మహబూబ్‌నగర్

రైతుబంధును పెట్టుబడికే ఉపయోగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్దకల్, మే 17: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం వల్ల పంటకు పెట్టుబడికి ఉపయోగపడుతుందని, రైతులు తమకు వచ్చిన ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతుబంధు పథకం రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్ కేశవులు అన్నారు. రైతులు తమకు వచ్చిన డబ్బులను దుర్వినియోగం చేయకుండా పంటలకు కావలసిన ఎరువులు, విత్తనాలకు వినియోగించుకోవాలని సూచించారు. గురువారం మల్దకల్ మండలం ఎద్దులగూడెం గ్రామంలో జరిగిన రైతుబంధు పంపిణీ పరిశీలించి రైతులకు చెక్కులు, పాస్‌పుస్తకాలు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు పథకంతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతుకు ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు పంటలకు ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు. ఏ రైతు చెక్కులు రాలేదని నిరాశ పడవద్దని, ప్రతి రైతుకు చెక్కులు అందజేస్తామన్నారు. మొదటి దశలో కొన్ని, రెండవ దశలో కొన్ని పాస్‌పుస్తకాలు, చెక్కులు అందించడం జరుగుతుందన్నారు. పాస్ పుస్తకాల్లో, చెక్కుల్లో ఏవైనా తప్పులు ఉంటే ఫిర్యాదు చేయవచ్చని, ఇందుకు ప్రత్యేకంగా ఫిర్యాదు కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. రైతులు నేరుగా బ్యాంకుకు వెళ్లి డబ్బు తీసుకోవచ్చని తెలిపారు. ఈ పథకం ద్వారా రైతులు ఎలాంటి అప్పులు చేయకుండా పంటలు పండించుకునే వీలుంటుందన్నారు. ఇప్పటికీ 8 జిల్లాలలో పర్యటించానని, చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీ అంతటా సజావుగా సాగుతున్నదని వెల్లడించారు. జేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రణాళిక బద్ధంగా టీంలు తయారు చేసి చెక్కులు, పాస్‌పుస్తకాలు పంపిణీ జరుగుతుందన్నారు. చెక్కులు, పుస్తకాలలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని ఈనెల 20వ తేదీ తర్వాత సవరించే ప్రక్రియ ప్రారంభంమవుతుందన్నారు. అనంతరం మల్దకల్‌లోని ఆదిశిలా క్షేత్రంలో వెలసిన లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శాలువ, తీర్థప్రసాదాలతో సత్కరించి ఆలయ చరిత్రను వివరించారు. కార్యక్రమంలో గద్వాల మార్కెట్ యార్డు చైర్మన్ బండ్ల లక్ష్మిదేవమ్మ, ఎంపీపీ సవారమ్మ, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, సర్పంచ్ తిమ్మారెడ్డి, తహశీల్దార్ వీరభద్రప్ప, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందునాయక్, టీఆర్‌ఎస్ నాయకులు సీతారామిరెడ్డి, మహబూబ్‌అలీ, వెంకటన్న, ఆంజనేయులు, ఎస్‌ఐ నవీన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి రాక వాయదాతో
రైతుబంధు నిలిపివేత
- పంపిణీ కేంద్రాల వద్ద రైతుల నిరసన
- జిల్లా అధికారుల స్పందనతో సాగిన చెక్కుల పంపిణీ
పాన్‌గల్, మే 17: రైతుబంధు కార్యక్రమానికి మంత్రి జూపల్లి రావడం వాయిదాపడటంతో రైతులకు పంపిణీ చేయాల్సిన చెక్కులను అధికారులు నిలిపి వేశారు. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు నిరసనకు దిగారు. ఈ సంఘటన మండల పరిధిలోని తెల్లరాళ్ళపల్లిలో గురువారం చోటు చేసుకుంది. షెడ్యూలు ప్రకారంగా గురువారం ఉదయం రైతుబంధు చెక్కులను పంపిణీ చేస్తారని, గ్రామంలో ప్రచారం చేయడంతో రైతులు పంపిణీ కేంద్రం వద్దకు అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఇలా ఉండగా మంత్రి జూపల్లి కృష్ణారావు గ్రామ పర్యటన వాయిదా పడటంతో రైతులు నిరసనకు దిగారు. ఈ విషయాన్ని గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్యనాయక్‌తో పాటు రైతులు నాయకులు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో జిల్లా అధికారులు రైతులకు చెక్కులు పంపిణీ చేయించడంతో రైతులు నిరసనను విరమించి చెక్కులను, నూతన పాస్ పుస్తకాలను తీసుకున్నారు. ఆర్డీవో చంద్రారెడ్డి, తహశీల్దార్ అలెగ్జాండర్, ఎస్‌ఐ తిరుపాజీలు చెక్కుల పంపిణిని సజావుగా చేయించారు.