మహబూబ్‌నగర్

రైతు ఎల్లకాలం సంతోషంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయిజ, జనవరి 22: రైతు ఎల్లకాలం సంతోషంగా ఉండాలి.. 24 గంటల విద్యుత్ ప్రతి సంవత్సరం 365 రోజులు సైతం సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.. తెలుగు ప్రజలంతా ఒక్కటే కానీ.. సీమాంధ్ర పాలకులు నాశనం చేశారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అయిజ మండల పరిధిలోని ఉత్తనూరు గ్రామంలో ధన్వంతరి వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మాజీ జడ్పీటీసీ తిరుమలరెడ్డి రైతు సంబురాలు నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యఅతిథిగా హాజరై పాలపళ్ల సైజు విభాగం పశు బలప్రదర్శన పోటీలు ప్రారంభించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. రైతులను ఉత్తేజపరిచేందుకే రైతు సంబురాలు నిర్వహించడం జరిగిందన్నారు. పశువులను చంటి బిడ్డలా కంటికి రెప్పలా కాపాడుకునే రైతులు బలప్రదర్శనలో ఎలాంటి హింసకు పాల్పడకుండా ఈ పోటీల్లో తమ కాడెద్దులను పాల్గొని రైతులు మరింత ఉత్సాహంతో వాటి బాగోగులు చూసుకుంటారని అన్నారు. రైతులకు రుణమాఫీ చేశామని తెలిపారు. అప్పు చేసే రైతులు పంట సాగుకు డబ్బు అందించడం కోసం వచ్చే ఖరీఫ్ నుండి అన్ని వర్గాల రైతుకు ఎకరాకు రూ.8 వేల చొప్పున రైతు ఖాతాలలో జమ చేసి దేశంలోనే ఆదర్శవంతమైన ప్రభుత్వం చెబుకునేలా సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని గుర్తుచేశారు. తాగునీటికై ఇంటింటికి శుద్ధి చేయబడిన నల్లానీరు అందించడం కోసం మిషన్ భగీరథ నీరు త్వరలో ఇంటికి చేరుతాయని తెలిపారు. సాగునీటి కోసం ఎత్తిపోతల పథకాలు, చెరువులను నీటితో నింపడం జరుగుతుందని తెలిపారు. ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు నీరందించే ఉద్దేశంతో రూ.780 కోట్లతో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్నట్టు తెలిపారు. ఆగస్టు 15 నాటికి ప్రతి సెంటు భూమికి నీరు అందిస్తామన్నారు. చిన్నోనిపల్లి రిజర్వాయర్ ద్వారా సింధనూరు ప్రాంతంలో టీటీ దొడ్డి చెరువుకు నీరు నింపి ఆర్డీఎస్ డిస్ట్రిబ్యూటర్ 12 నుండి 24వ వరకు నీరందిస్తామన్నారు. తెలంగాణ ప్రాంత రైతులు ప్రతి రోజు పండుగ జరుపుకునే వాతావరణం కల్పిస్తామన్నారు. అలంపూర్ నియోజకవర్గానికి రూ.20 కోట్లు సీసీ రహదారుల నిర్మాణానికి మంజూరు చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీచైర్మన్ బండారి భాస్కర్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమోహన్‌రెడ్డి, నాయకులు సుభాన్, ఖగనాథ్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, తనగల సీతారామిరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అంబరాన్నంటిన జోగుళాంబ బ్రహ్మోత్సవాలు
* నయానానందకంగా అమ్మవారి నిజరూపదర్శనం *జోగుళాంబ సన్నిధిలో పోటేత్తిన భక్తులు
*ధ్వజారోహణంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు

అలంపూర్, జనవరి 22: ఐదవ శక్తి పీఠమైన జోగుళాంబ దేవి సన్నిధిలో 13వ వార్షిక బ్రహ్మోత్సవాల సంబురాలను అంబరాన్నంటేలా జరిగాయ. సోమవారం జోగుళాంబ అమ్మవారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా జోగుళాంబ దేవి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మండపంలో ఉదయం సహస్ర కళశాలను ఏర్పాటు చేసి ఆలయ అర్చకులు, చైర్మన్, ఈఓ, ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఐదు రోజలు పాటు కొనసాగిన పూజా సామాగ్రిని యాగాశాలలో మహపూర్ణహూతిగావించారు. అనంతరం జోగుళాంబదేవి మూల విగ్రహానికి పంచామృతాలతో అర్చకులు అభిషేకాలు నిర్వహించారు. జోగుళాంబ దేవి అమ్మవారు భక్తులకు నయానానందదాయకంగా నిజరూపదర్శనం ఇచ్చి పూజలందుకోంది. భక్తులు భక్తిశ్రద్ధలతో పాహిమాం పాహిమాం జోగుళాంబ తల్లీ అని అమ్మవారిని శరనువేడారు. అమ్మవారి దర్శనార్థం భక్తులు గంటల పాటు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. వార్షికోత్సవంలో భాగంగా సాయంకాలం అమ్మవారి సన్నిధిలో నిర్వహించిన శాంతి కల్యాణోత్సవాన్ని భక్తులు కన్నుల పండుగలా తిలకించారు. సాయంకాలం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఆలయ కార్యనిర్వహణ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగుకుండా తగు చర్యలను తీసుకున్నారు.

రైతుల శ్రేయస్సుకై ఈ-నామ్
* జాతీయ వ్యవసాయ మార్కెట్ బృందం అధికారిణి ఎస్‌ఎల్ బగాడే
దేవరకద్ర, జనవరి 22: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల శ్రేయస్సు కోసం ఈ-నామ్ విధానాన్ని తీసుకువచ్చిందని ఢిల్లీ బృందం మార్కెటింగ్ అధికారిణి ఎస్‌ఎల్ బగాడే అన్నారు. సోమవారం మండల పరిధిలోని గూరకోండ, గుడిబండ గ్రామాలలో రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆమె ముఖ్యఅధితిగా పాల్గొని మాట్లాడుతూ రైతులు పండించిన పంటను అమ్మేందుకు తోందరపడి దళారుల చెంతకు చేరవద్దని, మార్కెట్‌యార్డులలోనే క్రయ విక్రయాలు జరపాలని అమె సూచించారు. రైతులు క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ప్రభుత్వం మార్కెట్‌యార్డులలో కొనుగోలు చేసే కేంద్రాలలోనే విక్రహిస్తే నష్టం వాటిల్లదని బయట దళారులను అశ్రయిస్తే తక్కువ రేటుకు విక్రయించి వారు అనేక విదాలు మోసం చేసి వారు మీరు పండించిన పంట ద్వారా సంపన్నులు అవుతారని వివరించారు. రైతుల సౌలభ్యం కోసమే ఈనామ్ విధానం కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిందని ఢిల్లీ బృందం మార్కెటింగ్ అధికారిణి బగాడే అన్నారు. అంతకు ముందు మార్కెట్‌యార్డును, నూతనంగా నిర్మించిన గోదాములను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో పండించిన పంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు పండించిన పంటను గోదాములలో భద్రపరుచుకోవచ్చునని ఆమె రైతులకు సూచించారు. రైతులు పడే ఇబ్బందులను గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు వచ్చే సమస్యలను ఢిల్లీ బృందం అధికారిణి బగాడేకు మండల రైతు సంఘం అధ్యక్షుడు ఆమెకు వివరించారు. రైతులు సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేస్తామన్నారు. రైతు శ్రేయస్సే ముఖ్యమని ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదన్నారు. సమస్య వస్తే నేరుగా ప్రభుత్వ అధికారుల దృష్టికి రైతులు కలిసి తెలపాలని సూచించారు. ఎప్పటికప్పుడు రైతుల దగ్గర కొనుగోలు చేసిన పంటల డబ్బులు నేరుగా రైతు అకౌంటులో వేసేవిధంగా చర్యలు తీసుకుంటారని అధికారులకు సూచించారు. ఆమె వెంట ఎంపీపీ ఈవీ గోపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ జట్టి నరసింహరెడ్డి, మండల రైతు సంఘం అధ్యక్షుడు కొండరెడ్డి, మార్కెట్ కార్యదర్శి భాస్కర్, టీఆర్‌ఎస్ గ్రామపార్టీ అధ్యక్షుడు రామన్‌గౌడ్, కుర్వ శ్రీను, భాస్కర్‌రెడ్డి, సర్పంచులు బుచ్చన్న, గోవిందమ్మ, నరసింహులు, గోపాల్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.