క్రైమ్/లీగల్

నిషేధిత బిట్‌కాయిన్స్ నిర్వహిస్తున్న ఇద్దరి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 28: నిషేధిత బిట్‌కాయిన్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇద్దరు నింధితులను అరెస్టు చేసి వారి నుండి నగదును కూడా స్వాధీనం చేసుకున్నామని మహబూబ్‌నగర్ ఎస్పీ అనురాధ తెలిపారు. ఇటీవల మహబూబ్‌నగర్ పట్టణంలో కలకలం రేపిన నిషేధిత బిట్‌కాయిన్స్, మల్టీలేవల్ మార్కెటింగ్ సిస్టమ్‌తో ప్రజల నుండి లక్షల రుపాయలు దండుకుని పోలీసులకు దొరకకుండా పరారైన నిందితులను ఎట్టకేలకు బుధవారం మహబూబ్‌నగర్ బస్టాండ్ సమీపంలో ఇద్దరు నింధితులను జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈసందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ అనురాధ మాట్లాడుతూ మల్టీలేవల్ మార్కెటింగ్‌ను నమ్మి ప్రజలు మోసపోవద్దని అత్యాశకు పోయి ప్రజలు కేసుల్లో ఇరుక్కొకూడదని ముఖ్యంగా యువకులు ఇలాంటి వ్యాపారంపై దృష్టి సారించకుండా ఉండాలని తెలిపారు. మహబూబ్‌నగర్ పట్టణంలో బిట్‌కాయిన్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని ఎస్పీ వెల్లడించారు. కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామానికి చెందిన మాలావత్ లక్ష్మణ్, మహబూబ్‌నగర్ పట్టణంలో నివాసం ఉంటూ అయోధ్యనగర్‌కు చెందిన గోపన్‌పల్లి జడ్పీహెచ్‌ఎస్‌లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న కండెల విజయ్‌ప్రతాప్‌రెడ్డిలను అరెస్టు చేశామని, వీరిద్దరు నిషేదిత బిట్‌కాయిన్స్ ఆన్‌లైన్ మల్టీలేవల్ మార్కెటింగ్ పేరిట ప్రజలను మోసం చేస్తూ లక్షలాది రుపాయలు దండుకున్నారని తెలిపారు. సీసీటీసీ గ్లోబల్ డాట్‌కమ్ ద్వారా రూ.12వేలు డిపాజిట్ చేసి ఒక ఐడీ తీసుకుంటే రోజువారిగా 0.60డాలర్ల కమీషన్ వస్తుందని ఎన్ని ఐడీలు వేసుకుంటే అన్ని డాలర్లు కమీషన్ వస్తుందని ప్రజలకు మాయమాటలు చెప్పి చాలా మందిని ఇందులోకి లాగి తమ బ్యాంకు ఖాతాల్లో, భార్య, బంధువుల ఖాతాల్లో అటునుండి వచ్చిన డబ్బును జమ చేశారని తెలిపారు. లక్ష్మణ్ ప్రస్తుతం హైదరాబాద్ పట్టణంలోని కొత్తపేట, పనిగిరి కాలనీల్లో నివాసం ఉంటూ ప్రజలను మోసం చేస్తూ సులభంగా డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో దుబాయ్‌కి చెందిన అనుస్‌దామస్‌తో నెట్‌లో పరిచయం చేసుకున్నారని తెలిపారు. ఆ నెట్ ద్వారానే 2017 సెప్టెంబర్‌లో లక్ష్మణ్, కొంత మంది కిరణ్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తి ద్వారా మహబూబ్‌నగర్ పట్టణంలోని విజయప్రతాప్‌రెడ్డిని పరిచయం చేసుకుని ఆయన సహకారంతో జిల్లాలో చాలా మందికి కుచ్చుటోపి పెట్టారని తెలిపారు. ఇప్పటి వరకు తాము విచారించగా రూ.1.50కోట్ల మోసం జరిగినట్లు తెలిసిందని ఓపెన్ చేసిన గ్లోబల్ డాట్‌కమ్‌ను నిలిపివేశారని తెలిపారు. అరెస్టు చేసిన వారి నుండి రూ.6.79లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని, వీరి బ్యాంకు ఖాతాలతో పాటు వారి భార్యలు, కుటుంబ సభ్యుల ఖాతాల్లోని రూ.47.41లక్షల లావాదేవిలను కూడా గుర్తించి ఖాతాలను సీజ్ చేశామని ఆమె తెలిపారు. ఇటువంటి ఆన్‌లైన్ వ్యాపారాలు ఎప్పటికి ప్రజలు నమ్మదగినవి కావని ఎప్పటికప్పుడు జిల్లా పోలీసు యంత్రాంగం పలుమార్లు సూచనలు చేసిన ఇలాంటి మోసాలకు గురికావడం విచారకరమన్నారు. అమాయక ప్రజలను మోసంచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కేసు దర్యాప్తును మరింత లోతుగా నిర్వహించి మొత్తం కూపీని లాగుతామన్నారు. అదేవిధంగా మహబూబ్‌నగర్ పట్టణంలో మరో ఆన్‌లైన్ మార్కెటింగ్ కొనసాగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సెఫ్‌షాప్ పేరిట కొందరు మోసం చేయడానికి పూనుకున్నారని అలాంటివారిని నమ్మవద్దన్నారు. సెఫ్‌షాప్‌పై ప్రత్యేక నిఘా పెడుతామని తెలిపారు. విలేఖరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ భాస్కర్, సీఐ కిషన్ పాల్గొన్నారు.