మహబూబ్‌నగర్

సంక్షేమంలో తెలంగాణ నెంబర్ వన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దకొత్తపల్లి, మే 17: రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలుచేస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండలంలోని చెన్నపురావుపల్లి, కల్వకోలు, యాపట్ల, మారెడుమాన్‌దినె్న గ్రామాలలో రైతుబంధు, పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని రైతులనుద్దేశించి మాట్లాడారు. కల్వకోలు గ్రామంలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. వివిధ సంక్షేమ పథకాలను అమలుచేస్తూ వాటిని వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్, ప్రాజెక్టుల ద్వారా సాగునీరు, వ్యవసాయానికి ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచి రైతుల ఆత్మహత్యలను అరికట్టిన ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వమన్నారు. సర్పంచ్ విజయుడు మాట్లాడుతూ గ్రామంలో అధికారులు మధ్య దళారులతో కుమ్మక్కై భూ ప్రక్షాళన కార్యక్రమంలో అర్హులకు అన్యాయం చేస్తూ అనేక అక్రమాలకు పాల్పడినారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనికి మంత్రి జూపల్లి స్పందిస్తూ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ 10 మందితో ప్రత్యేకాధికారులను నియమించి సర్వే నెంబర్లు 171, 55లతోపాటు గత ఎన్నో సంవత్సరాలుగా రైతుల సొంత భూములు అనుభవిస్తున్న వారి పేర్లు పోయి అనర్హులైన వారి పేర్లు రికార్డులలో ఉన్నాయని దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి నిజమైన రైతులకు పాస్ పుస్తకాలు, చెక్కులను అందచేయాలని ఫోన్‌లోనే కలెక్టర్‌కు ఆదేశించారు. రైతుబంధు పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేపడుతున్న వివిధ పథకాలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని సర్పంచ్‌లు గ్రామస్థాయిలో అమలుచేయాలన్నారు. బాల్‌రెడ్డి అనే రైతు తనకు వచ్చిన రైతుబంధు చెక్కును రైతు సమన్వయ సమితికి చెందేలా మంత్రి జూపల్లికి అందజేయగా మంత్రి అభినందించారు. కార్యక్రమంలో జేసీ సురేందర్ కరణ్, ఎంపీపీ వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ వెంకటయ్య, ఉప సర్పంచ్ వెంకటస్వామి, ఎంపీటీసీ లక్ష్మీనారాయణ, నాయకులు విష్ణు, గోపాల్‌రావు పాల్గొన్నారు.