మహబూబ్‌నగర్

శ్రీలక్ష్మి గోశాల ఏర్పాటు గర్వకారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 24: రాష్ట్రంలోనే ప్రప్రథమంగా పాలమూరు జిల్లాలో శ్రీలక్ష్మి గోశాలను ఏర్పాటు చేయడం గర్వకారణమని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం హన్వాడ మండలం చిన్నదర్పల్లి గ్రామంలో శ్రీలక్ష్మి గోశాల ప్రారంభానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే జిల్లాకు 750 క్వింటాళ్ళ దాన ప్రభుత్వం అందించిదని తెలిపారు. చిన్నదర్పల్లి గోశాలలో నీటి సౌకర్యం తక్కువగా ఉన్నందునా అదనంగా మరో బోరు వేయిస్తామని హమీ ఇచ్చారు. రూ.4 లక్షలతో మరో గోశాల షెడ్ వేయిస్తానని పాలమూరు జిల్లా పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉందని అన్నారు. ఇట్టి గోవుల దానను అక్రమంగా తరలిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ గోశాలలో 150 గోవులు ప్రస్తుతం ఉన్నాయని గోశాలకు పంపిణీ గోవుల యాజమానులకు రూ.13 ఉన్న దానను 50 శాతం సబ్సిడీ కింద 50 కిలోల చొప్పున దానను రూ.6.50 కే ఇస్తామని అన్నారు. ఒక గోవుకు ప్రతి రోజు ఐదు కిలోల చొప్పున దాన వేస్తున్నట్లు తెలిపారు. జిల్లా అదనంగా గోశాలను నిర్మిస్తామని రైతులు తమ దగ్గర ఉన్న గోవులను గోశాలకు తీసుకువచ్చి ఐదు కిలోల వరకు దానను గోవులకు తినిపించుకుని తీసుకెళ్లోచ్చని అన్నారు. రైతులు గోవులను సంరక్షించుకోవాలని ప్రతి ఇంటికో గోవు ఉంటే ఆ ప్రాంతం సుభీక్షంగా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయని అన్నారు. కాగా తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇలాంటి గోశాలలు ఏర్పాటు చేసి గోవుల సంరక్ష అంటే చాల బాధ్యతతో కూడుకున్న అంశమని ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందించదగ్గ విషయమని అన్నారు. కార్యక్రమంలో పంశుసంవర్ధక శాఖ జెడి సుధాకర్, ఎడి శివానందస్వామి, డాక్టర్ రాంప్రసాద్, వెంకటేశ్వర్లు, శివరాజ్, ఈశ్వర్‌రెడ్డి, గోశాల కార్యదర్శి ముకుందారెడ్డి పాల్గొన్నారు.