మహబూబ్‌నగర్

ఆర్డీఎస్ ఆధునికీకరణపై ఏకాభిప్రాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 28: గత పదిహేనేళ్లుగా ఆర్డీఎస్ ఆధునీకికరణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉండడంతో తెలంగాణ రాష్ట్రం అవిర్భవించాక ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్డిఎస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆర్డి ఎస్ నుండి 85 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా కేవలం 20 నుండి 25 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది. దింతో నీటి వాడకంపై అటు రాయలసీమ, ఇటు తెలంగాణ రైతాంగం మధ్య నీటి యుద్దాలు, గొడవలు జరిగిన సందర్బాలు తరచు జరుగుతూనే ఉంటాయి. ఇరు ప్రాంతాల రైతుల మధ్య తగాదాలకు స్వస్తి పలికేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రి హరీష్‌రావుకు భాద్యతలను అప్పజెప్పారు. అందులో బాగంగా ఇటివల రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు నేరుగా కర్ణాటక నీటి పారుదల శాఖ మంత్రి ఎంబి.పాటిల్‌తో చర్చల కోసం ప్రయత్నించగా ఆయన ఒకే అనడంతో అందులో భాగంగా గురువారం మంత్రి హరీష్‌రావుతో పాటు ప్రాజెక్టుల ఎస్సీ ఖగేంధర్, ఆర్డిఎస్ ఆయకట్టు చైర్మన్ సీతారాంరెడ్డితో పాటు పలువురు ఎస్‌ఇలు కర్ణాటకకు బయలుదేరారు. కర్ణాటక రాజదాని బెంగుళూరులో ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఎంబి.పాటిల్‌తో మంత్రి హరీష్‌రావు గంటల తరబడి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఆర్డిఎస్ ఆదునీకికరణపై చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చారు. 2004 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దాదాపు రూ.90కోట్లతో ఒకటి నుండి ఎనిమిది ప్యాకేజిల వరకు ఆదునీకికరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. మరో రెండు ప్యాకేజిలు పెండింగ్‌లో ఉండడంతో అదనంగా మరో రూ.14కోట్లు కేటాయించి పూర్తి స్థాయిలో ఆర్డి ఎస్ ఆధునీకికరణ పనులు చేపట్టాలని 2005లో టెండర్ ప్రక్రియను పూర్తి చేశారు. కర్ణాటకలో జరిగిన ఒకటి నుండి ఐదు ప్యాకేజిల వరకు టెండర్లు అక్కడ జరగడం దాంతో అక్కడి కాంట్రాక్టర్లకు ఆ పనులు దక్కాయి. ఒకటి నుండి నాలుగు ప్యాకేజిల వరకు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉన్నాయి. ఒకటి రెండు ప్యాకేజిలు మాత్రం పనులే ప్రారంభించకపోవడం ఆర్డిఎస్‌కు శాపంగా మారింది. ఈ విషయాలను ఇరువురుల రాష్ట్రాల మంత్రులు హరీష్‌రావు, ఎంబి.పాటిల్‌లు ఈ చర్చల్లో ఏకాభిప్రాయానికి వచ్చి ఆర్డిఎస్ ఆధునీకికరణ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని నిర్ణయించారు. పనులు చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లీస్టులో కూడా ఉంచాలని మంత్రి హరీష్‌రావు ఆ రాష్ట్ర మంత్రి ముందు ఉంచడంతో అందుకు పాటిల్ ఒకే అన్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం తుంగభద్ర డ్యాం నుండి ఆర్డిఎస్‌కు మూడు టిఎంసిల నీటిని వదలాలని మంచినీటి ఇబ్బంది ఉన్నందున తాగునీటి అవసరాల కోసం సహకరించాలని కూడా కోరారు. ఈ విషయాన్ని తమ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దిరామయ్య దృష్టికి తీసుకెళ్తానని మంత్రి ఎంబి పాటిల్ హరీష్‌రావుకు చెప్పినట్లు సమాచారం. అయితే ఇరువురు మంత్రులు మాత్రం ఆర్డిఎస్ ఆధునీకికరణ పనులకు మాత్రం జాప్యం లేకుండా రెండు నెలల్లోపు పూర్తి చేయాలని కూడా ఏకాభిప్రాయానికి వచ్చారు.