మహబూబ్‌నగర్

ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, జనవరి 20: తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ గార్డెన్‌లో న్యాయవాదుల బార్ అసోసియేషన్ కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, చిన్నారెడ్డి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సాధనలో న్యాయవాదుల పోరాటం మరవలేనిదన్నారు. ఉద్యమ సమయంలో ఎంతోమందిపై కేసులు నమోదు అయితే వారికి అండగా న్యాయవాదులు నిలిచి బెయిల్ ఇప్పించడం పట్ల ఆయన న్యాయవాదులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఎదగాలనే ఆకాంక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగిందన్నారు. నిరుపేదలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేయడం జరిగిందని అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని ప్రైవేటు ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్యానికి దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. ముఖ్యంగా గర్భిణీలకు కేసీఆర్ కిట్ పథకం ద్వారా ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. అందువల్ల చాలామంది గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారన్నారు. ఆడపిల్ల పుడితే రూ.13వేలును జమచేయడం జరుగుతుందని మగపిల్లవాడు పుడితే రూ.10వేలను వారి అకౌంట్లలలో జమచేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. బంగారు తెలంగాణలో ప్రజలందరు భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో మరిన్ని పథకాలను తీసుకురావడం జరుగుతుందని ముఖ్యంగా న్యాయవ్యవస్థలో పనిచేస్తున్న న్యాయవాదులకు హెల్త్‌కార్డులు ఇచ్చేందుకు కృషి చేస్తానని ఆయన న్యాయవాదులకు హామీ ఇచ్చారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఉద్యోగులకు, జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు ఇచ్చిన పాపాన పోలేదని తాము అధికారంలోకి వచ్చాక ఉద్యోగులు, జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో హెల్త్‌కార్డులను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనంతరెడ్డి, జనరల్ సెక్రెటరీ గడ్డం గోపాల్, న్యాయవాదులు అరుణకుమారి, ఉమామహేశ్వరి, రాధ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాను ఆకుపచ్చగా మార్చేందుకు కృషి చేయాలి
* హరితహారం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్
వనపర్తి, జనవరి 20: జిల్లాను ఆకుపచ్చ వనపర్తిగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని హరితహారం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్ అన్నారు. శనివారం జిల్లాలోని కొత్తకోట, పెబ్బేరు, వనపర్తి మండలాల్లో నర్సరీలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తెలంగాణలో హరితహారం కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలన్నారు. నర్సరీలో మొక్కలు తక్కువగా ఉన్నాయని, హరితహారం కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వనపర్తి దగ్గర ఉన్న ఎకో పార్కును భవిష్యత్తులో అభివృద్ధి చెందుతుందని, ఎకో పార్కు జిల్లాకు తగ్గట్టుగా తీర్చిదిద్దేంకు చర్యలు తీసుకుంటామన్నారు. వనపర్తి పట్టణానికి దగ్గరలో ఉన్న 311 హెక్టార్ల విస్తీర్ణంలో అడవి కలిగి ఉండటం జిల్లాకు వరమన్నారు. జిల్లాలో అటవీ శాతం తక్కువగా ఉందని, నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినధిలు అందరు భాగస్వామ్యులైతేనే హరితహారం విజయవంతం అవుతుందన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారి వెంట నాటిన మొక్కలు చిన్నవిగా ఉన్నాయని, వాటిని మార్చి పొడవైన మొక్కలు నాటాలన్నారు. ఇంతవరకు ఎన్‌హెచ్‌లో నర్సరీ నుండి 5 లక్షలు మొక్కలు జిల్లాకు ఇస్తున్నామని, అలాగే మరో 5 లక్షల మొక్కలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఫిబ్రవరి 20 నాటికి ప్రస్తుతం ఉన్న మొక్కల స్థానంలో వాటిని నాటాలని అటవీ శాఖ అధికారులకు ఆదేశించారు. 2018 సంవత్సరం కార్యాచరణ ప్రణాళికతో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మొక్కలు నాటి పచ్చదనం పెంచాలన్నారు. అలాగే అన్ని సుపత్రులు, ప్రభుత్వ సంస్థల్లో మొక్కలు నాటాలని ఆమె అన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి అధికారి 4వేల మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. వేసవిలో మొక్కలను బతికించుకోవాలని ప్రతి శాఖ ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించుకోవాలని ఆదేశించారు. ఫిబ్రవరి 15లోగా అటవీ, డీఆర్‌డీఓ నర్సరీలతో బ్యాగుల్లో మొక్కలు నింపడం, పెట్టడం పూర్తి చేయాలన్నారు. ఉద్యాన శాఖ ద్వారా పండ్ల మొక్కలు, నర్సరీలను పెంచాలని, పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో 200 హెక్టార్ల భూమిని గుర్తించి సుబబుల్‌ను పెంచాలని ఆదేశించారు. అధికారులు, ప్రజలు ప్రజాప్రతినిధులు కలిసి కార్యక్రమాన్ని అమలు చేస్తేనే భావితరాలకు మంచిచేసిన వారవౌతామన్నారు. అనంతరం కలెక్టర్ శే్వతా మహంతి మాట్లాడుతూ జిల్లాలో హరితహారం అమలును వివరిస్తూ 2017 సంవత్సరంలో 80 లక్షల మొక్కలు లక్ష్యానికి గాను 61.63 శాతం సాధించామని తెలిపారు. 13 పంచాయతీల్లో 40వేల మొక్కలు నాటి వంద శాతం లక్ష్యాన్ని సాధించామన్నారు. 68 శాతం మొక్కలు బతికాయన్నారు. 2018 సంవత్సరంలో 81.3 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. జిల్లాలో పండ్ల మొక్కలు ఎర్రచెందనం మొక్కలు ఉన్నాయని తెలుపగా వాటికి ముందుగా ప్రతిపాదనలు పంపాలని ఓఎస్‌డి కోరారు. ఈ సమావేశంలో జేసీ నిరంజ్, డీఆర్‌ఓ చంద్రయ్య, డీఎఫ్‌ఓ ప్రకాశ్, డీఆర్‌డీఓ గణేశ్ పాల్గొన్నారు.