మహబూబ్‌నగర్

సాయాన్ని పెట్టుబడికే వినియోగించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవాబుపేట, మే 17: గత 70 ఏళ్ల పాలనలో రైతన్నకు కన్నీటి చుక్కలు చూపిస్తే.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో రైతుబంధు చెక్కులు చూపించి రైతుల కళ్లలో ఆనందాన్ని నింపిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీ. లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని చెక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వ్యవసాయాన్ని ప్రొత్సహించేందుకు పెట్టుబడి సాయం ఎకరాకు రూ.4వేలు చొప్పున ఏడాదికి రెండు పంటలకు రూ.8వేల చొప్పున రైతులకు అందజేస్తున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించే దిశగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందన్నారు. గత పాలకులు తెలంగాణ ప్రజలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. సాగునీరు లేక పెట్టుబడులు అందక కరంట్ కోతలతో రైతాంగం విలవిలలాడారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. సాగునీరు, కరెంట్ కష్టాలు తొలగిపోయాయని ఇప్పుడు పెట్టుబడి విషయంలో కూడా ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. రైతులకు నూతనంగా మార్పులు చేర్పులు చేసి అందించిన పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఇకపై ఎవరూ మార్చలేనివిధంగా ప్రభుత్వం తయారు చేయించిందని ఆయన పేర్కొన్నారు. కాసుల కాలం తీసేసి రైతులకు ఇక నుండి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని అన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ కొమురయ్య, తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ సాయిలక్ష్మీ, ఏఓ గోపినాథ్, జడ్పీటీసీ ఇందిరాదేవి, ఎంపీపీ శ్రీనయ్య, సర్పంచ్ వీరప్ప, మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు నరసింహులు, వెంకటేష్, నాగిరెడ్డి, ప్రతాప్, గోపాల్‌గౌడ్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం
బాలానగర్: రాష్ట్రంలోని రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం రాజాపూర్ మండల పరిధిలోని రంగారెడ్డిగూడ, బాలానగర్ మండల పరిధిలోని ఉడిత్యాల గ్రామాల్లో రైతుబంధు చెక్కులు, పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతు సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా రైతాంగం అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల్లో ఒండ్రుమట్టిని తీస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రజలకు శుద్ధ జలాలను అందించాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగునీరు అందించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ మాట్లాడుతూ రైతులు పంటల పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా పంటల పెట్టుబడుల కోసం రైతుబంధు పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, తహశీల్దార్ రాంబాయి, నరసింగరావు, సర్పంచులు యాదమ్మ, నిర్మల, అగ్రికల్చర్ ఏడీ నిర్మల, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, నరసింహులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీశైలంయాదవ్, వెంకటాచారి, కుమార్‌రెడ్డి, మోహన్‌నాయక్ పాల్గొన్నారు.