మహబూబ్‌నగర్

2019లో మళ్లీ టీఆర్‌ఎస్‌దే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 19: రానున్న 2019లో మళ్లీ టీఆర్‌ఎస్‌దే అధికారమని, ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం మహబూబ్‌నగర్, హన్వాడ మండలాలకు సంబంధించిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీలకు సంబంధించిన వివిధ గ్రామాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈసందర్భంగా ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాదాపు 200ల మందికి పైగా వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల నాటికి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు జెండా పట్టే కార్యకర్తలే ఉండరని, మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో ప్రతిపక్షాలు కనుమరుగు కావడం తథ్యమన్నారు. జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఒకవైపు ఉంటే ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు మాత్రం వేళ్లపై లెక్కపెట్టే స్థాయిలో అటువైపు ఉన్నారని ఆరోపించారు. వారి నుండి రాజకీయాల్లో ఏమీ ఒరగదని టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టే సత్తా వారిలో లేదని ఎద్దేవా చేశారు. ఎన్ని యాత్రలు చేసినా వారికి మిగిలేది, భంగపాటేనన్నారు. 40ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 20ఏళ్ల పాటు అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు పాలమూరు జిల్లాకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఒక గ్రామానికి ఒక ట్రాన్స్‌ఫార్మర్, ఒక సీసీ రోడ్డు నిర్మాణానికి సంవత్సరం పాటు నాయకుల వెంట ప్రదక్షిణలు చేసిన ప్రజలు అలసిపోయినా మంజూరు కాలేని దుస్థితిని ఎదుర్కోన్నారన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి 2014లో అడుగులు ప్రారంభం అయ్యాయని తెలిపారు. ప్రస్తుతం బంగారు తెలంగాణ నిర్మాణ దశలో రాష్ట్రం ముందుకెళ్తుందన్నారు. మన్యంకొండపై నిర్మిస్తున్న మిషన్ భగీరథ రిజర్వాయర్ మరో నాలుగైదు నెలల్లో పూర్తి అవుతుందన్నారు. దాంతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు శుద్ధ జలాలను అందించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం కోయిల్‌సాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ నుండి మిషన్‌భగీరథ పథకం ద్వారా హన్వాడ మండలంతో పాటు మహబూబ్‌నగర్ మండలానికి కూడా ఇంటింటికి మంచినీరు అందించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాలకు శుద్ధజలాలు అందుతున్నాయన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు. కర్వెన రిజర్వాయర్ పూర్తి అయిన తర్వాత తొలిదశలోనే మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని బీడుబారిన భూములకు కృష్ణాజలాలను అందించి తీరుతామన్నారు. మహబూబ్‌నగర్ బైపాస్ రోడ్డు భూనిర్వాసితులకు రెండు, మూడురోజుల్లో పరిహారం డబ్బులు అందనున్నాయని తెలిపారు. అంతేకాకుండా అతిపెద్ద ప్రాజెక్టు మమహబూబ్‌నగర్ పట్టణానికి అందిస్తుందని గత వారం రోజుల క్రితమే జీఓ కూడా విడుదల చేసిందని రూ.600 కోట్లతో అండర్ డ్రైనేజీ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందన్నారు. ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, మండల కమిటీ అధ్యక్షుడు లక్ష్మయ్య, సర్పంచుల సంఘం అధ్యక్షుడు కృష్ణయ్యగౌడ్, నాయకులు పెంట్యానాయక్, నరసింహారెడ్డి, అచ్చన్న, సుదర్శన్‌గౌడ్, బాలయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత
- అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
వంగూరు, ఏప్రిల్ 19: టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధన్యత ఇస్తున్నట్లు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. గురువారం మండల పరిధిలోని రంగాపూర్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీ ఆర్ వ్యవసాయ రంగానికి అధిక ప్రాధన్యతనిస్తూ రైతాంగాన్ని ఆదుకుంటున్నట్లు తెలిపారు. సాగునీరు అందించడానికి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. రైతాంగానికి పెట్టుబడి సహాయం కింద ఎకరాకు రెండు పంటలకు రూ. 8వేలు త్వరలో అందిచనున్నట్లు చెప్పారు. మండల రైతులు ఈ వరి కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకొని గిట్టుబాటు ధరను పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ భాగ్యలక్ష్మీ, సింగిల్ విండో చైర్మన్ రాజశేఖర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గణేష్ రావు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నారాయణరావు, రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.