మహబూబ్‌నగర్

వారబందీతో తడారిపోతున్న కాలువలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరచింత, ఫిబ్రవరి 23: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో రోజు, రోజుకు నిల్వనీరు తగ్గిపోతున్న తరుణంలో కుడి, ఎడుమ కాలువల కింద పంటలు సాగు చేసుకుంటున్న రైతులకు పూర్తిస్థాయిలో నీరు అందించడం కష్టతరంగా మారింది. ఈ పరిస్థితుల్లో పీజేపీ అధికారులు వారబందీ చేపట్టి నీటిని విడుదల చేస్తుడడంతో కుడి, ఎడుమ కాలువలు నీరు లేక తడి ఆరిపోతున్నాయి. దీంతో ఆయకట్టు రైతుల పరిస్థితి రానున్న కాలంలో అయోమయంగా కనిపిస్తోంది. గత రెండు నెలల ముందు రైతులు నారు మళ్లను పోసుకునే సమయంలో మార్చి 10 వరకూ నీటిని విడుదల చేస్తామని చెప్పిన అధికారులు జూరాల ప్రాజెక్ట్‌లో నీరు పుష్కలంగా ఉన్నప్పుడు నిల్వ చేసుకోకుండా నిల్వ నీటిని దిగువకు వదిలి వేసిన ప్రజా ప్రతినిధులు, కనీస అవగాహన లేని అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారంలో రెండు రోజులు మాత్రమే అధికారులు సాగు నీరు విడుదల చేస్తుడంగా వచ్చిన నీరు ఎండకాలనికి ముందే ఎండలు దంచికొడుతుడడంతో మొదటి గంట పాటు తడి అరిపోయిన తర్వాత కాలువలకు నీటిని వదలడంతో, చాలా వరకూ నీరు ఇంకి పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నరు. ఇదే పరిస్థతి కొనసాగితే మరో రెండు వారాల్లో నీటి కోసం ఆందోళనలను తప్పవనే వాదనలు వినిపిస్తున్నాయి. పంటలు చేతికి వచ్చే సమయంలో ఇలాంటి ఇబ్బందులు వస్తాయని పలువురు రైతు సంఘాల నాయకులు ముందుస్తు హెచ్చరికలు చేస్తు దిగువకు నీటి విడుదలను నిలిపివేయాలని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మాటల గారఢీ చేస్తున్న కేసీఆర్
* బీజేపీ రాష్ట్ర సంపర్క కన్వీనర్ కొండయ్య
మాగనూర్, ఫిబ్రవరి 23: రాష్ట్రం ఏర్పడిన తర్వాత గద్దెనెక్కిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాయమాటలతో గారఢీ చేస్తున్నారు తప్పా.. ఎక్కడ అభివృద్ధి చేయడం లేదని బీజేపీ రాష్ట్ర సంపర్క కన్వీనర్ కొండయ్య విమర్శించారు. శుక్రవారం మండల కేంద్రమైన మాగనూర్‌లో బీజేపీ మండల అధ్యక్షుడు జయనంద్ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. మాగనూర్, కృష్ణ మండలాల్లో ఏ ఒక్కరికి డబుల్ బెడ్‌రూంలు కేటాయించలేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి ఏ ఒక్కరికి ఇప్పటి వరకు ఇవ్వలేదని విమర్శించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్‌బెడ్‌రూంలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో జిల్లా ఉపాద్యక్షుడు సోమశేఖర్‌గౌడ్, కృష్ణయ్య, సాగర్, నరసింహులు, అశోక్‌గౌడ్, మారెప్ప, రాధరమేష్‌గౌడ్, నారాయణ, లింగప్ప తదితరులు పాల్గొన్నారు.