మహబూబ్‌నగర్

కోయిల్‌సాగర్ నీటిని విడుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధన్వాడ, జనవరి 22: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ద్వారా 16వ డిస్టిబ్యూటర్ నుండి పొలాలకు సాగునీరును విడుదల చేయాలంటూ రైతులు సోమవారం మరికల్ మండలంలోని తీలేర్ గ్రామంలోని కోయిల్‌సాగర్ కల్వలను పరిశీలించడానికి వచ్చిన కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ఈఈ భూపాల్‌రెడ్డి, ఏఈ హమీద్‌లను రైతులు నిలదీశారు. 16వ డిస్టిబ్యూటర్ నుండి తీలేర్, మరికల్ తదితర గ్రామాలకు సాగునీరును ఎందుకు వదలడం లేదని బీసీ కులాల ఐక్యవేదిక సంఘం జిల్లా అధ్యక్షుడు కె.రాజు, వివిధ గ్రామాలకు చెందిన రైతులు తిమ్మరెడ్డి, రాములు తదితరులు అధికారులను ప్రశ్నించారు. ఒకపక్క వరి పంటలకు సాగునీరులేక ఎండిపోతున్నా ఎందుకు పట్టించుకోవడంలేదని అధికారులను నిలదీశారు. పంటలకు సాగునీరు విడుదల చేయాలని లేనిపక్షంలో రైతుల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. అవసరమైతే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ఈవిషయంపై కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ఈఈ భూపాల్‌రెడ్డి, ఏఈ హమీద్‌లు మాట్లాడుతూ కాల్వల మరమ్మతుల పనులు ఉన్నందున 16వ డిస్టిబ్యూటర్‌కు సాగునీరు విడుల చేయాలేకపోతున్నమని రైతులకు వివరించారు. 10రోజులలోపు కాల్వ పనులు పూర్తిచేస్తామన్నారు.

పార్టీ మారే ప్రసక్తేలేదు
- రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం - మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి
కొత్తకోట, జనవరి 22: టీడీపీని వీడే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి అన్నారు. సోమవారం అమడబాకుల గ్రామంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాగం జనార్ధన్ రెడ్డితో పాటు దంపతులు సీతమ్మ, దయాకర్ రెడ్డిలు పార్టీని వీడుతారన్న ఊహాగానాలపై ఆయన మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తామని, పార్టీకోసం పనిచేసుకుంటూ పోతామని స్పష్టం చేశారు. చంద్రబాబు ఆలోచన మేరకు నడుచుకుంటూ రమణపై సంపూర్ణ నమ్మకం ఉందని, రమణ ఆదేశాలతో కార్యకర్తలు, నాయకులు నడుచుకుంటున్నారన్నారు. మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల్లో కార్యకర్తల అభిప్రాయాల మేరకు మరేలా ఉంటుందో అధినేతకు వివరిస్తామన్నారు. తమకు చంద్రబాబు మాట శిరోధారమన్నారు. సమావేశంలో నాయకులు భరత్ భూషన్, కిషన్ నాయక్, మధుసూదన్ రెడ్డి, భీముడు పాల్గొన్నారు.