మహబూబ్‌నగర్

రైతులను తాగుబోతులంటే తాటతీస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మే 17: రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కొందరు రైతుబంధు పథకంపై విమర్శలు చేస్తున్నారని ఏకంగా ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం డబ్బులను వ్యవసాయానికి కాకుండా బీరు, విస్కిలకు ఖర్చు చేస్తున్నారని రైతులను ప్రభుత్వం తాగుబోతులుగా తయారు చేస్తోందంటూ చవకబారు విమర్శలు మాట్లాడ డాన్ని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తీవ్రంగా ఆక్షేపించారు. రైతులను తాగుబోతులు అంటూ వర్ణిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకుల తాటతీయాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. గురువారం మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పాలకొండ, జైనల్లిపూర్, వెంకటాపూర్, హన్వాడ గ్రామాల్లో రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని హన్వాడ మండల కేంద్రంలో ఎండ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. పలువురు రైతులు వివిధ గ్రామాల నుండి ఎండ్లబండ్లపై తరలివచ్చి చెక్కులు అందుకున్నారు. రైతులు తీసుకువచ్చిన ఎండ్లబండిపై హన్వాడ గ్రామంలో ఎమ్మెల్యేతో పాటు టీఆర్‌ఎస్ నాయకులు, రైతు సమన్వయ సమితి సభ్యులు భారీ ఊరేగింపు నిర్వహించారు. చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హన్వాడ గ్రామంలోని శ్రీశారద విద్యాలయం పాఠశాల ఆవరణలో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రైతులను ప్రతిపక్ష పార్టీల నాయకులు అవమానిస్తున్నారని, ఆ పార్టీల నాయకులు గ్రామాలకు వస్తే రైతులు నిలదీయాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నం పెడుతుంటే కాంగ్రెస్ నాయకులు రైతులకు సున్నం పెడుతున్నారని ఎద్దేవా చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే కర్వెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్లు పూర్తయ, హన్వాడ మండలానికి కృష్ణాజలాలు అందేవన్నారు. దుర్మార్గం అలోచించిన కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టుపై కేసులు వేసి ఇబ్బంది పెట్టారని రైతుల ఉసురువారికి తప్పకతగులుతుందన్నారు. కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలని అలాంటి పార్టీ నాయకులు టీఆర్‌ఎస్ విమర్శలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ జ్యోతి, సర్పంచు వెంకటమ్మ, ఎంపీటీసీలు అంజనేయులు, రాధ, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మయ్య, నాయకులు కొండ బాలయ్య, పెద్ద చెన్నయ్య, జంబులయ్య, రైతు సమన్వయ సమితి సభ్యులు రమణారెడ్డి, బాలగౌడ్, బస్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కేంద్రం
- డీసీసీ మాజీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాష్
మహబూబ్‌నగర్, మే 17: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తుందని డీసీసీ మాజీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాష్ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీ (ఎస్)లకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వనందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ముత్యాల ప్రకాష్ మాట్లాడుతూ కర్ణాటకలో రాజ్యాంగ విరుద్ధంగా యేడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారని అన్నారు. కాంగ్రెస్, జేడీ (ఎస్) పార్టీలకు ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం ఉన్నా గవర్నర్‌ను అడ్డుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహిరంచిందని మండిపడ్డారు. గతంలో మేఘాలయ, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు ఉన్నా అక్కడ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఘనత బీజేపీకి దక్కిందని ఆరోపించారు. బీజేపీ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. త్వరలో బీజేపీకి గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు చంద్రకుమార్‌గౌడ్, పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్‌యాదవ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బెక్కరి అనిత, నేతలు బాలస్వామి, వేణుగోపాల్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.