మహబూబ్‌నగర్

అందుబాటులో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయిజ, మే 19: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతులకు మరింత సేవలందించేందుకు గాను తహశీల్దార్ కార్యాలయంలోనే తమ భూములను ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గాను తహశీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించినట్టు జిల్లా ఇన్‌చార్జి సంయుక్త కలెక్టర్ పి.వేణుగోపాల్ అన్నారు. శనివారం జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ మండలంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ భూముల క్రయవిక్రయాలు సులువుగా చేసుకునేందుకు తమ మండలంలోనే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఏకకాలంలో అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తహశీల్దార్ కార్యాలయం నుండే భూముల రిజిస్ట్రేషన్ అప్పగించిందన్నారు. ఈ రోజు ప్రారంభిస్తున్న అయిజ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కంప్యూటర్లు, అందుకు సంబంధించిన సిబ్బంది, సాఫ్ట్‌వేర్ సిద్ధంగా ఉందని, ఇందులో ఒక డమీ రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగిందన్నారు. వచ్చే 10 రోజుల తర్వాత ఈ కార్యాలయం నుండి క్రయవిక్రయాలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. జూన్ 2 తర్వాత మిగిలిన మండల తహశీల్దార్ కార్యాలయాల్లో కూడా సబ్ రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించడం జరుగుతుందన్నారు. జిల్లా రిజిస్ట్రేషన్ నోడల్ అధికారి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు మేలు చేకూర్చేందుకు ఇప్పటికే సమగ్ర భూ సర్వే నిర్వహించడంతో పాటు భూములను క్రమబద్ధీకరించిందని, ఇక నుండి వారి భూములు క్రయవిక్రయాలు తహశీల్దార్ కార్యాలయంలోనే జరుగుతాయని అన్నారు. ఒక గంటలోపే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ప్రక్రియ పూర్తయి దస్తావేజులు రైతుల చేతులకు అందుతాయని అన్నారు. ఉమ్మడి జిల్లాలో నాలుగు మండలాలలోని ఫైలెట్ ప్రాజెక్టుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందని, జూన్ 2 నాటికి అన్ని మండల కార్యాలయాలలో ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. సబ్ రిజిస్ట్రార్‌గా మండల తహశీల్దార్ యాదగిరి వ్యవహరిస్తారని అన్నారు. కార్యక్రమంలో ఈడీఎం ఫారూక్, గద్వాల సబ్‌రిజిస్ట్రార్ సురేష్ పాల్గొన్నారు.

ఆంజనేయస్వామిని దర్శించుకున్న హైకోర్టు జడ్జి
ఇటిక్యాల, మే19: మండల పరిధిలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంలో శనివారం అభయాంజనేయస్వామిని దర్శించుకున్న హైకోర్టు జడ్జి నాగార్జునరెడ్డి ఈ సందర్బంగా ఆలయ ఇఓ రామన్‌గౌడు ఆధ్వర్యంలో హైకోర్టు జడ్జి నాగార్జున్‌రెడ్డికి సాధర స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహంచారు. అనంతరం జడ్జికి శేషవస్త్రాలతో సన్మానించి ఆలయ విష్టితను వివరించి తీర్థప్రసాదలను అందజేశారు.

అనుమానాస్పద వ్యక్తులకు దేహశుద్ధి
గండిడ్, మే 19: ఆడవారి వేషాదారణలో సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులతో పాటు ఆటోడ్రైవర్‌కు దేహశుద్ది చేసిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలానికి చెందిన బాలచందర్, శ్రీశైలం, మల్లేషం, నరసింహ్మలు ఆడవారి వేషాదారణలో ఆటోలో శనివారం ఉదయం 9.30గంటల ప్రాంతంలో గండిడ్‌కు వచ్చారు. ఈ క్రమంలో స్థానికులు వారిని నిలదీయగా పొంతనలేని సమాధానం ఇచ్చారు. గతకొద్దిరోజుల కిందట వస్తున్న వద్దంతులపై మండల ప్రజలకు వారిపై అనుమానం వచ్చి పిల్లలను ఎత్తుకెళ్లేవారనే అనుమానంతో వారిని ఆటోలో బందించి పోలీసులకు సమాచారం అందించారు. హెడ్‌కానిస్టేబుల్ కృష్ణయ్య సంఘటన స్థలానికి చేరుకుని అనుమానితులను పోలీస్‌స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేయగా వారు హెడ్‌కానిస్టేబుల్‌ను తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశారు. దింతో ఆగ్రహించిన స్థానికులంతా ఒక్కసారిగా ఆటోపై దాడి చేసి నలుగురిని తీవ్రంగా చితకబాదారు. అనంతరం మహమ్మదాబాద్ ఎస్సై మురళీ, హన్వాడ మండల ఎస్సై రాంబాబులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకుని గాయపడిన నలుగురిని మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. అనుమానంతో దాడికి గురైన యువకులు రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలానికి చెందిన వారని వారంతా బుడగజంగాల వారని ప్రతిరోజు ఆడవారి వేషాదారణలో గ్రామాలకు వెళ్లి డబ్బులు అడుక్కునేవారని తెలిపారు. ఊహించని పరిణామంతో ఈ ఉత్కంఠత నెలకొందని తెలిపారు.