మహబూబ్‌నగర్

టీఆర్‌ఎస్ పతనం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 21: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పతనం ప్రారంభమైందని, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపట్ల రోజురోజుకు ప్రజలు విసుగుచెందారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్‌లోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన వివిధ వార్డుల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నదర్పల్లి 33 వార్డుకు సంబందించిన నాగరాజుయాదవ్, పాతపాలమూరుకు 13వ వార్డుకు చెందిన నరేందర్ ముదిరాజ్‌లను మహబూబ్‌నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక కార్యదర్శులుగా నియమిస్తూ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్‌యాదవ్ నియమించారు. వీరికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ నియమాక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉబెదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీకి కౌంట్‌డౌన్ ప్రారంభం అయిందన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి వందలాది మంది యువత చేరుతున్నారని అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తొమ్మిది మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారని వారంత రాబోయే ఎన్నికల్లో ఓటమి చెందుతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు మరింత బలపడుతుందని చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దుపై ప్రభుత్వానికి కోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని చెప్పారు. పలు నియోజకవర్గాలలో టీఆర్‌ఎస్ నాయకులు దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆరోపించారు. ప్రజలు వారికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలో పార్టీలోకి ప్రతి రోజు యువకులు కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటూ పార్టీకి అండగా నిలుస్తున్నారని ఎప్పుడు ఎన్నికలు వస్తాయే ఎప్పుడు టీఆర్‌ఎస్ పార్టీని ఓడించాలో అనే ఆలోచనలో యువత ఉన్నారని అన్నారు. యువతకు కాంగ్రెస్ పార్టీలో పెద్దపీట వేయడం జరుగుతుందని పని చేసే వారికి పార్టీ పదవులు తప్పకుండా లభిస్తాయని అన్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలో నెలకొన్న సమస్యలపై నిరంతరంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వినోద్‌కుమార్, రవికిషన్‌రెడ్డి, పాష, తదితరులు పాల్గొన్నారు.

ఉమామహేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న
హిమాచల్‌ప్రదేశ్ సీజే కుటుంబం
అచ్చంపేట, ఏప్రిల్ 21: మండల పరిధిలోని శ్రీ ఉమామహేశ్వర ఆలయాన్ని శనివారం హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) సంజయ్ కరోల్ సతీమణి చిత్ర కోరల్, వారి కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారి వెంట స్థానిక అచ్చంపేట మున్సిఫ్ కోర్టు జడ్జీ దశరథ రామయ్య ఉన్నారు. వారిని ఆలయ కమిటీ చైర్మన్ కందూరు సుధాకర్ ప్రత్యేక పూజలు జరిపించి ఆలయా మర్యాద పూర్వకంగా శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఈఓ శ్రీనివాసులు, కమిటీ సభ్యులు జూలురి సత్యనారాయణ, అర్చకులు వీరయ్యశాస్ర్తీ పాల్గొన్నారు. నల్లమలలో గల ప్రత్యేక వాతావరణాన్ని చూసి హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుటుంబ సభ్యులు చాలా సంతోషం వ్యక్తం చేశారని అచ్చంపేట జడ్జీ దశరథ రామయ్య చెప్పారు.

క్షణికావేశంతో కుటుంబాలకు దూరమవద్దు
- సీనియర్ సీవీల్ జడ్జీ శ్రీనివాస్‌రెడ్డి
నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 21: క్షణికావేశంతో కుటుంబానికి, సమాజానికి దూరం కావద్దని స్థానిక సీనియర్ సివిల్ జడ్జీ శ్రీనివాస్‌రెడ్డి ఖైదీలకు సూచించారు. శనివారం స్థానిక సబ్‌జైల్‌లో ఉన్న ఖైదీలకు చట్టాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈసందర్భంగా సీనియర్ సివిల్ జడ్జీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ క్షణికావేశానికిలోను కావడం వల్ల కలిగే అనార్థాల గురించి వివరించారు. ఖైదీలకు వివిధ చట్టాలు, శిక్షలు, పౌరుల బాధ్యతలు తదితర వాటి గురించి వివరించారు.
నేరాలు చేసి నేరస్థులు కావద్దని చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని చట్టం నుండి ఎంత గొప్పవారైన తప్పించుకోలేరన్నారు. తమ తమ జీవితాలు పాడుచేసుకోవద్దని సూచించారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జీ శాలిని, మోబైల్ జడ్జీ మురళీమోహన్‌లు మాట్లాడుతూ వివిధ చట్టాల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు బాబు పియర్స్, సత్యనారాయణరావు, న్యాయవాది రఘునాథ్‌రావు తదితరులు పాల్గొని వివిధ అంశాలపై మాట్లాడారు.