మహబూబ్‌నగర్

హాకా కొనుగోలు కేంద్రానికి భారీగా కందులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణపేటటౌన్, జనవరి 22: ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరను కల్పించేందుకు నిర్ణయించి రైతులు పండించిన కంది పంటను కొనుగోలు చేసేందుకు నిర్ణయించి గిట్టుబాటు ధరను అందిస్తుండటంతో రైతులు కొనుగోలు కేంద్రానికి భారీగా కందులను తరలిస్తున్నారు. గత రెండు రోజులుగా కంది కొనుగోలు కేంద్రం బంద్ కావడంతో సోమవారం ఒక్కసారిగా వేల సంఖ్యలో కంది బస్తాలు హాకా, పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంది కొనుగోలు కేంద్రానికి చేరాయి. సోమవారం దాదాపు పదివేలకు పై చిలుకు కంది బస్తాలు రావడంతో వాటిని కొనుగోలు చేసేందుకు హాకా, పీఏసీఎస్ అధికారులు నిర్ణయించి యార్డులోని హమాలీలను గంపగుత్తగా తమ వద్దకు పిలిపించుకోవడంతో పాటు యార్డులోని కమీషన్ ఏజెంట్లు కాటాలను సైతం తీసుకెళ్లారు. దీంతో ఇతరత్రా వేరుశనగ వంటి పంటలను యార్డుకు తీసుకువచ్చిన రైతులు టెండర్ పూర్తయినా తమ పంటలకు సంబంధించిన కాటాలను చేసుకునేందుకు సాయంత్రం వరకు వేచి చూడాల్సి వచ్చింది. నారాయణపేట మార్కెట్‌యార్డులో ప్రస్తుతం గ్రేడర్ చందర్, అటెండర్ మాత్రమే రెగ్యులర్ విధులు నిర్వహిస్తుండగా మిగిలిన వారు అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. అయితే ఈ యార్డుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం, ఇన్‌చార్జిగా నియమించిన గ్రేడ్-1 కార్యదర్శి ఇక్కడ విధులు నిర్వహించేందుకు సముఖత చూపకుండా మక్తల్ యార్డుకు మాత్రమే పరిమితం కావడంతో యార్డులో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. సోమవారం నారాయణపేట మార్కెట్‌యార్డులోని కంది కొనుగోలు కేంద్రానికి రికార్డు స్థాయిలో కంది పంట రావడంతో యార్డులోని హమాలీలతో పాటు ధడవాయిలు అందరూ అక్కడే పనిచేసేందుకు ఉద్యుక్తులయ్యారు. దీంతో యార్డులోని కమీషన్ ఏజంట్ల వద్దకు వచ్చిన పంటలను విక్రయించేందుకు వచ్చిన రైతులు మధ్యాహ్నం టెండర్ పూర్తయినా సాయంత్రం వరకు తమ పంటల కాటాలను వేయించుకునేందుకు ఎదురుచూస్తూ ప్రభుత్వం, అధికారులపై విమర్శలు చేస్తూ కానవచ్చారు. వాస్తవానికి కొనుగోలు కేంద్రంలో పది కాటాలను ఏర్పాటు చేస్తే సరిపోతుందని ముందుగా భావించినా రికార్డు స్థాయిలో ధాన్యం రావడంతో తప్పని పరిస్థితుల్లో అటు కంది రైతులకు న్యాయం చేకూర్చేందుకు హాకా, పీఏసీఎస్ అధికారులు కష్టిస్తుండగా యార్డుకు మిగిలిన పంటలను తీసుకువచ్చిన రైతులు మాత్రం ఇదేమి చోద్యం అంటూ వ్యాపారులతో వాగ్వాదాలకు దిగుతూ రాత్రి వేళల్లో కాటాలు ఎలా వేస్తారంటూ ఎదురు ప్రశ్నలకు దిగుతున్నారు.
కొనుగోలు కేంద్రంలోనూ వ్యాపారులదే హవా?
నారాయణపేట మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన కంది కొనుగోలు కేంద్రంలో యార్డులోని కమీషన్ ఏజంట్లు, కొందరు బయటి వ్యాపారులదే హవా కొనసాగుతోందని రైతులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. రైతుల నుండి తాము కొనుగోలు చేసిన పంటలను నేరుగా హాకా కేంద్రానికి తరలించి రైతుల పేరిట పంటను విక్రయిస్తున్నట్లు తప్పుడు ధృవీకరణలు సృష్టించి వారి పేరిట బ్యాంకులో డబ్బు జమ అయిన తరువాత వారి నుండి తిరిగి తమ సొమ్మును రాబట్టుకునేందకు ఖాళీ చెక్కులను రైతుల నుండి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాగా ఈ విషయమై ఉన్నతాధికారులు విచారణ జరిపించి రైతులకు న్యాయం చేకూర్చే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నేటికి ఒక్క రైతుకు అందని డబ్బు
మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన కంది కొనుగోలు కేంద్రంలో పంటను విక్రయించిన ఒక్క రైతుకు నేటికి చిల్లిగవ్వ అందలేదు. ఈ విషయమై రైతులు హాకా అధికారులతో మాట్లాడినా ప్రభుత్వం చెల్లిస్తుంది డబ్బు మా చేతికి రాదు మీ అకౌంట్లలో వేస్తారు కొన్ని రోజులు ఒపిక పట్టాలంటూ రైతులకు ఉచిత సలహాలు అందిస్తూ తప్పించుకుంటున్నారు.