మహబూబ్‌నగర్

ఓట్ల కోసమే రైతుబంధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊట్కూర్, మే 19: కేసీఅర్ ప్రభుత్వం రైతులకు ఓట్ల కోసమే రైతుబంధు పథకం ప్రవేశపెట్టారని రైతుల పాసు పుస్తకాలు బ్యాంకులో ఉన్న వాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోట్వు సర్ట్ఫికేట్ అందించాలని మాజి ఎమ్మేల్యే దయకర్‌రెడ్డి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఊట్కూర్ మండల పరిదిలోని వల్లంపల్లి, పూలిమామిడి, కొత్తపల్లి, పాతపల్లి, పెద్దజట్రం గ్రామాలలో పల్లె పల్లెకు తెలుగుదేశం కార్యక్రమంలో బాగంగా టిడిపి జెండా అవిష్కారానికి ముఖ్యఅతిథిగా మక్తల్ మాజి ఎమ్మేల్యే దయకర్‌రెడ్డి హజరై టిడిపి జెండి అవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతుబంధు పేరుతో రైతలకు మోసం చేస్తుందని అన్నారు. రైతుల పాసు పుస్తాకాలు బ్యాంకులో ఉన్నాయని వాటికి నోట్వసర్ట్ఫికేట్ అందించాలని లేదంటే రాబోవు రోజుల్లో బ్యాంకుల అధికారులు రైతులపై వడ్డి బారం మోపడం ఖాయని అన్నారు. అందికు రైతులకు నోట్వసర్ట్ఫికేట్ అందింస్తే రైతులకు ఏలాంటి భయందోళ ఉండదని అయన తెలిపారు. రైతుబంధు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ 58వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. రైతుబంధు పాసు పుస్తకాల కోసం రూ. 200 కోట్లు ఖర్చు చేస్తుందని అయన తెలిపారు. ప్రభుత్వ సోమ్మును వృధాగా ఖర్చు చేయడం ఎంత వరకు సమాంజసమని అయన ప్రభుత్వని ప్రశ్నించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు ఇవ్వడంతో రైతులు తమ పంట పోలాలు సాగులోకి తీసుకోస్తారని లేదంటే ప్రభుత్వం ఇస్తున్న ఎకరాకు రూ. 4వేలతో పంట పోలాలు మొత్తం బీడుపడుతాయని ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం గమనించాలని అయన సూచించారు. కేసీఅర్ ఎన్నికల్లో చేసిన హమీలు నేటి వరకు నేరవేర్చలేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే ఎస్సి ముఖ్యమంత్రి చేస్తాను, ఎస్సి కులాలకు 3 ఎకరాల భూమి అందిస్తాను, తెలంగాణ ఏర్పాటు కోసం విరమరణం పోందిన వారి ఇంట్లో ఉద్యోగాలు, తెలంగాణలో 1లక్ష ఉద్యోగాలు ఇస్తామని చేప్పిన కేసీఅర్ వట్టి గాలి మాటలేనని అయన ఎద్దెవచేశారు. రాబోవు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయని అన్నారు. గతంలో టిడిపి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే నేడు తమ పేరు చేపుకుంటుంన్నారని అన్నారు. టిడిపి కార్యకర్తలు గ్రామాల్లో సైనికుల్లా పనిచేయాలని అయన సూచించారు. అనంతరం టిడిపి కార్యకర్తలకు క్రికేట్ కిట్‌ను అందజేశారు.

తెలంగాణను విముక్తి చేయడానికే ప్రజాసమితి
- రాష్ట్ర అధ్యక్షురాలు నీరాకిషోర్
గద్వాలరూరల్, మే 19: తెలంగాణను విముక్తి చేయడానికి తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటు చేయడం జరిగిందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు నీరాకిషోర్ అన్నారు. శనివారం మండల పరిధిలోని జమ్మిచేడు హరితహోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమెమాట్లాడారు. ఆంధ్రపాలకుల కబంధ హస్తాల నుండి తెలంగాణను విముక్తి చేయడానికి తెలంగాణ ప్రజాసమితి 1969 జనవరి 10న ఏర్పడిందన్నారు. ఉద్యోగ, ఉపాధి పాలన, ఆర్థిక, రాజకీయ రంగాలలో వారి ప్రాధ్యానత పెరిగి తెలంగాణ ప్రాంతం వారు రెండోశ్రేణి పేర్లుగా మార్చబడ్డాయన్నారు. ప్రముఖ పాత్రికేయుడు ప్రతాప్‌కిషోర్, పీఎన్‌స్వామి, రఘువీర్‌రావులు జై తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారని అన్నారు. అనతికాలంలో ఉద్యమం తీవ్రరూపం దాల్చి ఉస్మానియా యూనివర్శిటీ ఉద్యమానికి కేంద్రబింధువైందన్నారు. ఆ ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థి గద్వాల మండలం చెనుగోనిపల్లి గ్రామానికి చెందిన సర్వారెడ్డి పోలీసు కాల్పులలో మరణించారని వాపోయారు. సర్వారెడ్డి అంత్యక్రియల్లో వేలాది మంది పాల్గొనగా, ఆ నిరసనలో గద్వాల పట్టణానికి చెందిన వేణుగోపాల్ మృతి చెందారని అన్నారు. తెలంగాణ ప్రజాసమితికి, గద్వాలకు అంతటి పెనువేసుకున్న బంధం, అనుబంధం ఉందన్నారు. 2.20 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సిన నెట్టెంపాడు ప్రాజెక్టు 60 శాతం కూడా పూర్తి కాలేదన్నారు. ఆర్డీఎస్ ఎండిపోయినా తుమ్మిళ్లతో ఊరిస్తుందన్నారు. గట్టు ఎత్తిపోతల పథకం అందని పథకంగా మారిందని వాపోయారు. నిరుద్యోగుల సమస్య తీవ్రమైందన్నారు. జూరాల కాలువలో సీల్ట్ తీయకపోవడంతో ఆయకట్టు తగ్గిపోతుందన్నారు. నడిగడ్డలో అనేక సమస్యలు కోకొక్కలు ఉన్నాయని, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినా పూర్తి స్థాయిలో పాలన జరగడం లేదన్నారు. రాజకీయ ప్రాబల్యంతో అధికారులు భయపడిపోతున్నారని తెలిపారు. ఒకే కుటుంబ పాలన 70 ఏళ్లుగా కొనసాగుతుందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితికి ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధమవుతున్నారని, రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో పోటీ చేసి రాజకీయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.