ఎస్ నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోయావని వారి పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని అన్నారు. ఉమ్మడి మహబూబ్‌గనర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలను తప్పకుండా రాబోయే ఎన్నికల్లో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో దాదాపు పది నుండి పనె్నండు స్థానాలను గెలవడం ఖాయమని అన్నారు. ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీ పడవ మునిగిపోవడం ఖాయమని అన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచిందని కాంగ్రెస్ దూకుడుకు టీఆర్‌ఎస్ పార్టీ కకావికలం కాక తప్పదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంజీవ్ ముదిరాజ్, లక్ష్మణ్‌యాదవ్, వినోద్‌కుమార్, బెక్కరి మదుసూధన్‌రెడ్డి, బ్రహ్మయ్య, కరుణాకర్‌గౌడ్, బెనహర్, అనంతరెడ్డి, కృష్ణయ్య, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.