మహబూబ్‌నగర్

రాష్ట్రంలో పారదర్శకమైన పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 19: రాష్ట్రంలో పారదర్శకతమైన పాలన ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్నారని మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్‌నగర్‌కు విచ్చేసిన ఆయన ఆర్‌అండ్‌బి అథితి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని సమస్యల పరిష్కారానికిగాను ప్రభుత్వం చాలా కృషి చేస్తుందన్నారు. ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉందని ఎలాంటి అనుమానాలు వద్దన్నారు. ఫ్రెండ్లీ ఉద్యోగుల ప్రభుత్వం అని అందుకే ఉద్యోగులకు రాష్ట్రం ఏర్పాటు అయిన తొలి ఫలితాల్లోనే వేతనాలు పెంచారని గుర్తుచేశారు. మే నెలాఖరు నాటికి అన్ని శాఖల్లోని ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలు తప్పకుండా జరగనున్నాయని తెలిపారు. పైరవీలకు ఎలాంటి తావ్వికుండా పారదర్శకంగా బదిలీలు జరగనున్నాయని స్పష్టం చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలు అధికంగా తీసుకువచ్చి పేద ప్రజలకు మేలు చేసిందన్నారు. దాంతో ప్రతి పేదవాడి పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. గురుకుల పాఠశాలలో సైతం ఉద్యోగాల భర్తీకై ప్రత్యేకంగా రిక్య్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని ఆ బోర్డు ద్వారానే నియమాకాలు జరగనున్నాయని ఆయన వెల్లడించారు. అన్ని నియామకాల్లో పారదర్శకంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు జరిగిన నియామకాల్లో ఉద్యోగాలు పొందినవారిలో నయాపైసా ఎవరికి లంచం ఇవ్వకుండా ఇంటికి నేరుగా నియామక పత్రాలు వచ్చాయన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చిన వారిని అడితే తెలుస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన ఎంతో నీతి నిజాయితీతో నడుస్తుందన్నారు. సీపీఎస్ రద్దుకు కూడా సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని తెలిపారు. సుదీర్ఘంగా ఉద్యోగ సంఘాలతో మేధావులతో, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. కేంద్రం నుండి కూడా ఎలాంటి సహకారం తీసుకోవాలో వాటిపై కూడా అధ్యయనం చేస్తున్నారని చెప్పారు. ఏకీకృత సర్వీస్‌రూల్స్‌పై కోర్టులో ఉన్నవాటిపై వేకెంట్ చేస్తున్నామని త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 60 వేల ఉద్యోగాల నియమాకాలకు అనుమతి ఇవ్వడం జరిగిందని ఇప్పటికే దాదాపు 30 వేల భర్తీ ప్రక్రియ ప్రారంభమైందని ఆయన వివరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రభుత్వం వారి సభ్యత్వాలను రద్దు చేయలేదని వారిని శాసనసభాపతి రద్దు చేశారని పాతూరి పేర్కొన్నారు. కానీ కోర్టు కేసులో ఆధారాలను ప్రభుత్వాన్ని అడగడం కన్నా స్పీకర్‌ను ఆధారాలు అడిగి ఉంటే తీర్పు మారోలా వచ్చేదని వ్యాఖ్యానించారు. తాము మాత్రం హైకోర్టు ఇచ్చిన తీర్పును హర్షించడంలేదని కోర్టు ఏకపక్షంగా తీర్పును ఇచ్చిందనే భావిస్తున్నామన్నారు. రెండు రోజుల క్రితమే తీర్పునకు సంబంధించిన పత్రాలు అందాయని వాటి ద్వారా కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలకు ముందుకు వెళ్లాలో ఆలోచిస్తున్నామని చెప్పారు. అలాగే ఉద్యోగాల భర్తీలో కోదండరామ్ మాట్లాడుతున్న మాటల్లో వాస్తవంలేదని ఆయన కొట్టిపారేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న పాలన పట్ల ప్రజలు మాత్రం సంతోషంగా ఉన్నారన్నారు. అనంతరం టీపీఆర్‌టియూ నాయకులు పాతూరి సుధాకర్‌రెడ్డితో ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించారు.